Simhachalam Temple: చాలామంది భక్తులు దేవాలయాల్లో వివాహాలు చేసుకోవాలని భావిస్తుంటారు. అక్కడ పెళ్లి చేసుకుంటే దేవుడి అనుగ్రహం ఉంటుందని, దానివల్ల మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతారు. సింహాచలం ఆలయంలో పెళ్లికి సిద్ధమవుతున్నారా? పాత పద్దతులను ఫాలో అయితే ఇబ్బందిపడినట్టే. వాటికి సంబంధించి కొత్త రూల్స్ వచ్చేశాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మధ్యతరగతికి చెందినవారిలో చాలామంది దేవుడి కొండ మీద పెళ్లిళ్లు చేసుకోవాలని ఆరాట పడుతుంటారు. దేవుని సన్నిధిలో వివాహాలు చేసుకోవడం వల్ల మంచి జరుగుతుందని వారి నమ్మకం. ముఖ్యంగా తిరుమల, అన్నవరం, సింహాచలం వంటి ప్రముఖ దేవాలయాలు ఏపీలో చాలానే ఉన్నాయి.
గతంలో సింహాచలం క్షేత్రంలో వివాహాలు చేసుకునే వారినుంచి గుత్తేదారులు భారీగా రుసుములు వసూలు చేసేవారు. అయితే పాత గుత్తేదారుల గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులు వివాహాలకు నూతన విధానాన్ని తీసుకొచ్చారు. ఆగష్టు 1 నుంచి శుక్రవారం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినట్టు దేవాలయం ఈవో త్రినాథరావు వెల్లడించారు.
సింహగిరిపై గజపతి సత్రం, పాదాలమ్మ, బంగారమ్మ ఆలయాలు, లోవ తోట వద్ద వివాహాలు చేసుకునేందుకు దేవస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భక్తులకు అసౌకర్యం లేని ప్రాంతాలు కొండ దిగువన గుర్తించి ఈవో అనుమతితో వివాహాలు చేసుకోవచ్చు. పెళ్లి బృందం తొలుత రూ.10 వేలు జమ చేయాలి.
ALSO READ: సీటు కోసం లొల్లి.. టీచర్‌ను రెండు డజన్ల మంది కుమ్మేశారు
వివాహానికి నెల రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. దేవస్థానం నుంచి విద్యుత్తు ఉపయోగించు కోవాలంటే ఆధారంగా ఛార్జీలుంటాయి. విద్యుత్తు దీపాలంకరణకు జనరేటర్ ఏర్పాటుకు అనుమతిస్తారు. వివాహం ముగిసిన మూడు గంటల్లోగా అద్దెకు ప్రాంతాన్ని ఖాళీ చేయాలి. దేవస్థానం నిర్వాహకులకు అప్పగించాలి.
పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర అవసరాల రీత్యా రుసుం వసూలు చేయనున్నారు. ముందుగా 5 వేలు రూపాయలు డిపాజిట్ కట్టాలి. వివాహం తర్వాత వాటిని ఇచ్చేస్తారు. దేవస్థానం సూచించిన ప్రాంతాల్లో భక్తులు పెళ్లి మండపాలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే విద్యుత్తు దీపాలంకరణకు కూడా. మరిన్ని వివరాల కోసం సింహాచలం దేవాదాయ శాఖ అధికారులను సంప్రదించాలి.