E-Paper
Advertisement

వైసీపీ ఎంపీ ఉన్నా.. అభివృద్ధిలో వివక్ష లేదన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

వైసీపీ ఎంపీ ఉన్నా.. అభివృద్ధిలో వివక్ష లేదన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Advertisement

Proddatur: వైసీపీ ఎంపీ ఉన్నా, అభివృద్ధిలో ఏ మాత్రం వివక్ష లేదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. కూటమి ప్రభుత్వం ఓట్ల కోసం కాదని, ప్రజల బాగోగులు చూస్తుందని కుండ బద్దలు కొట్టేశారు. భావి తరాల కోసం తాము పనులు చేస్తున్నామని, కక్ష సాధింపులు ఏ మాత్రం లేవన్నారు. కేవలం అభివృద్ధే కూటమి ప్రభుత్వ విధానమని తేల్చేశారు.

కడప గడ్డపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

గత ప్రభుత్వంలో కూటమి మద్దతుదారు కాంట్రాక్టర్లు, ఉపాధి పనులు చేసిన చిన్న-మధ్య కాంట్రాక్టర్ల చెల్లింపులు నిలిపివేశారని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వివక్షకు తావులేకుండా చిన్న కాంటాక్ట్రర్లకు సకాలంలో నిధుల బిల్లులు చెల్లించామని తేల్చిచెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఇదే ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ఓ గ్రామ ప్రజలు తీవ్ర నిర్లక్ష్యాన్ని ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో కూటమి పార్టీలకు మద్దతుదారులు ఉండడంతో ఆ పని చేశారన్నారు.

వైసీపీ ఎంపీ ఉన్నా.. అభివృద్ధిలో వివక్ష లేదన్న డిప్యూటీ సీఎం

Advertisement

దాదాపు 6 వేలు మంద్రి ప్రజలున్న ఈ గ్రామానికి చెందిన పెద్దలు..  నాడు వినతిపత్రం ఇస్తే, వారి కళ్ల ఎదుట నలిపిన రోడ్డుపై పడేశారని వివరించారు. రోడ్లు, తాగునీరు ఏర్పాటు చేయాలని ఫెక్సీలను ఏర్పాటు చేస్తే, యువతను పోలీసుస్టేషన్ల చుట్టూ తిప్పారని మండిపడ్డారు. నాటి తాళ్లమాపురం పంచాయితీ ప్రజలు వివక్ష ఎదుర్కొన్నారని, ఇప్పుడు ఆ నియోకవర్గంలో కోట్లాది రూపాయలు పనులు జరుగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వం చూపిన వైఖరికి ఇది నిదర్శనం మాత్రమేనని చెప్పారు.

గత ప్రభుత్వంలో  ప్రజల ఎదుర్కొంటున్న వివక్షపై పవన్ రుసరుసలు

సోమవారం కడప జిల్లాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలు పథకాలకు ప్రారంభోత్సవాలు చేశారు. జల్ జీవన్ మిషన్ 2.0 – అమరజీవి జలధార పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. గతంలో వైసీపీ చేసిన పనులను ప్రజల ముందు ఎండగట్టారు. వేల కోట్లు ఖర్చు పెట్టి పనులు చేస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ రహదారుల పనులు చేసే సమయంలో మంచినీటి పైపులు ధ్వంసం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పైపులు ఉన్నాయా? లేవా అనేది చూడకుండా తవ్వకాలు జరుగుతున్నాయని, ఇవన్నీ సంబంధిత శాఖల విభాగాలతో కో-ఆర్డినేట్ చేస్తే పనులు తాఫీగా జరుగుతాయన్నారు.

Advertisement

ALSO READ: అనకాపల్లి జిల్లాలో విషాదం.. హిట్ అండ్ రన్ ఘటనలో దంపతులు మృతి!

Related News

కడప గడ్డ నుంచి జగన్‌కు సీఎం చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్, రూ. 40 కోట్ల సుపారీకి సమాధానం చెప్పాలి

అనకాపల్లి జిల్లాలో విషాదం.. హిట్ అండ్ రన్ ఘటనలో దంపతులు మృతి!

ఏపీలో స్పెషల్ టెట్-2026 హాల్ టికెట్లు విడుదల, షెడ్యూల్ ఇదే! ఫలితాలు మాత్రం

ఏపీలో లక్షన్నర కోట్ల BPCL రిఫైనరీ ప్రాజెక్టు.. పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్, శంకుస్థాపనకు ప్రధాని

విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

Big Stories

Advertisement
×