OTT Movieఒక కళాత్మక అభిరుచితో నిండిన హాలీవుడ్ సినిమా, గుండె గుభేల్‌మనిపించే సీన్స్ తో ఆకట్టుకుంటోంది. ఈ స్టోరీ ఒక డాన్సర్ చుట్టూ ఉత్కంఠభరితంగా తిరుగుతుంది. ఇందులో నటాలీ పోర్ట్‌మన్ తన అద్భుతమైన నటనకు ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
‘బ్లాక్ స్వాన్’ (Black Swan) 2010లో విడుదలైన అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. ఇది డారెన్ అరోనోఫ్స్కీ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో నటాలీ పోర్ట్‌మన్, విన్సెంట్ కాసెల్, మీలా కునిస్, బార్బరా హర్షీ, వినోనా రైడర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం న్యూయార్క్ సిటీ బ్యాలెట్ కంపెనీలో పనిచేసే ఒక డాన్సర్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. IMDbలో బ్లాక్ స్వాన్కి 8.0/10 రేటింగ్, రాటెన్ టొమాటోస్‌లో 87% రేటింగ్ ను ఈ సినిమా పొందింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
నీనా సాయర్స్ (నటాలీ పోర్ట్‌మన్) అనే అమ్మాయి న్యూయార్క్‌లోని ఒక ప్రముఖ బ్యాలెట్ కంపెనీలో డాన్సర్. ఆమె చాలా టాలెంటెడ్. కానీ ఎప్పుడూ పర్ఫెక్షన్ కోసం తాపత్రయపడుతుంది. ఆమె తల్లి ఎరికా, నీనాను ఎప్పుడూ కంట్రోల్ చేస్తూ, ఆమె జీవితంలో చిన్న చిన్న విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటుంది. దీని వల్ల నీనాకు స్వేచ్ఛ లేక, ఒత్తిడితో జీవిస్తుంటుంది. కంపెనీ డైరెక్టర్ థామస్ కొత్త సీజన్ కోసం “స్వాన్ లేక్” అనే బ్యాలెట్‌ను సెలెక్ట్ చేస్తాడు. ఈ బ్యాలెట్‌లో రెండు ముఖ్యమైన పాత్రలు ఉంటాయి. వైట్ స్వాన్ (మంచితనం ) బ్లాక్ స్వాన్ (నెగెటివ్ రోల్). నీనా వైట్ స్వాన్ పాత్రకు పర్ఫెక్ట్. కానీ బ్లాక్ స్వాన్ పాత్రకు ఆమె సరిపోదని థామస్ భావిస్తాడు. ఈ పాత్ర కోసం నీనా ఎంపికవుతుంది, కానీ ఆమెపై ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతుంది. ఇంతలో లిల్లీ అనే కొత్త డాన్సర్ కంపెనీలో చేరుతుంది. లిల్లీ స్వేచ్ఛగా ఉంటుంది. బ్లాక్ స్వాన్ పాత్రకు సరిగ్గా సరిపోతుంది. నీనా లిల్లీని ఒక స్నేహితురాలిగా, అదే సమయంలో పోటీదారుగా చూస్తుంది. థామస్ నీనాను మరింత స్వేచ్ఛగా డాన్స్ చేయమని, లిల్లీలా ఉండమని ఒత్తిడి చేస్తాడు. ఈ ఒత్తిడితో నీనా మనసు క్రమంగా కుంగిపోతుంది. ఆమెకు వింత హాలుసినేషన్స్ మొదలవుతాయి. అద్దంలో తన ప్రతిబింబం వేరేలా కనిపిస్తుంది. ఆమె శరీరంపై గాయాలు, ఈకలు రావడం లాంటి భయంకర దృశ్యాలు చూస్తుంది.
Read Also : రాత్రిపూట మాత్రమే డ్యూటీ చేసే పోలీస్… లేడీ యాక్టివిస్ట్ ఎంట్రీతో ఊహించని మలుపు… తెలుగులోనూ స్ట్రీమింగ్