Iran War: అమెరికా, ఇజ్రాయెల్ మూకుమ్మడిగా ఇరాన్‌పై యుద్ధానికి దిగాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఈ యుద్ధం మొదలుపెట్టాడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రప్. తొలి దాడుల్లో ఏకంగా ఇరాన్‌లోని 500 మిలట్రీ టార్గెట్స్‌పై ఎటాక్ జరిగింది. ఈ దాడుల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చనిపోయారు. ఆయనతో పాటు టాప్ ఇరానియన్ అధికారులు కూడా హతులయ్యారు. అత్యంత అమానవీయంగా మినాబ్‌లోని ఓ బాలికల పాఠశాలపైనా ఎటాక్ జరిగింది. ఈ దాడిలో 153 మంది చిన్నారులు చనిపోయారు.
గల్ఫ్ కంట్రీస్‌పై భారీగా దాడులు
అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ తేలికగా లొంగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఆయుధ శక్తి పరంగా ఆ దేశాలకు ఏమాత్రం సరిపోని ఇరాన్.. వ్యూహాత్మకంగా ఎదురుదెబ్బ కొట్టింది. కీలక సీ-రూట్ హర్మూజ్‌లో రవాణా నిలిపేసింది. దీంతో చమురు ధరలు భగ్గుమన్నాయి. మరోవైపు అమెరికా పెట్టుబడులు, ఎయిర్‌బేస్‌లు ఉన్న గల్ఫ్ కంట్రీస్‌పై భారీగా దాడులు చేసింది. దీంతో ట్రంప్ డైలమాలో పడిపోయాడు. ఒక దశల్లో యుద్ధం నుంచి అమెరికా తప్పుకుంటుందన్న పరిస్థితి కనిపించింది. పాకిస్తాన్ ఎంట్రీతో చర్చలు మొదలయ్యాయి. కానీ అమెరికా డిమాండ్లకు ఇరాన్ తలొగ్గకపోవడంతో యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇరాన్ పంపిన ప్రతిపాదనల్ని ట్రంప్ తిరస్కరించడంతో యుద్ధంపై మళ్లీ అనిశ్చితి నెలకొంది.
ఇండియాపై తీవ్ర ఆర్థిక ప్రభావం..
యుద్దం జరిగేది అమెరికా-ఇరాన్ మధ్యే కానీ… దాని ప్రభావం మిగిలిన ప్రపంచంపైనా తీవ్రంగా ఉంది. చమురు ధరలు పెరగడంతో అన్ని దేశాల మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. అన్నిటికంటే ఇండియన్ స్టాక్‌మార్కెట్లు కాస్త ఎక్కువ పడుతున్నాయి. ప్రపంచంలోనే ఇండియా మూడో అతిపెద్ద ముడిచమురు దిగుమతిదారు. దీంతో ఇరాన్ వార్.. ఇండియాపై తీవ్ర ఆర్థిక ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా విదేశీ నిధుల మళ్లింపు కూడా ఎక్కువైంది. ఫలితంగా భారత మార్కెట్లు కుదేలవుతున్నాయి. చమురు దెబ్బతో ప్రతి వస్తువు ధరా చుక్కలంటుతోంది. సామాన్యుల ఇంటి బడ్జెట్‌పై ఏడు నెలల యుద్ధం ఎఫెక్ట్ తీవ్రంగానే ఉంది.
Also Read: 420 హామీలతో మోసం.. పీఎస్ లలో పెట్టాల్సింది రేవంత్ ఫొటోనే!- కేటీఆర్