
Perni Nani latest news(Latest political news in Andhra Pradesh):
టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. బాబుకు ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చినా ఎందుకు దాచి పెట్టారని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇచ్చిన విషయాన్ని ఓ ఆంగ్ల పత్రిక వార్త రాసిందని తెలిపారు.
అమరావతి పేరుతో డబ్బులు కొట్టేసింది నిజమా? కాదా?.. ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు వచ్చిందా? లేదా? ఇప్పటికే నోటీస్ వస్తే.. ఎందుకు చెప్పలేదు? అంటూ చంద్రబాబుపై ప్రశ్నలవర్షం కురిపించారు పేర్ని నాని.
రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో.. పలు ఇన్‌ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్‌లతో.. తన పీఏ శ్రీనివాస్ ద్వారా.. చంద్రబాబు 118 కోట్లు ముడుపులు తీసుకున్నారంటూ ఆ ఆంగ్లపత్రిక వార్తను పేర్ని ప్రస్తావించారు. చంద్రబాబుకు దమ్ముంటే ఐటీ నోటీసులపై నోరు విప్పాలని.. లోకేశ్ ముందు పాదయాత్ర ఆపి తన తండ్రి అవినీతిపై మాట్లాడాలని నిలదీశారు. లోకేశ్‌కు ఆ ఆంగ్లపత్రికపై దావా వేసే దమ్ముందా? అని ప్రశ్నించారు.