E-Paper
Advertisement

సాగునీటి రంగానికి పూర్వవైభవం.. రూ.160 కోట్ల బిల్లుల విడుదలపై మంత్రి నిమ్మల హర్షం

సాగునీటి రంగానికి పూర్వవైభవం.. రూ.160 కోట్ల బిల్లుల విడుదలపై మంత్రి నిమ్మల హర్షం
Advertisement

Nimmala Ramanaidu: ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి వ్యవస్థ పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల నిర్వహణ పనుల కోసం రూ.160 కోట్ల బిల్లులను విడుదల చేయడంపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ధ్వంసమైన వ్యవస్థకు మళ్లీ ప్రాణం

Advertisement

గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురై, తీవ్రంగా దెబ్బతిన్న నీటిపారుదల రంగాన్ని చంద్రబాబు మళ్లీ సరైన గాడిలో పెడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. గత పాలకుల హయాంలో కాలువల్లో పూడికతీత, లాకులు, షట్టర్లు, రోప్‌ల మరమ్మతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, చివరికి గ్రీజు పెట్టడానికి కూడా నిధులు కేటాయించలేదని ఆయన విమర్శించారు. వైకాపా ఐదేళ్ల కాలంలో ఓఅండ్ఎమ్‌ పనులకు కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేటాయించి ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు.

సాగునీటి సంఘాలకు పునర్జన్మ

Advertisement

గత ప్రభుత్వంలో రద్దు చేసిన సాగునీటి సంఘాల వ్యవస్థను తిరిగి పునరుద్ధరించడం ద్వారా సీఎం చంద్రబాబు రైతులకు కొండంత భరోసా ఇచ్చారని రామానాయుడు చెప్పారు. ఎల్ నినో వంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ, అందుబాటులో ఉన్న కొద్దిపాటి జలవనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో ఈ సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. రైతుల భాగస్వామ్యంతోనే సాగునీటి నిర్వహణ విజయవంతమవుతుందనే నమ్మకంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని వివరించారు.

నిధుల కేటాయింపులో స్పష్టమైన తేడా

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల వ్యవధిలోనే ఓఅండ్ఎమ్‌ పనుల కోసం ఏకంగా రూ.1320 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా నీటి నిర్వహణను పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన వెల్లడించారు.

Also Read:అల్వాల్‌లో దారుణం.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య.. కారణం తెలిస్తే షాక్! 

Tags

Related News

సెమీ కండక్టర్ పరిశ్రమకు హబ్‌గా విశాఖ.. సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

విశాఖలో సీఐఐ సదస్సులో నేతల సందడి! డోలు వాయించిన చంద్రబాబు, పవన్, పీయూష్ గోయల్

ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండుకార్లు, ప్రకాశం జిల్లాలో ఘటన

జగన్ దారిలో విజయసాయిరెడ్డి అడుగులు.. ఆనాడు వైసీపీ అలా, నేడు పీఆర్పీ ఇలా

ఢిల్లీలో రాహుల్‌తో షర్మిల భేటీ.. పెళ్లి పిలుపు మాత్రమేనా, వెనుక పెద్ద వ్యూహమే ఉందా?

అప్పుడు రాజకీయాలు వద్దన్నావ్.. ఇప్పుడెందుకు వచ్చావ్? విజయసాయి రెడ్డిపై కేఏ పాల్ ఫైర్

ఏపీకి మరో ముప్పు! బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, వాతావరణ శాఖ అలర్ట్

విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ పేరు ఇదే.. ట్యాగ్‌ లైన్‌కు తగినట్లే జెండా!

Big Stories

Advertisement
×