BigTV English

Pawan Kalyan : ట్రెండ్ సెట్ చేస్తారు.. ఇది కదా పవనిజం..

Pawan Kalyan : ట్రెండ్ సెట్ చేస్తారు.. ఇది కదా పవనిజం..

Pawan Kalyan : అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే.. అన్నాన్నంతా పట్టుకుని పిసకాల్సిన పనిలేదు. జస్ట్ రెండు మెతుకులు పట్టుకుంటే చాలు తెలిసిపోతుంది. అలాగే, పవన్ కల్యాణ్ అంటే ఏంటో చెప్పడానికి అలాంటి వందాలాది మెతుకులు ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత జనసేనాని రియాక్షన్ చూస్తేనే అర్థమైపోతోంది ఆయన ఎంతటి దేశ భక్తుడో.. ఎలాంటి హిందూ మత సంరక్షకుడో.


అలా మాట్లాడేది జనసేనాని ఒక్కరే..

కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు తెగబడ్డారు. 26 మంది పర్యాటకులను కాల్చి చంపారు. యావత్ దేశం ఇదే మాట్లాడింది. రాజకీయ నేతలంతా అదే అన్నారు. కానీ, పవన్ కల్యాణ్ మాత్రమే అది పర్యాటకులపై జరిగిన దాడిగా మాత్రమే చూడొద్దన్నారు. ఐడీ కార్డులు అడిగి, కల్మా చదవమని.. హిందువులని కన్ఫామ్ చేసుకుని మరీ కాల్చి చంపారని బహిరంగంగా మాట్లాడారు. ఇది హిందువులపై జరిగిన దాడి అని బలంగా చాటారు. అలా మాట్లాడిన బీజేపీయేతర నాయకుడు ఒకరైనా ఉన్నారంటే అది పవన్ కల్యాణ్ ఒక్కరే. ముస్లింలు దూరం అవుతారనో.. క్రిస్టియన్స్ ఓట్లు పోతాయనో చూడలేదాయన. జరిగింది హిందువులపై దాడి.. హిందువులు కాబట్టే వారిని చంపేశారంటూ.. కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఈనాటి రాజకీయాల్లో అలా మాట్లాడాలంటే దమ్మూ, ధైర్యం ఉండాలి. అది జనసేనానికి టన్నుల్లో ఉంది.


జనసేన దేశ భక్తికి ఫిదా..

అయ్యో పాపం అన్నారంతా. ఉగ్రదాడులను ముక్తకంఠంతో ఖండించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్యాండిల్ ర్యాలీలు తీశారు. పార్టీలకు అతీతంగా దేశం సంఘటితమైంది. అయితే, జనసేన మిగతా రోటీన్ పార్టీలకు భిన్నంగా స్పందించింది. పార్టీ తరఫున 3 రోజులు సంతాప దినాలు ప్రకటించింది. జనసేన జెండాను సగం వరకు అవనతం చేశారు. ఇది కదా దేశ భక్తి అంటే. మామూలుగా అయితే ఎవరైనా ప్రముఖులు మరణించినప్పుడు ఇలా సంతాప దినాలు ప్రకటిస్తుంటారు. మన దేశమే కదాని కశ్మీర్ చూద్దామని వెళ్లారు వారంతా. ఉగ్రవాదుల తుపాకీ తూటాలకు నేలకొరిగారు. ఆ అమాయక హిందువులు ప్రముఖుల కంటే ఎందులో తక్కువ? అందుకే, వారికి అత్యున్నత గౌరవం ఇచ్చారు జనసేనాని. వారికి అంజలి ఘటిస్తూ.. మూడు రోజులు సంతాప దినాలు పాటించి నివాళి అర్పించారు. గుండెల నిండా నిండిన దేశభక్తిని ఇలా ఘనంగా చాటారు పవన్ కల్యాణ్.

ఆఫ్ ద పీపుల్.. ఫర్ ద పీపుల్..

పహల్గాం ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగు వాళ్లు బలయ్యారు అని తెలిసి చలించిపోయారు. కావలికి చెందిన మధుసూదన్‌రావు స్వగ్రామానికి వెళ్లి మరీ ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి భార్య, పిల్లలను ఓదార్చారు. వారి ఆవేదన పంచుకున్నారు. మేమున్నామంటూ ధైర్యం చెప్పారు. విశాఖ వెళ్లి చంద్రమౌళి కుటుంబాన్ని సైతం ఓదార్చారు. వారి బాధను అర్థం చేసుకున్నారు. కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశారు. కష్టం వచ్చినప్పుడేగా నాయకుడు అనేవాడు అండగా నిలవాల్సింది. అదే చేశారు జనసేనాని. జనం కోసం.. జనం వెంటే.. ఉన్నారు. ట్వీట్లు, ప్రెస్‌మీట్లతో చేతులు దులుపేసుకునే రకం కాదాయన. ప్రజల్లోంచి వచ్చిన ప్రజా నాయకుడు పవన్ కల్యాణ్.

హిందువులకు ఒక్కటే దేశం..

ఇక సంతాప దినాల ముగింపు సందర్భంగా జనసేనాని చేసిన స్పీచ్ చరిత్రలో నిలిచిపోతుంది. పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళిగా 2 నిమిషాలు మౌనం పాటించారు. పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడే వారిని చీల్చిచెండాడారు. 26 మంది హిందువులను చంపినా ఇంకా పాకిస్తాన్‌కు సపోర్ట్‌గా మాట్లాడటం ఏంటంటూ.. అలాంటి వాళ్లంతా పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలంటూ ఘాటుగా స్పందించారు. సత్యం మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలని అన్నారు. ఆ ధైర్యం జనసేనానిలో బోలెడంత ఉంది. అందుకే అలా మాట్లాడగలిగారు. హిందువులకు ఉన్నది ఒకటే దేశమని.. ఇక్కడ కూడా ఉండొద్దంటే ఇంకెక్కడి పోవాలంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలంటూ ప్రజలకు పిలుపు ఇచ్చారు. మధుసూదన్ కుటుంబానికి పార్టీ తరఫున రూ. 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

గుండెల నిండా ధైర్యం

పవన్ స్పీచ్‌లో దేశం పట్ల భక్తి, గౌరవం కొట్టొచ్చినట్టు కనిపించింది. హిందువులకు మద్దతుగా అలా బహిరంగంగా మాట్లాడే సాహసం బహుషా ఏ రాజకీయ నాయకుడూ చేయలేడేమో అనిపిస్తుంది. అంతెందుకు.. హిందువులకు బ్రాండ్ అంబాసిడర్లమని చెప్పుకునే బీజేపీ నేతలు సైతం ఇలా ఓపెన్‌గా ఇప్పటి వరకూ మాట్లాడింది లేదు. మోదీ, అమిత్‌షా లు సైతం పాకిస్తాన్‌కు వెళ్లిపోండి అని స్టేట్‌మెంట్ ఇచ్చే ధైర్యం చేయలేదు. వాళ్లకు రూల్స్, ఓట్స్ అడ్డొచ్చాయేమో కానీ.. జనసేనాని మాత్రం అలా లెక్కలు వేసుకుని మాట్లాడే మనిషి కాదు. అన్ని మతాలను గౌరవిస్తూనే.. దేశం కోసం, హిందువుల కోసం, సనాతన ధర్మం కోసం.. పోరాటం చేసే మహా మనిషి.

అసలైన హిందువు పవన్

పవన్ కల్యాణ్ చిత్తశుద్ధిని కొలవడానికి ఎలాంటి కొలబద్ద లేదు. తిరుపతి లడ్డూ ప్రసాదంలో కొవ్వు ఆనవాళ్లు ఉన్నాయని తెలిసి ఆయనలోని హిందువు తల్లడిల్లిపోయాడు. తన వంతుగా ఆ ఏడుకొండల వాడిని క్షమించమని కోరుకుంటూ పశ్చాత్తాప దీక్ష చేశారు. ఇది కదా పవన్ కల్యాణ్ అంటే. అసలైన హిందువు అంటే.

కంటికి కనబడని యుద్ధం

కొండగట్టు అంజన్న పుత్రుడు. వారాహి భక్తుడు. కాషాయం కడతారు. తాను హిందువునని గొప్పగా చెప్పుకుంటారు. యూపీ సీఎం యోగి తర్వాత ఆ స్థాయిలో హిందుత్వాన్ని బహిరంగంగా ప్రకటించే రాజకీయ నాయకుడు పవన్ కల్యాణే. డిప్యూటీ సీఎంగా ఏమాత్రం తీరిక లేకున్నా.. సమయం కుదుర్చుకుని మరీ.. ఇటీవలే దక్షిణాది ఆలయాల పర్యటన చేశారు. ఏం? ఆ టైమ్ ఏదో సినిమాలకు కేటాయిస్తే.. ఆయనపై కోట్ల రూపాయల వర్షం కురవదా? నోట్ల కట్టలు ఆయన ముందు నాట్యం చేయవా? ఇప్పటికే ఫ్యాన్స్ ఓజీ.. ఓజీ.. ఓజీ.. అంటూ నానా రచ్చ చేస్తున్నారు. పవర్‌స్టార్‌ను తెగ ఇబ్బంది పెడుతున్నారు. అయినా, ఆయన కెమెరాల ముందుకు వెళ్లేందుకు రెడీగా లేరు. తిలకం ధరించి ఆలయాలకే వెళ్తున్నారు కానీ, షూటింగ్‌ల కోసం మేకప్ వేసుకోవడం లేదు. కాల్‌షీట్లు ఇవ్వడం లేదు. ప్రజల కోసం, ప్రభుత్వం కోసం, దేశం కోసం, ధర్మం కోసం, హిందుత్వం కోసం.. ఫుల్ టైమ్ సైనికుడిగా పని చేస్తున్నారు. కాలంతో, గడియారం ముల్లుతో.. కంటికి కనబడని యుద్ధం చేస్తున్నారు. దటీజ్ పవన్ కల్యాణ్. ఎనీ డౌట్స్?

-పవన్ వీరాభిమాని మనోగతం.

Also Read : మంచితనం ఎక్కువైపోయింది.. వాళ్లను పాకిస్తాన్ పంపేద్దాం.. పవన్ పవర్‌ఫుల్ స్పీచ్

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×