E-Paper
Advertisement

చార్మినార్ వద్ద మహిళకు వింత అనుభవం.. నంబర్ ప్లేట్ లేని బైక్.. నకిలీ ర్యాపిడో డ్రైవర్ గుట్టు రట్టు!

చార్మినార్ వద్ద మహిళకు వింత అనుభవం.. నంబర్ ప్లేట్ లేని బైక్.. నకిలీ ర్యాపిడో డ్రైవర్ గుట్టు రట్టు!
Advertisement

Fake Rapido: హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద ఓ మహిళ తన సమయస్ఫూర్తితో ముప్పు నుంచి తప్పించుకున్న ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ అనుభవం స్పష్టం చేస్తోంది. అసలు అక్కడ ఏం జరిగిందంటే..

అనుమానం రేకెత్తించిన ప్రవర్తన

Advertisement

రాత్రి దాదాపు 9 గంటల సమయంలో సిద్ధి అనే మహిళ చార్మినార్ సమీపంలో ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం వేచి చూస్తోంది. అదే సమయంలో మహమ్మద్ ఇర్ఫాన్ అనే వ్యక్తి అక్కడకు వచ్చాడు. తాను ర్యాపిడో డ్రైవర్‌నని పరిచయం చేసుకున్నాడు. అయితే, అతడి వాహనానికి అసలు నంబర్ ప్లేట్ లేకపోవడాన్ని సిద్ధి గమనించింది. దీంతో ఆమెకు అతడిపై అనుమానం మొదలైంది.

అప్పటికప్పుడు యాప్ డౌన్‌లోడ్!

Advertisement

తన అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు ర్యాపిడో ఐడీ చూపించమని సిద్ధి అతడిని నిలదీసింది. దానికి సరైన సమాధానం చెప్పలేకపోయిన ఆ వ్యక్తి, కంగారులో అప్పటికప్పుడు ఫోన్ తీసి ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేయడం ప్రారంభించాడు. దీంతో అతడు నకిలీ డ్రైవర్ అని ఆమెకు పూర్తిగా అర్థమైంది.

Also Read: ‘మోడియా బింద్’ గ్లాసెస్‌తో ఎంపీ రేణుకా చౌదరి నిరసన.. వీడియో వైరల్!

వీడియో రికార్డ్ చేసి నెట్టింట పోస్ట్

ఈ విచిత్ర ప్రవర్తనను చూసి భయపడకుండా సిద్ధి ధైర్యంతో ఆ దృశ్యాలన్నింటినీ తన ఫోన్‌లో రికార్డు చేసింది. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. తెలియని వాహనాలు ఎక్కే ముందు జాగ్రత్త వహించాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.

Tags

Related News

ఆర్‌టీసీ గుర్తింపు ఎన్నికల వేల.. కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చిన ఎమ్మెల్యే కూనంనేని!

తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీ.. ఏ జిల్లాలకు ఎంత? పూర్తి వివరాలివే!

తెలంగాణలో కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు తేదీలివే?

బేగంబజార్‌లో నకిలీ నోట్ల దందా.. పోలీసులకు చిక్కిన రాజస్థాన్ యువకుడు!

మంత్రి పదవి రూమర్లకు చెక్ పెట్టిన రాజ్‌గోపాల్‌ రెడ్డి.. చివరికి ఎమన్నారంటే?

హెచ్‌సీఏ వర్సెస్ టీసీఏ.. ముదురుతున్న తెలంగాణ క్రికెట్ వివాదం!

అల్లుడి నోట్లో శనిలా రేవంత్, ఉత్తమ్!.. నీటి సంక్షోభంపై జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు!

మీ భూమి 22A జాబితాలో ఉందా? పెండింగ్ యూఎల్సీ దరఖాస్తులపై సర్కార్ కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×