AP Politics : అధికారంలోకి వస్తే ఎవ్వరిని వదిలిపెట్టం.. అంతకంతకు అనుభవించేలా చేస్తాం.. ఎవ్వరిని వదలం.. ఎక్కడున్నా వదలం.. అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే విషయాన్ని నేషనల్ మీడియా పవన్ ముందు ప్రస్తావించింది. ఈ వ్యాఖ్యలపై మీ రియాక్షన్ ఏంటని ప్రశ్నించింది. దానికి పవన్ ఇచ్చిన రియాక్షన్ హాట్ టాపిక్‌గా మారింది. జగన్ వర్సెస్ పవన్ ఎపిసోడ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లాక్కొని వస్తా.. జగన్ మాస్ వార్నింగ్
వైసీపీ నేతలను వేధించిన వారిని ఎవరినీ వదిలిపెట్టనంటూ జగన్ సీరియస్‌గా హెచ్చరించారు. కేడర్‌తో మీటింగ్ సందర్భంగా వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కార్యకర్తలను వేధించే వాళ్ల పేర్లను మీరు ఏ బుక్‌లోనైనా రాసుకోండి.. ఎక్కడున్నా వాళ్లని లాక్కొని వస్తా.. విదేశాలకు పారిపోయినా లాక్కొని వస్తా.. రిటైర్డ్ అయినా లాక్కొని వస్తా.. ఎవరినీ వదిలిపెట్టేది ఉండదు.. ఒక్కొక్కరికీ సినిమా ఎట్టా చూపించాలో అట్టా చూపిస్తా.. అంటూ జగన్ ఓ రేంజ్‌లో సినిమాటిక్ డైలాగులతో అదరగొట్టారు.
పవన్ రియాక్షన్ ఏంటంటే..
ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు విలేకరులు. జగన్ తిరిగి అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చారు దీనిపై మీ రియాక్షన్ ఏంటని అడిగారు. ఆ ప్రశ్నకు జనసేనాని ఏం చెబుతారు? ఎంత సీరియస్‌గా రియాక్ట్ అవుతారు? అంత సీన్ లేదంటారా? జగన్ సంగతి తేలుస్తామంటారా? ఆయన్నే లాక్కొచ్చి జైల్లో వేస్తామంటారా? జగన్ తిరిగి అధికారంలోకి రారని అంటారా? ఇలా పవన్ రియాక్షన్ ఎంత వయలెంట్‌గా ఉంటుందోనని ఎవరైనా అనుకుంటారు. కానీ, అక్కడ జరిగింది వేరు. పవన్ రియాక్షన్ చూసి అంతా షాక్ అయ్యారు. ఇంతకీ పవన్ ఏమన్నారంటే…
నవ్వుతో ఇచ్చిపడేశారు..
హహహహహ.. ఇదే పవన్ ఇచ్చిన ఆన్సర్. జగన్ వార్నింగ్ ఇచ్చారు కదా అనే ప్రశ్నకు పవన్ పగలబడి నవ్వారు. పిచ్చ లైట్ అన్నట్టు ఓ నవ్వు నవ్వారు. అవునా, అదీ చూద్దామన్నారు ఆయన. ఇప్పుడీ నవ్వు అనేక ప్రశ్నలను లెవనెత్తిందనే చెప్పాలి. మళ్లీ గెలుస్తామనే నమ్మకం ఉందా? ప్రజలు గెలిపిస్తారనే ఆశ ఉందా? అనే తీరులో ఉంది పవన్ స్మైల్.
Also Read : డబ్బుల్లేవ్.. చాలా ఇబ్బందిగా ఉందన్న జగనన్న..
సోషల్ మీడియాలో వైరల్
జగన్ వార్నింగ్ వర్సెస్ పవన్ రియాక్షన్.. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాకపోతే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. జగన్ గురువారం మాట్లాడితే.. పవన్ అంతకుముందు ఇచ్చిన పాత రియాక్షన్ అది. ఆ రెండూ వేరు వేరు సందర్బాలు. ఆ వీడియోలను క్లబ్ చేసి.. షూటబుల్‌గా వైరల్ చేస్తున్నారు.