BigTV English

NBK PSPK: పవన్, బాలయ్య కేక.. ఏపీలో కాక.. ఇక పొలిటికల్ అన్ స్టాపబుల్!?

NBK PSPK: పవన్, బాలయ్య కేక.. ఏపీలో కాక.. ఇక పొలిటికల్ అన్ స్టాపబుల్!?

NBK PSPK: NBK అన్ స్టాపబుల్ కి PSPK. ఆ షూటింగ్ విజువల్స్, ఫోటోస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ రేర్ కాంబినేషన్ ఎక్కడలేని ఆసక్తి రేపుతోంది. ఎంటర్టైన్ మెంట్ పరంగా కేక పెట్టిస్తున్న ఈ షో.. ఇప్పుడు ఏపీలో పొలిటికల్ గానూ కాక రేపుతోంది. ఇటు పవన్ ఫ్యాన్స్, అటు బాలయ్య అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఆ ఆహా షో.. కొందరి మతి పోగొడుతుంటే.. మరికొందరిని కలవర పెడుతోందని అంటున్నారు. ఆ జోడీ ఏంట్రా బాబూ.. అంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.


చాలాకాలం పాటు మెగా ఫ్యామిలీకి, బాలయ్యకు మధ్య బాగా దూరం ఉండేది. వాళ్లు, వీళ్లు కలవడం చాలా అరుదు. ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ గొడవలే. సోషల్ మీడియాలో పంచ్ లే. అలాంటిది, ఆహాలో అన్ స్టాపబుల్ షోతో సీన్ మొత్తం మారిపోయింది. బాలయ్య-అల్లు కుటుంబం మధ్య స్నేహం కుదిరింది. పరోక్షంగా మెగా ఫ్యామిలీకి నందమూరి నటసింహం దగ్గరైంది. అప్పటి నుంచి అంతా కలిసిపోయారు. అన్ స్టాపబుల్ కోసం వరుసబెట్టి సినీ, రాజకీయ ప్రముఖులతో షో చేస్తున్న బాలయ్య.. లేటెస్ట్ గా పవన్ కల్యాణ్ తో అన్ స్టాపబుల్ చేయడం టీఆర్పీ రికార్డ్సును బద్దలు కొట్టడం పక్కా అంటున్నారు.

బాలయ్య, పవన్ ల రేర్ కాంబినేషన్.. రాజకీయంగానూ రఫ్ఫాడించడం ఖాయమంటున్నారు. వారిద్దరూ పొలిటికల్ గానూ ఒకే వేదిక మీదకు వస్తే..? ఫ్యాన్ రెక్కలకు చుక్కలే అంటూ చర్చ నడుస్తోంది.


బాలయ్య టీడీపీ ఎమ్మెల్యే, చంద్రబాబుకు బావమరిది. ఇక పవన్ జనసేనాని. వాళ్లిద్దరి పంతం ఒక్కటే.. ఉమ్మడి టార్గెట్ జగన్ ఒక్కడే. ఏపీలో ఈసారి జనసేన, టీడీపీల పొత్తు ఉంటుందంటూ గట్టిగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలి పోనీయనంటూ జనసేనాని పదే పదే చెబుతున్నారు. అంటే టీడీపీ, జనసేన పొత్తు ఖాయమేనంటూ ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే, ఆ కాంబినేషన్ పొలిటికల్ గా అన్ స్టాపబుల్ అని అంటున్నారు.

ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో బాలయ్యను పవన్ కల్యాణ్ కలవడం.. 20 నిమిషాలు ఏకాంతంగా వన్ టు వన్ మాట్లాడుకోవడం.. ఇప్పుడు కలిసి షో చేయడం చూస్తుంటే.. ఈ కలయిక త్వరలోనే రాజకీయ కలయికకు మార్గం సుగుమం చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే బాలయ్య మాటను బావ చంద్రబాబు కదనలేరు. జనసేనలో నిర్ణయాధికారం జనసేనానిదే. మరి ఈ ఇద్దరూ ఒక్కటైనట్టుగానే.. టీడీపీ, జనసేన సైతం ఒక్కటి కావడం ఏమంత కష్టం?.. అలా జరిగితే జగన్ కే నష్టం..అంటున్నారు.

Related News

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Big Stories

×