E-Paper
Advertisement

Pawan Warning: పవన్‌కు హోంశాఖ? వైసీపీ గుండాలకు ఇక మూడేళ్లు ఇత్తడే, డోర్ డెలివరీ మాటేంటి?

Pawan Warning: పవన్‌కు హోంశాఖ? వైసీపీ గుండాలకు ఇక మూడేళ్లు ఇత్తడే, డోర్ డెలివరీ మాటేంటి?
Advertisement

Pawan Warning: ఏపీలో మంత్రుల శాఖలు మారుతున్నాయా? ఈసారి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హోంశాఖ దక్కనుందా? వైసీపీపై ఎదురుదాడి చేయాలంటే ఆయనకు హోంశాఖ బెటరని చంద్రబాబు సర్కార్ భావిస్తోందా? తాజాగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దేని సంకేతం? ఆయనకు ఆ పదవి దక్కే అవకాశాలున్నాయా? అవుననే అంటున్నారు కొందరు నేతలు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హోంశాఖ ఇచ్చే అవకాశం

Advertisement

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఏదైనా విషయం వచ్చినప్పుడు వాటికి కులాలను వైసీపీ నేతలు అంటగట్టడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుల రాజకీయాలు, నేరాలపై చర్చల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో రౌడీ షీటర్ చనిపోతే కులం అంటగడుతున్నారని వ్యాఖ్యానించారు.

డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు లేని కులం ఇప్పుడెందుకు వస్తుందని సూటిగా ప్రశ్నించారు. కులాల దరిద్రం వదిలితేనే ఏపీ బాగుపడుతుందన్నారు. ఇంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారు? అన్నింటికీ తాను మాట్లాడాలంటే ఎలా కుదురుతుంది? మీకు పౌరుషం లేదా? అంటూ ప్రశ్నలు రైజ్ చేశారు. కాకినాడలో జరిగిన మన ఊరు – మాట మంతి కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

వైసీపీ గుండాలకు పవన్ వార్నింగ్.. డోర్ డెలివరీ మాటేంటి?

రక్తపాతం సృష్టిస్తామని, నాలుకలు కోస్తామని విర్రవీగుతున్న వైసీపీ గుండాకు కెమెరా సాక్షిగా వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ గుండాల పిచ్చి వేషాలు మా దగ్గర చెల్లవని తేల్చేశారు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయని, ప్రజల చేతిలో నిర్ణయం ఉంటుందన్నారు. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం వచ్చినా మిమ్మల్ని తొక్కి నార తీస్తానని వ్యాఖ్యానించారు.

క్రిమినల్స్‌ పాలకులుగా ఉండకూడదని చెబుతూనే, నేరస్థులు రాజ్యాంగ పదవుల్లో కూర్చుని శాసిస్తామంటే జీవితాంతం పోరాడతానని తేల్చి చెప్పేవారు. లా అండ్‌ ఆర్డర్‌ చాలా కఠినంగా ఉండాలని, తాను హోంమంత్రిని కాకపోవడం క్రిమినల్స్‌ అదృష్టమన్నారు. శవాలు లేస్తే గానీ వైసీపీకి సంతోషం రాదని, వైసీపీ గూండాలను తొక్కి పట్టి నార తీస్తామని వ్యాఖ్యానించారు.

రానున్న మూడేళ్లలో వైసీపీకి నా యాక్షన్‌ ఏంటో చూపిస్తానని తేల్చేశారు. ఈ విషయంలో తన అభిప్రాయాలు ముఖ్యమంత్రికి చెప్పనని, తన ఆలోచనలను ప్రజలతో షేర్ చేసుకుంటానని మనసులోని మాట బయపెట్టారు. ఇలాంటి విషయాల్లో నేరుగా తాను ప్రజలతోనే మాట్లాడుతానని అన్నారు. వైసీపీ మళ్లీ రూలింగ్ లోకి రాదని తేల్చిచెప్పారు.

ALSO READ: కర్నూలు గడ్డ.. బంగారం అడ్డా.. దేశం చూపు ఇప్పుడు ఏపీ వైపే!

వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అది ఏ స్థాయి అధికారులైనా ప్రత్యేక దృష్టి పెడతానని తేల్చిచెప్పారు. అందరూ కలిసి వ్యవస్థలను నిర్వీర్యం చేసే పరిస్థితికి తీసుకొచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి విషయంలో ఎస్ఐ చేయాల్సిన పని చివరకు ఎస్పీ మొదలు డిప్యూటీ సీఎం వరకు వచ్చిందంటే వ్యవస్థలు ఫెయిల్ అయ్యాయని తేల్చేశారు.

హోంశాఖ విషయంలో గతంలోనూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ తరహా వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో మార్పింగ్ పోస్టుల విషయంలోనూ మండిపడ్డారు. తాజాగా ఈసారి కాస్త మాటల వేడిని పెంచారు డిప్యూటీ సీఎం. ఒకవేళ పవన్‌కు హోంశాఖ ఇస్తే..  రాబోయే మూడేళ్లు వైసీపీకి కష్టాలు తప్పవనే వాదన సైతం అప్పుడే మొదలైంది.

 

 

Related News

బెల్ట్ షాప్ మురళి హత్య కేసులో సంచలనం.. ప్రత్యక్ష సాక్షిని కిడ్పాప్ చేసిన ముఠా!

కాకినాడ జిల్లాలో ఘోరం.. రిజర్వాయర్‌లో పడి యువకుడు గల్లంతు

పొలిటికల్ రీ-ఎంట్రీపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్.. కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చేశారా?

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో దంపతులు మృతి!

అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్.. సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్!

కర్నూలు కలెక్టరేట్ ఆఫీస్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మహిళ మృతదేహంతో బంధువుల ధర్నా!

విశాఖ ఈస్ట్-వెస్ట్ కనెక్టివిటీ పై ప్రభుత్వం ఫోకస్.. సీఎం చంద్రబాబు బిగ్ ప్లాన్!

‘టీడీపీ అంటేనే వెన్నుపోటు పార్టీ’.. దేవరపల్లి వేదికగా జగన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×