BigTV English

Nellore Bus Accident: నారాయణ స్కూల్‌ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

Nellore Bus Accident: నారాయణ స్కూల్‌ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

Nellore Bus Accident: తిరుపతి జిల్లాలో నారాయణ స్కూల్‌ బస్సు బోల్తా పడింది. బోడిలింగాలపాడు వద్ద బస్సు అదుపుతప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. పలువురు విద్యార్థులకు గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.


వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లాలోని బోడి లింగాల పాడు జాతీయ రహదారిపై.. నారాయణ స్కూలు బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. అయితే ఈ బస్సులో మొత్తం 30 మంది విద్యార్ధులు ఉన్నారు. పలువురికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిచి చికిత్స నిమిత్తం సూళ్లూరిపేట తడ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం ఏమి లేకపోవడంతో తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం ఊపిరిపీల్చుకున్నారు.

డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సు కూడా కొంచెం పాతగా ఉండడం, బ్రేకులు కూడా సరిగ్గా పడకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగినట్లు.. కొంత మంది స్టూడెంట్స్ చెబుతున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గం సమీపంలో తరుచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా.. ఆర్టీవో అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. డ్రైవర్, ఆర్టీవో అధికారులపై పేరెంట్స్ పోలీసులు స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చినట్లు సమాచారం.


ఇదిలా ఉంటే.. అంబర్‌పేట్‌లో నలుగరు విద్యార్థుల మిస్సింగ్ మిస్టరీ వీడటం లేదు. ఎనిమిదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు 19వ తేదీ నుంచి కన్పించకుండా పోయారు. అంబర్‌పేట్, ప్రేమ్‌నగర్‌కు చెందిన ఎండి అజమత్ అలీ, కొండ్‌పేట తేజ్‌నాథ్ రెడ్డి, నితీష్ చౌదరి, కోరే హర్ష వర్ధన్ అనే నలుగురు విద్యార్థులు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. స్కూల్ ఎగ్జామ్స్‌లో కాపీ కొడుతూ దొరకడంతో టీచర్ మందలించి…పేరెంట్స్ కి విషయం చెప్పింది.

Also Read: వరంగల్‌‌లో దారుణం.. నడి రోడ్డుపై డాక్టర్ ను ఇనుపరాడ్లతో కొట్టి.. ఆపై హత్యాయత్నం

పేరెంట్స్ కూడా మందలించడంతో నలుగురు కలిసి ఇళ్లలో నుంచి వెళ్లిపోయారు. దీంతో విద్యార్థుల తలిదండ్రులు.. అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా కాచీగూడ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు అని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

 

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×