Nara Lokesh – BIG TV: ప్రస్తుత సమాజంలో నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యం రాగానే వదిలేస్తున్నారు. చిన్నప్పుడు కంటికి రెప్పలా కాపాడి చూసుకుంటే పెరిగి పెద్దైన తరవాత పెళ్లి చేసి ఆస్తులు ఇస్తే తీసుకెళ్లి రోడ్లపై వదిలేస్తున్నారు. వృద్ధాప్యంలో ఎలా బ్రతుకుతారు.. ఏం తింటారు అని కూడా ఆలోచించకుండా కన్నబిడ్డల్లా కాకుండా కసాయి బిడ్డల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఘటనే తాజాగా ఏపీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… ప్రకాశం జిల్లా యర్రగొండపాళెంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది.
Also read: ఏపీలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు
రెండు రోజుల క్రితం యర్రగొండలాళెంలోని ప్రభుత్వ ఆస్పత్రికి సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి గుడి దగ్గర ఓ తల్లిని దీన స్థితిలో కసాయి కొడుకులు వదిలేసి వెళ్లిపోయారు. ఆ తల్లి కనీసం పైకి లేవలేని స్థితిలో, ఎవరైనా ఆహారం తీసుకుని వచ్చి ఇచ్చినా తినలేసి స్థితిలో ఉన్నారు. దీనినపై బిగ్ టీవీ న్యూస్ ఛానల్ కథనాన్ని ప్రచురించింది. కాగా ఈ వీడియో చూసిన ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. బిగ్ టీవీలో విజువల్స్ చూస్తే గుండె పగిలిపోయింది అంటూ ఎక్స్ పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు వెంటనే ఆహారం, వసతి కల్పించేందుకు అధికారులతో కలిసి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాను రాజకీయాల కోసం వాడకుండా ఎక్కువ సామాజిక సేవాకార్యక్రమాల కోసమే వాడుతున్నారు. ఎవరు సాయం కోరినా లోకేష్ వెంటనే సమాధానం ఇస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావారికి, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నవారికి అండగా ఉంటున్నారు. దీంతో లోకేష్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరవాత రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటూ ప్రజాసేవకే పెద్దపీఠ వేస్తున్నారని చెబుతున్నారు.
Heartbreaking to see these visuals. We will work with the authorities to provide her with food and shelter immediately.@OfficeofNL https://t.co/XE35m3vuCs
— Lokesh Nara (@naralokesh) November 25, 2024