Pawan Kalyan : వ్యూహం నాకు వదిలేయండి. నేను చెప్పినట్టు చేయండి చాలు.. ఎన్నికల ముందు జనసేనాని కేడర్‌కు పదే పదే చేసిన సూచన. అదే నిజమైంది. పవన్ వ్యూహమే ఫలించింది. తక్కువ సీట్లు తీసుకుని.. 100 శాతం స్ట్రైక్ రేట్ కొట్టి.. ఎక్కువ మెజార్టీతో కూటమి ప్రభుత్వం కొలువుదీరిందంటే అది జనసేనాని చాతుర్యమే. 40 ఏళ్ల టీడీపీని గెలిపించింది తామేనని పవన్ గర్వంగా చెబుతున్నారు కూడా. ఆ మాట నిజం. అదే పవనిజం.
మోదీలా చంద్రబాబు సైతం వరుసగా మూడుసార్లు సీఎం కావాలి. లేటెస్ట్‌గా పవన్ కల్యాణ్ చేసిన ఈ కామెంట్‌పై రాజకీయంగా ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. పవన్ ఏదో ఫ్లోలో అన్నారా? కావాలనే ఆ కామెంట్ చేశారా? మరో 15 ఏళ్లు చంద్రబాబు సీఎంగా ఉండటం సాధ్యమేనా? జనసేనాని డిప్యూటీతోనే సరిపెట్టుకుంటారా? లోకేశ్ పరిస్థితి ఏంటి? జనసేన ఫ్యూచర్ ఏంటి? ఇలా రకరకాల క్వశ్చన్స్.
ప్రస్తుతం చంద్రబాబు ఏజ్ 74. మరో 15 ఏళ్లు కలిపితే 89. ఏ వయస్సులోనూ బాబు ఇంతే యాక్టివ్‌గా ఉంటారా? అంటే డౌటే. ఇప్పటికే లోకేశ్ ఫుల్‌గా ఎమర్జ్ అయ్యారు. బాబు తర్వాత చినబాబే సీఎం అని అంటున్నారు. అందుకు మరో 15 ఆగాలా? అనేది తెలుగు తమ్ముళ్ల మాట.
సీఎం.. సీఎం.. సీఎం.. ఎన్నికల వరకూ పవన్‌కు ఈ గోల తప్పలేదు. డిప్యూటీ సీఎం అయ్యాక కానీ ఆ సీఎం స్లోగన్స్ ఆగలేదు. మరి, జనసైనికుల సీఎం డ్రీమ్ కోసం ఇంకో 15 ఏళ్లు ఎదురుచూడాలా? అంత ఓపిగ్గా ఉండగలరా? పవన్ కల్యాణ్ నెంబర్ 2కే పరిమితం అవుతారా? అలా అవ్వగలరా?.. అనేది జనసైనికుల వెర్షన్.
Also Read : మర్రీ vs రజినీ.. చూస్కుందాం.. నీ పెతాపమో.. నా పెతాపమో!!
జనసేనాని ప్రతీది ఆచితూచి మాట్లాడుతుంటారు. ఏదో యధాలాపంగా మాట్లాడే మనిషి కానే కాదు. తను ఓ మాట మాట్లాడితే అది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో అందరికంటే ఆయనకే బాగా తెలుసు. అలాంటి పవన్.. మోదీలా మూడుసార్లు చంద్రబాబే సీఎం అవ్వాలని కోరుకోవడం ఆసక్తికర అంశమే. చంద్రబాబుపై తనకు ఎంతటి అభిమానం ఉందో చెప్పటానికే ఆయన అలా అని ఉంటారే కానీ.. అందులోంచి గుడ్డు మీద ఈకలు పీకాల్సింది ఏమీ లేదనేది పార్టీ శ్రేణుల మాట. కూటమి ప్రభుత్వం గట్టిగా నిలబడాలని.. మరో 15 ఏళ్ల పాటు వైసీపీకి ఛాన్స్ లేకుండా చేయాలనేదే ఆయన అభిమతం అని అంటున్నారు. చంద్రబాబే సీఎంగా ఉండాలనే డైలాగ్ ఆయన సీనియారిటీకి ఇచ్చిన గౌరవమే కానీ.. లోకేశ్‌కు చెక్కులు గట్రా పెట్టే స్కెచ్ ఏమీ లేదని చెబుతున్నారు.
మరో మూడుసార్లు చంద్రబాబే ముఖ్యమంత్రా? లోకేశ్‌కు అంత సీన్ లేదా? పవన్ కల్యాణ్ సీఎం కుర్చీపై ఆశలు వదులుకున్నారా? జనసేన చేతులు ఎత్తేసిందా? ఇలా కాంట్రవర్సీ వార్తలు వండివార్చుతూ.. సోషల్ మీడియాలో వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు ఇప్పటికే రచ్చ రాజేస్తున్నారు. వాళ్లు ఇలా ఎన్ని పుల్లలు, కర్రలు పెట్టే ప్రయత్నం చేసినా.. టీడీపీ, జనసేన పొత్తుకు వచ్చే నష్టం ఏమీ లేదని.. పవన్ చెప్పినట్టు నెక్ట్స్ టర్మ్‌లోనూ కలిసే పోటీ చేస్తారని.. కూటమి ప్రభుత్వమే వస్తుందని గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు జనసైనికులు, తెలుగు తమ్ముళ్లు.