Kissik talks Supritha: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సొంతం చేసుకున్న సురేఖవాణి (Surekha Vani) ఒకప్పుడు పలు చిత్రాలలో నటించి, మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అలాంటి ఈమెకు ఈ మధ్యకాలంలో అవకాశాలు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. మరొకవైపు కరోనా వచ్చిన దగ్గర్నుంచి తన కూతురు సుప్రీత బండారు (Supritha bandaru) తో సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ.. వెకేషన్ కి వెళ్తూ.. అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ తెగ వైరల్ గా నిలిచారు. ముఖ్యంగా సురేఖ వాణి కూతురుగా కంటే కూడా ఇటు సోషల్ మీడియా ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది సుప్రీత.
అలా వచ్చిన ఆదరణతో ఈ మధ్యకాలంలో సినిమాలలో, షోలలో సందడి చేస్తూ బిజీగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన సుప్రీత.. తన కెరియర్ గురించి తమ తల్లికూతుళ్ళపై వచ్చిన ట్రోల్స్ గురించి ఎన్నో విషయాలను పంచుకుంది. తన వ్యక్తిగత జీవితం గురించి కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఈమె.. తన చదువును మధ్యలోనే ఆపేయడం వెనుక అసలు కారణాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇంటర్వ్యూలో భాగంగా వర్షా మాట్లాడుతూ.. ఎక్కడ పుట్టావు అని అడగా.. నేను పుట్టింది విజయవాడలోనే.. కానీ ఆ తర్వాత హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాము అంటూ తెలిపింది. వర్షా మాట్లాడుతూ.. విజయవాడ అమ్మాయి కాబట్టి అంత పవర్ అంటూ కామెంట్ చేసింది. సుప్రీత మాట్లాడుతూ.. విజయవాడ బ్లడ్ లోనే ఉంటుందేమో ఆ రౌడీయిజం . అమ్మవారి పవర్ విజయవాడ అమ్మాయిలకు వస్తుంది.. అందుకే ఇలా విజయవాడ అమ్మాయిలు హార్ష్ గా ఉంటారేమో అనిపిస్తుంది అంటూ తనదైన శైలిలో కామెంట్లు చేసింది.
మీ స్టడీస్ అంతా ఎలా సాగింది అని వర్షా అడగగా.. నేను 12th వరకు చదువుకున్నాను.. అదే సమయంలో మా నాన్న చనిపోయారు. ఆ తర్వాత కరోనా వచ్చింది. ఈ గందరగోళంలో సినిమా ఆఫర్లు వచ్చాయి. ఇక నేను చదువును ఆపేసి సినిమాల వైపు వెళ్ళాను అంటూ చెప్పుకొచ్చింది. నిజానికి చదువుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ తన తండ్రి మరణం తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేసిందని, ఆ తర్వాత కరోనా రావడం ఇలా ఎన్నో ఇబ్బందుల వల్లే తన చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది అన్నట్టుగా సుప్రీత కామెంట్లు చేసింది.. మొత్తానికైతే సుప్రీత 12th వరకు చదువుకుంది అని తెలిసి, అభిమానులు కూడా టాలెంట్ తో పని ఉండాలి ఎక్కడైనా బ్రతికేయొచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
వెన్నుపోటు పొడిచిన వారు ఎవరైనా ఉన్నారా? అని వర్షా అడగగా.. చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తే ఏడుస్తారేమో అంటూ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి ఆ తర్వాత తనలో మార్పు వచ్చిందని , ఆ ఇన్సిడెంట్ తర్వాత తాను ఎవరిని గుడ్డిగా నమ్మడం లేదు అంటూ చెప్పుకొచ్చింది సుప్రీత.