E-Paper
Advertisement

BSNL ధమాకా ఆఫర్.. ఒక్క రీఛార్జ్‌‌తో 380 రోజుల వ్యాలిడిటీ.. ఫ్రీ కాల్స్, రోజూ 2GB డేటా!

BSNL ధమాకా ఆఫర్.. ఒక్క రీఛార్జ్‌‌తో 380 రోజుల వ్యాలిడిటీ.. ఫ్రీ కాల్స్, రోజూ 2GB డేటా!
Advertisement

BSNL Plan: చౌకైనా రీఛార్జ్ ప్లాన్లను అందించడంలో బీఎస్ఎన్ఎల్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఈ ప్రభుత్వ టెలికాం సంస్థ.. ఎప్పటికప్పుడు రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంటోంది. అదే సమయంలో వాటిపై ఆఫర్లను సైతం అందిస్తోంది. ఈ క్రమంలోనే తన వార్షిక ప్లాన్ అయిన రూ.2,399పై అదనపు వ్యాలిడిటీని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. కాబట్టి ఆ ఆఫర్ తో పాటు ప్లాన్ కు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.

అదనపు వ్యాలిడిటీ ఎన్ని రోజులంటే?

సాధారణంగా BSNL తన రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. అయితే తాజాగా ప్రకటించిన ప్రత్యేక ఆఫర్ కింద ఈ ప్లాన్‌పై మరో 15 రోజుల అదనపు వ్యాలిడిటీని ఉచితంగా లభించనుంది. దీనివల్ల వినియోగదారులు ఒక్కసారి రీచార్జ్ చేసుకుంటే ఏకంగా 380 రోజుల పాటు కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ సేవలను పొందే అవకాశం లభించనుంది.

రోజుకు 2GB డేటా.. మొత్తం 760GB

Advertisement

ఇక ఈ ప్లాన్ ద్వారా ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా యూజర్లకు లభిస్తుంది. అయితే ఇన్నాళ్లు 365 రోజులకు 730GB డేటా మాత్రమే వచ్చేది. కానీ పొడిగించిన వ్యాలిడిటీ వల్ల వినియోగదారులకు మొత్తం 760GB డేటా అందనుంది. కాబట్టి డేటా అవసరం ఎక్కువ ఉండే యూజర్లకు ఈ వార్షిక ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు చెబుతున్నాయి.

ఉచిత కాల్స్, ఎస్ఎంఎస్‌లు

డేటాతో పాటు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితంగా మాట్లాడే వాయిస్ కాల్స్ బెనిఫిట్ ను ఈ ప్లాన్ అందిస్తోంది. దీనికి తోడు రోజుకు 100 SMSల చొప్పున ఈ 380 రోజుల వ్యవధిలో మొత్తం 38,000 ఎస్ఎంఎస్‌లను వినియోగదారులు ఉచితంగా పంపుకోవచ్చు.

Advertisement

Also Read: దసరా, దీపావళికి స్పెషల్ ట్రైన్.. చర్లపల్లి నుంచి బెంగళూరుకు కొత్త సర్వీస్!

అక్టోబర్ 15 వరకే ఛాన్స్!

రూ.2,399 రీచార్జ్‌పై పొడిగించిన 15 రోజుల వ్యాలిడిటీ ఆఫర్ కేవలం అక్టోబర్ 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎక్స్ వేదికగా బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఆ గడువు పూర్తయిన తర్వాత ప్లాన్ మళ్లీ సాధారణ 365 రోజుల వ్యాలిడిటీకే ప్లాన్ పరిమితమవుతుందని పేర్కొంది. కాబట్టి అధిక డేటా, ఫ్రీ కాల్స్ ను ఎక్కువ రోజులు కోరుకునే యూజర్లు ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలని బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలియజేస్తున్నాయి.

గమనిక: రీఛార్జ్ ధరలు, వ్యాలిడిటీ, ఆఫర్‌లు కంపెనీ నిర్ణయానుగుణంగా ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి రీచార్జ్ చేసుకునే ముందు BSNL అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌‌ ద్వారా చెక్ చేసుకుంటే మంచిది.

Also Read:  KBR పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ ప్లాన్ క్యాన్సిల్! అసలు ఏం జరిగిందంటే..?

Tags

Related News

వంటగదిలో వినోదం మిస్ అవ్వక్కర్లేదు.. పాత గూగుల్ హోమ్ డిస్‌ప్లే ఉంటే ఇలా వాడేయండి!

Airtel ధమాకా ప్లాన్.. రూ.279‌కే నెట్ ఫ్లిక్స్ సహా 18 పైగా ఓటీటీలు.. ఇక ప్రతిరోజూ పక్కా ఎంటర్‌టైన్‌మెంట్!

వాట్సాప్‌లో అదిరిపోయే ప్రైవసీ ఫీచర్.. ఇంతకీ’రెస్ట్రిక్టెడ్ చాట్’ అంటే ఏంటీ?

ఆన్ లైన్ షాపింగ్ చేయకపోయినా పార్శిల్ వచ్చిందా? ఇలా చేస్తే..నిలువునా మోసపోతారు!

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

Big Stories

Advertisement
×