E-Paper
Advertisement

మోదీ చేసే పనిలో 10% చేసినా కాంగ్రెస్ బతుకుతుంది- కిషన్ రెడ్డి

మోదీ చేసే పనిలో 10% చేసినా కాంగ్రెస్ బతుకుతుంది- కిషన్ రెడ్డి
Advertisement

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ ప్రజలు రాహుల్ వైఖరిని అసహ్యించుకుంటున్నారని, ఆయన రాజకీయ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా మాట్లాడటం రాహుల్‌కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ చీకటి చరిత్ర

Advertisement

కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి ఎన్నికలను ఏడాది పాటు వాయిదా వేసిన చరిత్ర, పత్రికల గొంతు నొక్కిన రికార్డు కాంగ్రెస్‌దేనని గుర్తుచేశారు. 2009లో ఎన్నికల కమిషనర్లను తొలగించాలని సిఫారసు చేసింది కూడా ఆ పార్టీయేనన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసే బాధ్యత ఈవీఎంలపై లేదని, ఓడిపోయినప్పుడల్లా ప్రజా తీర్పును అవమానించడం కాంగ్రెస్‌కు అలవాటైపోయిందని విమర్శించారు.

365 రోజులూ ప్రజల్లోనే ఉంటాం

Advertisement

ఎన్నికల సమయంలోనే కాకుండా తమ ప్రభుత్వం 365 రోజులూ ప్రజల వద్దే ఉంటుందని చెప్పారు. గత 12 ఏళ్లుగా ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా నీతి, నిజాయితీలతో సుపరిపాలన అందిస్తున్నాం కాబట్టే ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో రోజూ కుంభకోణాల వార్తలే పతాక శీర్షికల్లో వచ్చేవని, మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తిని కాంగ్రెస్ కీలుబొమ్మగా మార్చి పరిపాలించిందని వ్యాఖ్యానించారు.

అర్బన్ నక్సలైట్లతో కుమ్మక్కు

కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సలైట్లతో కుమ్మక్కై పనిచేస్తోందని, సీజేఐ, ఆర్మీ చీఫ్, ఈడీ, సీబీఐ, చివరికి మీడియా వ్యవస్థలపై కూడా బురద చల్లుతోందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాలోని అక్రమాలను సరిచేస్తుంటే కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందన్నారు. షార్ట్‌కట్ రాజకీయాలు ఎల్లకాలం పనిచేయవని, ప్రధాని మోదీ చేస్తున్న పనిలో పది శాతమైనా చేస్తే కాంగ్రెస్‌కు మనుగడ ఉంటుందని హితవు పలికారు. రాజ్యాంగంలో చివరికి తీర్పు ఇచ్చేది ప్రజలేనని, రాహుల్ గాంధీ ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు.

Also Read: యూపీలో మారిన సీన్.. రాహుల్-అఖిలేష్ ఒక్కటయ్యారా? గెలుపు ఎవరిది?

Tags

Related News

అస్తిత్వ పోరాటానికి దృశ్య రూపం.. థియేటర్‌లో ‘పారడైజ్’ మూవీ వాచ్.. కేటీఆర్‌తోపాటు సీనియర్ నేతలు

ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు.. 30 మంది ప్రయాణికులు, చౌటుప్పల్ వద్ద ఘటన

డీసీఎం ఢీకొని ఆరు పాడి గేదెలు మృతి.. దిక్కుతోచని స్థితిలో అన్నదాత!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్!

కేసీఆర్ ప్రజల గుండెల్లో లేరు.. పామ్‌హౌస్‌లో దాక్కున్నారు! కేటీఆర్‌కి ఎమ్మెల్యే మురళీ నాయక్ కౌంటర్!

ఆర్టీసీ బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థి దుర్మరణం.. ఘట్‌కేసర్ వద్ద విషాదం!

ప్రతి గ్రామానికి సొంత భవనం.. వేసవి తాగునీటిపై సీతక్క స్పెషల్ యాక్షన్ ప్లాన్!

Big Stories

Advertisement
×