E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

అమరావతిలో ప్రతిష్టాత్మక సీఐఐ గ్లోబల్ సెంటర్.. సీఎం సమీక్షలో కీలక నిర్ణయాలు ఇవే!

అమరావతిలో ప్రతిష్టాత్మక సీఐఐ గ్లోబల్ సెంటర్.. సీఎం సమీక్షలో కీలక నిర్ణయాలు ఇవే!
Advertisement

CII Partnership Summit: నవంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకమైన 31వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు నిర్వహణకు వేదిక సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ఈ సదస్సుపై విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణతో పాటు వినూత్న ఆలోచనల మార్పిడికి ఈ సదస్సు ఒక వేదిక కానుంది.

సదస్సు వేదిక, ప్రధాన థీమ్

Advertisement

ఈ ఏడాది నవంబర్ 12, 13వ తేదీల్లో విశాఖపట్నం వేదికగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈ సదస్సును ‘Navigating Change: Leadership, Technology, Trust and Trade in a Transforming World’ అనే ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సులో ఎంఓయూలు, మినిస్టీరియల్ సెషన్స్, ప్లీనరీ, కంట్రీ సెషన్స్‌తో పాటు బిజినెస్ టు బిజినెస్ (B2B), బిజినెస్ టు గవర్నమెంట్ (B2G) సమావేశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

Also Read:వరంగల్ మేయర్ పీఠమే టార్గెట్.. 2028లో తెలంగాణపై కమలం జెండా పక్కా- బండి సంజయ్

Advertisement

దేశవిదేశాల్లో రోడ్‌ షోలు

విశాఖ సదస్సుకు ముందస్తుగా రాష్ట్రంలోని పలు నగరాల్లో ప్రాంతీయ భాగస్వామ్య సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి, తిరుపతి, అనంతపురం, రాజమండ్రి లేదా కాకినాడ వంటి ప్రాంతాల్లో ఈ సదస్సులు ఉంటాయి. అలాగే సదస్సు విజయవంతం కోసం జూలై నుండి సెప్టెంబర్ వరకు దేశవిదేశాల్లో భారీగా రోడ్ షోలు నిర్వహించనున్నారు. దేశీయంగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కోయంబత్తూర్, అహ్మదాబాద్, హైదరాబాద్ నగరాల్లో ఈ ప్రచార కార్యక్రమాలు సాగుతాయి.

Also Read: జైపూర్‌లో విషాదం.. రిసార్ట్ గోడ కూలి ముగ్గురు కార్మికులు మృతి!

నాలెడ్జ్ షేరింగ్, ఫ్యూచరిస్టిక్ రంగాలపై సీఎం మార్గదర్శకత్వం

ఈ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కేవలం పెట్టుబడులు, ఎంఓయూలకే పరిమితం కాకుండా, నాలెడ్జ్ షేరింగ్‌కు పెద్దపీట వేయాలని స్పష్టం చేశారు. పబ్లిక్ పాలసీలు, ఫ్యూచరిస్టిక్ రంగాలపై చర్చలు జరగాలన్నారు. వ్యవసాయం, ఉద్యానరంగం, ప్రకృతి వ్యవసాయంతో పాటు సర్క్యులర్ ఎకానమీ, ఆధ్యాత్మికత, ఒత్తిడి లేని పని విధానం (స్ట్రెస్ ఫ్రీ వర్క్) వంటి అంశాలను అజెండాలో చేర్చాలని సూచించారు.

గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్ ఏర్పాటు

ఈ సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీల నిపుణులను ఆహ్వానించనున్నారు. ఇదే తరుణంలో పారిశ్రామిక రంగానికి మరింత ఊతమిచ్చేలా ‘సీఐఐ గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నట్లు’ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.

Related News

కాపులను జనసేనకు దూరం చేయడమే వైసీపీ ప్లాన్ – ఎమ్మెల్సీ హరిప్రసాద్

Palla Srinivasa Rao: కూల్ డ్రింక్స్ కంటే బీరే హెల్తీ.. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్..!

పద్ధతి మార్చుకోకపోతే చెప్పు దెబ్బలు తప్పవు.. వైసీపీ నేతలపై మంత్రి కొల్లు సంచలనం!

Saikrishna lock-up death case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. దర్యాప్తు స్పీడ్ పెంచిన సిట్, కానిస్టేబుల్ అరెస్ట్

అక్కడ వచ్చింది గొడ్డలి ఫ్యాక్టరీలే.. జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై భూమిరెడ్డి హాట్ కామెంట్స్!

రైతన్నలకు ఊరట.. సామాన్యులకు వణుకు.. తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

అమరావతి పేరుతో చంద్రబాబు భారీ దోపిడీ.. రూ.47 వేల కోట్ల అప్పు ఎందుకు?- అంబటి రాంబాబు

Big Stories

×