BigTV English

Tuk Tuk Movie Review : ‘టుక్ టుక్’ మూవీ రివ్యూ

Tuk Tuk Movie Review : ‘టుక్ టుక్’ మూవీ రివ్యూ

Tuk Tuk Movie Review : మార్చి నెల 3వ వారం విడుదలయ్యే సినిమాలకి మినిమమ్ బజ్ కూడా లేదు. ఏదో రిలీజ్ చేయాలి కాబట్టి.. రిలీజ్ చేయాలి అన్నట్టు మేకర్స్ వీటిని జనాల మీదకి వదులుతున్నట్టు అనిపిస్తుంది. వీటిలో ‘టుక్ టుక్’ అనే సినిమా కూడా ఉంది. మరి ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి..


కథ :
చిత్తూరు జిల్లాకి చెందిన ముగ్గురు టీనేజీ కుర్రాళ్ళు హర్ష్ (హర్ష్ రోషన్), కార్తీక్ (కార్తికేయ దేవ్), స్టీవ్ (స్టీవెన్ మధు) వంటి చిల్లర వేషాలు వేస్తుంటారు. ప్రతిరోజు సాయంత్రం వీళ్ళు ఒక చోట చేరి బూతు వీడియోలు చూడటం, అలాగే ఊరి చెరువు వద్ద స్నానం చేసే ఆడవాళ్ళని చూస్తూ తమ కామం తీర్చుకోవడం వీళ్ళకి ఇష్టం. ఇలా చేస్తున్న టైంలో హర్ష్ కి ఒక ఘోరమైన ఆలోచన వస్తుంది. తమలా బూతు వీడియోలు చూసి ఎంజాయ్ చేసే బ్యాచ్ ఇంకా చాలా మంది ఉంటారు కాబట్టి… వాళ్ళ కోసం మనం కూడా వీడియోలు తీసి ఆన్లైన్లో పెడితే డబ్బులు సంపాదించొచ్చు కదా అనేది వీళ్ళ నీచమైన ఆలోచన. అందుకు కెమెరా వంటివి కావాలి కాబట్టి.. వాటిని కొనడానికి వీళ్ళ వద్ద డబ్బులు ఉండవు. ఊర్లో జాతర ఉంది కాబట్టి దాని పేరు చెప్పి జనాల వద్ద డబ్బులు వసూలు చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలో వీరికి ఒక బజాజ్ చేతక్ స్కూటర్‌ దొరుకుతుంది. దాని వల్ల వీళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :
గతంలో ‘కారా మజాకా’,’మెకానిక్ మామయ్య’ వంటి సినిమాలు కూడా ‘టుక్ టుక్’ స్టైల్లోనే రూపొందిన సినిమాలు. వాటికి ఫాంటసీని మిక్స్ చేసి వదిలారు. అవి బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవ్వలేదు. కానీ వీటి స్టైల్లోనే ‘టాక్సీ వాలా’ వచ్చింది. దానికి కొంచెం స్పిరిట్, సైన్స్ వంటి థీమ్స్ యాడ్ చేశారు. అయినప్పటికీ దర్శకుడు సుప్రీత్ సి కృష్ణ అలాంటి జోనర్ తోనే ‘టుక్ టుక్’ చేశాడు. కాకపోతే ఇక్కడ స్కూటర్. వాహ‌నం దానంతట అదే కదలడం, మాట్లాడటం, భయపెట్టడం వంటి అంశాలు ఆసక్తిని రేకెత్తించేవే. కరెక్ట్ గా వండితే మంచి వంటకం అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా చిన్న పిల్లలకి ఇలాంటివి నచ్చుతాయి. అయితే దానికి సరైన బ్యాక్ స్టోరీ ఉండాలి. లేదు అంటే ఆడియన్స్ డిస కనెక్ట్ అయిపోతారు.


‘టుక్ టుక్’ లో అది జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు డైరెక్టర్. బ్యాక్ స్టోరీ బాగానే వర్కౌట్ అయింది. కానీ, ఈ సినిమా అందరూ ఊహించినట్టే  సాగుతుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. టెక్నికల్ టీం పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు పర్లేదు. సంగీతం ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది.

నటీనటుల విషయానికి వస్తే.. సలార్, శ్వాగ్ వంటి సినిమాలతో పాపులర్ అయిన కార్తికేయ దేవ్ , ‘కోర్ట్’ తో పాపులర్ అయిన హర్ష్ రోషన్ ‘టుక్ టుక్’లో కూడా అలరించే ప్రయత్నం చేశారు. కొన్ని సీన్స్ లో నవ్వించారు కూడా. కానీ వీళ్ళని దర్శకుడు ఇంకాస్త వాడుకోవాల్సింది. శాన్వీ మేఘన పాత్ర బాగానే పండింది. సెకండ్ హాఫ్‌లో ఈమె కీలకంగా ఉంటుంది. తండ్రి పాత్రలో దయానంద్ రెడ్డి తన మార్క్ చూపించాడు. స్టీవెన్ మధు వంటి మిగిలిన నటీనటులు జస్ట్ ఓకే అనిపించారు.

ప్లస్ పాయింట్స్ :

ఇంటర్వెల్ సీక్వెన్స్
కామెడీ కొంతవరకు

మైనస్ పాయింట్స్ :

ప్రెడిక్టబుల్ గా సాగడం
సెకండాఫ్

మొత్తంగా.. ‘టుక్ టుక్’ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ఫ్యామిలీ, చిన్న పిల్లలను ఎంటర్‌టైన్ చేస్తుంది.

Tuk Tuk Telugu Movie Rating : 2.5/5

Tags

Related News

Arebia Kadali Review: అరేబియ కడలి రివ్యూ.. తండేల్‌కి తక్కువే ?

SU from SO Telugu Review : ‘సు ఫ్రొం సో’ రివ్యూ’ రివ్యూ… ఇది ఊహించని కామెడీ

Mayasabha Review : మయసభ రివ్యూ 

Sir Madam Review : ‘సర్ మేడమ్’ మూవీ రివ్యూ… విడాకుల దాకా వెళ్లిన వింత గొడవ

Kingdom Movie Review : కింగ్డమ్ మూవీ రివ్యూ : ప్రయోగం సక్సెసా ?

Kingdom Twitter Review : ‘కింగ్డమ్’ ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ హిట్ కొట్టినట్లేనా.. ?

Big Stories

×