Big Stories

AP Pensions: పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోనే డబ్బులు జమ

AP Pensions: మే పెన్షన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే నెల వృద్దులు పెన్షన్ల కోసం సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదని తెలిపింది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని నిర్ణయించింది. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు.

- Advertisement -

బ్యాంక్ ఖాతాలు లేనివారికి, దివ్యాంగులకు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. మే ఒకటి నుంచి 5 లోపు ఇంటి దగ్గర పెన్షన్ పంపిణీ చేసేలా సచివాలయ ఉద్యోగులతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఈసీ ఆదేశాలతో.. ఈ మార్పులు చేశారు.

- Advertisement -

అయితే రాష్ట్రంలో మొత్తంగా 64,49,854 మంది పెన్షనర్లు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా, వీరిలో 75 శాతం మందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని వెల్లడించింది. బ్యాంక్ అకౌంట్ లేని వారికి సచివాలయ సిబ్బంది నేరుగా అందించనున్నారు. సచివాలయ సిబ్బంది బ్యాంక్ అకౌంట్లు లేనివారి ఇంటి వద్దకే వెళ్లి నేరుగా అందించనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News