White Gold:పారదర్శకత అలాగే నమ్మకంతో బంగారం కొనుగోలులో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది “వైట్ గోల్డ్ సంస్థ”. వాస్తవానికి 2018 లోనే ఈ వైట్ గోల్డ్ సంస్థ బెంగళూరులో ప్రారంభించబడింది. ఆర్థిక అవసరాల సమయంలో తమ బంగారం విక్రయించాలనుకున్న వారికి.. గౌరవప్రదమైన పద్ధతులతో కూడిన సులువైన మార్గాలను అందించాలనే లక్ష్యంతోనే బంగారం కొనుగోలులో విప్లవాత్మకంగా ముందుకు వచ్చింది ఈ స్టార్టప్ సంస్థ. బంగారం విక్రయం అనేది చారిత్రకంగా అవ్యవస్థిత, అవిజ్ఞత ప్రక్రియగా కొనసాగుతుంది. అందుకే ఈ లోపాన్ని సవరిస్తూ వైట్ గోల్డ్ కస్టమర్లకు పారదర్శక, సమర్థవంతమైన సేవలను అందిస్తూ నమ్మకమైన సంస్థగా పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా పాత బంగారం లేదా వాడకానికి అనువుగా లేని బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడంలో వైట్ గోల్డ్ సంస్థ చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. కేవలం 30 నిమిషాల్లో పూర్తయ్యే ప్రక్రియతో కష్టమర్లకు తక్షణమే నగదు అందించడంలో ముందుంటుంది. కస్టమర్ నమ్మకం, సౌలభ్యాన్ని కేంద్రీకరిస్తూ పారదర్శకత, వేగం, విశ్వాసం పరంగా పరిశ్రమలో ప్రణాళికలను స్థాపించింది.
వైట్ గోల్డ్ కస్టమర్ నమ్మకాన్ని ,పారదర్శకతను ఎలా కాపాడుతుంది?
వైట్ గోల్డ్ వారు అందించే విలువ అలాగే చెల్లించే ప్రక్రియలో అత్యున్నత స్థాయి, నమ్మకాన్ని నిర్ధారించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా బంగారం స్వచ్ఛతను శాస్త్రీయంగా అలాగే కచ్చితంగా అంచనా వేయడానికి జర్మన్ స్పెక్ట్రోమీటర్లను ఉపయోగిస్తున్నారు. ఇక కచ్చితమైన విలువలతో క్యాలిబ్రేట్ చేయడానికి ప్రామాణికమైన తూక పరికరాలు ఉపయోగిస్తున్నారు. అంతేకాదు రియల్ టైం బంగారం రేట్లను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో ప్రదర్శించే ఏకైక సంస్థగా వైట్ గోల్డ్ పేరు దక్కించుకుంది. నిర్వహణకు సంబంధించి ఉన్న ప్రమాదాలను తొలగిస్తూ.. లావాదేవీలను సురక్షితంగా సులభంగా చేసే విధంగా డిజిటల్ లావాదేవీలను ఉపయోగిస్తున్నారు.
వైట్ గోల్డ్ మార్కెట్ ఎక్కడెక్కడ విస్తరించింది?
ఇక ఈ వైట్ గోల్డ్ సంస్థ దాదాపు 60 కి పైగా శాఖలతో ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో విస్తరించింది. 200 కు పైగా ఉద్యోగులతో లక్ష మందికి పైగా సంతృప్తికరమైన కస్టమర్లకు సేవలు అందిస్తోంది. దీనికి తోడు ఇటీవల విజయవాడ, తిరుపతి, గుంటూరులో కూడా కొత్త శాఖలను ప్రారంభించారు. ప్రస్తుతం తెలంగాణలో కూడా అడుగుపెట్టి హైదరాబాదులో మూడు శాఖలను ప్రారంభించడం జరిగింది. అలాగే త్వరలో విశాఖపట్నంలో ఒక కొత్త శాఖను ప్రారంభించి, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలలో కూడా తమ సేవలను వేగంగా విస్తరించే యోచనలో వైట్ గోల్డ్ సంస్థ నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం. దక్షిణ భారతదేశపు ప్రముఖ బంగారం కొనుగోలు బ్రాండ్గా ఎదగాలన్నదే తమ లక్ష్యం అని సంస్థ అధికారులు చెప్పుకొచ్చారు.
వైట్ గోల్డ్ బ్రాండ్ భాగస్వామ్యాలు ఎవరంటే?
వైట్ గోల్డ్ కస్టమర్లలో తన బ్రాండ్ విశ్వాసాన్ని బలపరిచేందుకు అనేక ప్రాముఖ్యమైన క్రీడా సంస్థలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ టీం తో సమన్వయం అయింది. అంతేకాదు స్థానిక ప్రజలతో సంబంధాన్ని బలపరచుకోవడానికి జాతీయ స్థాయిలో తమ బలాన్ని తెలియజేయడానికి బెంగళూరు బుల్స్ ప్రో కబడ్డీ లీగ్ తో భాగస్వామ్యం చేసుకుంది. ఇక కన్నడ టెలివిజన్లో అగ్రశ్రేణి ప్రకటనదారుగా కూడా డిజిటల్ మాధ్యమాలలో మీడియా ఉనికిని సొంతం చేసుకుంది.