BigTV English

Posani latest comments: నన్ను చంపేందుకు లోకేశ్ కుట్ర.. టీడీపీలోకి రమ్మన్నారు.. పోసాని కలకలం..

Posani latest comments: నన్ను చంపేందుకు లోకేశ్ కుట్ర.. టీడీపీలోకి రమ్మన్నారు.. పోసాని కలకలం..
Posani latest press meet

Posani latest press meet(Latest political news in Andhra Pradesh):

అసలే పోసాని. నోటికొచ్చినట్టు మాట్లాడుతారు. అలానే నారా లోకేశ్‌పై అనేక విమర్శలు చేశారు. పోసాని వ్యాఖ్యలకు లోకేశ్ హర్ట్ అయ్యారు. ఆయనపై రూ.4 కోట్లకు పరువునష్టం దావా వేశారు. తనపైనే కేసు వేస్తారా? అంటూ పోసాని మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. ఈసారి మరిన్ని సంచలన ఆరోపణలు చేశారు.


తనను చంపాలని నారా లోకేష్‌ కుట్ర పన్నుతున్నారని వైసీపీ నేత, ఏపీ FDC చైర్మన్ పోసాని కృష్ణమురళి ఆరోపించారు. పరువునష్టం కేసు వేసి.. మంగళగిరి కోర్టుల చుట్టూ తనను తిప్పాలని.. తాను వెళ్లినప్పుడు చంపాలని ప్లాన్‌ చేస్తున్నారని అన్నారు. ఒకవేళ తాను చనిపోతే.. అందుకు నారా లోకేష్‌దే బాధ్యత అని హెచ్చరించారు. తాను చావుకు భయపడే వ్యక్తిని కాదన్నారు.

లోకేష్ పీఏ చైతన్య తనకు ఫోన్‌ చేశాడని.. టీడీపీలోకి రమ్మని ఆహ్వానించాడని.. మరో బాంబు పేల్చారు పోసాని. అయితే, తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదని.. జీవితాంతం వైఎస్‌ జగన్‌ వెంటే ఉంటానని తేల్చి చెప్పారు పోశాని కృష్ణమురళి.


చంద్రబాబు అక్రమాలు బయటపెట్టినందుకే తనపై కక్ష గట్టారన్నారు. కంతేరులో 14 ఎకరాల భూమి లోకేశ్ కొన్నారని తాను అన్నానని పరువు నష్టం దావా వేశారని.. హెరిటేజ్ ఆస్తులు లోకేశ్‌వి కావా? అని ప్రశ్నించారు పోసాని. అసలు లోకేష్‌ ఇంతవరకూ ఎవరిపై విమర్శలు చేయలేదా? సీఎం జగన్‌పై నోటికొచ్చినట్టు మాట్లాడిన లోకేశ్‌పై పరువునష్టం దావా వేయకూడదా? అని నిలదీశారు.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×