Indian Railways: సమ్మర్ సెలవులు దగ్గర పడుతున్న నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలకు వెళ్లి, తిరిగి వస్తున్న ప్రయాణీకులు ఇబ్బంది కలగకుండా భారతీయ రైల్వే తగిన చర్యలు చేపడుతుంది. డిఒమాండ్ కు అనుగుణంగా చర్లపల్లి- ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ సర్వీసులు జూన్‌లో ఎంపిక చేసిన తేదీలలో నడపడానికి షెడ్యూల్ చేసినట్లు తెలిపింది. ఇది రెండు ప్రాంతాల మధ్య ప్రయాణించే ప్యాసింజర్లకు అనుకూలంగా ఉంటుందన్నారు.
చర్లపల్లి – డెహ్రాడూన్ మధ్య నడిచే రైళ్లు ఇవే!
07077 నంబర్ గల సమ్మర్ స్పెషల్ రైలు జూన్ 10, 17, 24 తేదీలలో చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు(నంబర్ 07078) జూన్ 12, 19, 26 తేదీలలో డెహ్రాడూన్ నుంచి బయల్దేరి చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ సమ్మర్ స్పెషల్ రైళ్లు అన్నీ మంగళవారం అందుబాటులో ఉంటాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక రైళ్లు ఏయే స్టేషన్లలో ఆగుతాయంటే?
చర్లపల్లి- డెహ్రాడూన్ మధ్య నడిచే సమ్మర్ స్పెషల్ రైళ్లు కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హర్షా, నాగ్ పూర్, ఇటార్సి, రాణి కమలాపతి, బినా, ఝాన్సీ, ఆగ్రా, మధుర, హజ్రత్ నిజాముద్దీన్, మీరట్, రూర్కీ, హరిద్వార్ తో సహా అనేక కీలక స్టేషన్లలో ఆగుతాయి. రెండు మార్గాల్లో ఈ స్టేషన్లలో రైళ్లు హాల్టింగ్ తీసుకుంటాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
Read Also: రైలు నుంచి జారిపడి 146 మంది మృతి.. ఆ ఒక్క డివిజన్ లోనే!
ప్రయాణీకులు ప్రత్యేక రైళ్లను ఉపయోగించుకోవాలని సూచన
ఇక వేసవి రద్దీని కంట్రోల్ చేయడానికి, అదనపు ప్రయాణ ఎంపికలను అందించడానికి ఈ ప్రత్యేక రైలు సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ. శ్రీధర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే ముందు తాజా షెడ్యూల్ ను చెక్ చేసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న రైళ్లతో పాటు ఈ ప్రత్యేక రైళ్లను కూడా ఉపయోగించుకుని, ఎలాంటి ఇబ్బందులు లేని ప్రయాణాన్ని కొనసాగించాలన్నారు. సమ్మర్ రద్దీని కంట్రోల్ చేసేందుకు 150కి పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు శ్రీధర్ తెలిపారు. అవసరం అయితే, మరికొన్ని రైళ్లను అంబాటులోకి తీసుకురాన్నట్లు ఆయన తెలిపారు. సమ్మర్ సెలవులు అయిపోయిన నేపథ్యంలో సొంత ఊర్ల నుంచి ప్రజలు పట్టణాలకు చేరుకుంటున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లు రద్దీగా ఉన్నట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు శ్రీధర్ వెల్లడించారు.
Read Also: ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు వెళ్లాలా? ఇలా ఈజీగా ప్లాన్ చేసుకోండి!