Political Thriller on OTT: అవినీతి, రాజకీయ పలుకుబడి, భూసేకరణ, సామాన్య ప్రజలకు ఎదురయ్యే ప్రభుత్వ వ్యవస్థ తిప్పలు… ఈ అంశాలన్నింటినీ ఒక సామాన్య మహిళ పోరాటంతో అల్లిన మరాఠీ పొలిటికల్ డ్రామా ‘ది మహారాష్ట్ర ఫైల్స్’ (The Maharashtra Files 2026). సంజీవ్‌కుమార్ రాథోడ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉషా నాదకర్ణి, మంగేష్ దేశాయ్, సాయాజీ షిండే, వీణా జామ్‌కర్, నగేష్ భోస్లే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సినిమా తొలుత మే 29న విడుదల కావాల్సి ఉండగా, విడుదల వాయిదా పడి చివరకు జూన్ 12న థియేటర్లలోకి వచ్చింది. ఇక తాజాగా ఓటీటీలో కూడా అడుగు పెట్టింది. మరి ఈ పొలిటికల్ థ్రిల్లర్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు? తెలుగులో ఉందా లేదా ? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతాన్ని నేపథ్యంగా చేసుకుని ఈ కథ సాగుతుంది. ప్రభుత్వం చేపట్టే ఒక ప్రాజెక్ట్ కోసం అక్కడి రైతుల భూములను సేకరించే ప్రక్రియ మొదలవుతుంది. అభివృద్ధి పేరుతో భూములు తీసుకున్నప్పటికీ, వాటికి సరైన పరిహారం అందకపోవడంతో బాధితుల పరిస్థితి దారుణంగా మారుతుంది. ఈ వ్యవహారం వెనుక రాజకీయ పలుకుబడి, అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వంటి అంశాలు ఉంటాయి.
ఈ కథలో మెయిన్ రోల్ జానాబాయి రాథోడ్. బంజారా సమాజానికి చెందిన చదువుకోని వృద్ధురాలు జానాబాయి. ఆమె భూమిని కోల్పోయిన తర్వాత వచ్చిన పరిహారం తనకు సరిపోదని గుర్తిస్తుంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది వెనక్కి తగ్గిపోతారు. కానీ జానాబాయి మాత్రం అలా చేయదు. తనకు జరిగిన అన్యాయంపై పోరాడాలని నిర్ణయించుకుంటుంది.
అక్కడి నుంచే ఆమె పోరాటం మొదలవుతుంది. స్థానిక ప్రభుత్వ కార్యాలయాల నుంచి మొదలైన ఆమె ప్రయాణం చివరకు ముంబై వరకు వెళ్తుంది. ఒక్కో కార్యాలయం చుట్టూ తిరుగుతూ, తన సమస్యకు పరిష్కారం కోసం అధికారులను ప్రశ్నిస్తూ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో ఆమెకు రణ్‌వీర్ దేశ్‌ముఖ్ పాత్రలో మంగేష్ దేశాయ్, నయనా పాటిల్ పాత్రలో వీణా జామ్‌కర్ వంటి వ్యక్తుల నుంచి సహాయం లభిస్తుంది.
అయితే జానాబాయి పోరాటం కేవలం తన భూమి కోసం మాత్రమే కాకుండా, తనలాంటి ఎంతోమంది సామాన్య ప్రజల సమస్యలకు ప్రతీకగా మారుతుంది. ఒక వ్యక్తి ప్రభుత్వ వ్యవస్థను ఎదిరించినప్పుడు ఎదురయ్యే అధికారిక అడ్డంకులు, ఫైళ్లు కదలకపోవడం, బాధ్యత తీసుకోని అధికారులు, రాజకీయ ప్రభావం వంటి అంశాలను కథలో ప్రస్తావించారు. సినిమా ఈ సమస్యలను ఒక సామాన్య మహిళ ప్రయాణం ద్వారా చూపించారు. మరి ఇంతకీ ఆ వృద్ధురాలు అనుకున్నది సాధించిందా ? చివరికి ఏమైంది ? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ఈ సినిమా కేవలం రాజకీయ విమర్శలతోనే నడవదు. జానాబాయి పాత్రలో ఉషా నాదకర్ణి నటన బాగుంటుంది. మంగేష్ దేశాయ్, సాయాజీ షిండే, నగేష్ భోస్లే, వీణా జామ్‌కర్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ‘ది మహారాష్ట్ర ఫైల్స్’ అనేది యాక్షన్ లేదా కమర్షియల్ పొలిటికల్ ఎంటర్‌టైనర్ మాత్రం కాదు. , భూమి కోల్పోయిన ఒక సామాన్య మహిళ న్యాయం కోసం చేసే పోరాటాన్ని చూపించే సోషల్ పొలిటికల్ డ్రామా. అభివృద్ధి పేరుతో భూములు తీసుకున్నప్పుడు బాధితులకు సరైన పరిహారం, పునరావాసం, న్యాయం దక్కుతున్నాయా అనే ప్రశ్నను ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ఈ సినిమా మరాఠీ భాషలో రూపొందింది. Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: థియేటర్ ముఖం చూడకుండానే ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. హంతకుడెవరో కనిపెట్టగలరా?