E-Paper
Advertisement

తమ్ముడికి చెక్ పెట్టేందుకు అన్నకు ప్రాధాన్యం.. కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

తమ్ముడికి చెక్ పెట్టేందుకు అన్నకు ప్రాధాన్యం.. కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
Advertisement

Arvind Comments: మిగిలిన బీజేపీ నేత‌ల‌కు భిన్నంగా మరీ దిగ‌జారిన పొలిటిక‌ల్ కామెంట్స్ చేస్తున్నారు అర్వింద్‌. బాడీ షేమింగ్ కామెంట్స్‌కు లెక్కే లేదు. సీఎం రేవంత్‌రెడ్డిని సైతం దీనికి మిన‌హాయింపు ఇవ్వ‌డం లేదు. పీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్‌ను కూడా ఈ మ‌ధ్య టార్గెట్ చేసి మాట్లాడుతూ వైర‌ల్ వార్త‌ల్లో నిలుస్తున్నారాయ‌న‌. అర్వింద్‌.. దివంగ‌త డీఎస్ త‌న‌యుడు కావ‌డంతో .. అంతే ఘాటుగా కాంగ్రెస్ నుంచి ప్ర‌తి స్పంద‌న రావ‌డం లేదు. దీంతో మ‌రింత రెచ్చిపోతున్నారు అర్వింద్.

పార్టీ వీడతాన‌నే సంకేతం..

అర్వింద్ నోటికి తాళం వేయాలంటే, తిట్ల‌కు, బూతు పురాణాల‌కు బ్రేక్ వేయాలంటే అత‌ని అన్న సంజ‌యే క‌రెక్ట‌నే ఆలోచ‌న‌కు వచ్చారు పీసీసీ చీఫ్. మాజీ మేయ‌ర్ అయిన సంజ‌య్ గ‌త కొంత‌కాలంగా కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. తండ్రి మ‌ర‌ణానంతం త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇటీవ‌ల త‌ను పార్టీ వీడతాన‌నే సంకేతం కూడా ఇచ్చారు. గ‌తంలో డీఎస్‌తో క‌లిసి బీఆరెస్ పార్టీలో చేరినా.. అక్క‌డా పెద్దగా ప్ర‌యార్టీ ఇవ్వ‌లేదు సంజ‌య్‌కు. దీంతో మ‌ళ్లీ కాంగ్రెస్‌లో పార్టీలోనే కొన‌సాగుతూ వ‌స్తున్నారు.

Advertisement

Also Read: ‘ఇరుముడి’ స్టోరీపై రవితేజ కూతురు రియాక్షన్.. సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్!

త‌మ్ముడి నోటికి తాళం..

ఇటీవ‌ల అర్వింద్ ప‌రుష ప‌దాల‌తో పీసీసీ చీఫ్‌ను, సీఎంను విమ‌ర్శించే ధోర‌ణి పెరిగింది. రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌తో స‌రిపెట్ట‌కుండా ప‌ర్స‌న‌ల్ టార్గెట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ఇప్పుడు సంజ‌య్.. అర్వింద్‌ను కార్న‌ర్ చేసి కామెంట్లు చేస్తున్నారు. అస‌లు అర్వింద్ మాట‌ల‌పై ఆ పార్టీ నేత‌లే విసుగు చెందార‌ని, తిట్టుకుంటున్నార‌ని ఉల్టా మాట‌ల దాడికి దిగ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీ త‌న తండ్రికి గౌర‌వ‌మిచ్చి క‌నీసం త‌న‌కు ఏదైనా ప‌దవి ఇస్తుంద‌ని చాలా కాలం ఎదురు చూస్తున్నారు సంజ‌య్‌. త‌మ్ముడి నోటికి తాళం వేయాలంటే అన్నే క‌రెక్టు అనే భావ‌న‌కు వ‌చ్చిన అధిష్టానం సంజ‌య్‌కు పార్టీలో ప్ర‌యార్టీ ఇస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

Advertisement

Also Read: కోట్ల ఆస్తి, విలాసవంతమైన కుటుంబం… కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్… మెంటలెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్

Tags

Related News

ప్లానింగ్‌ లోపం.. జంతర్‌మంతర్‌ 2.0 విఫలం! ప్రచారార్బాటాలకే పరిమితమైన సీజేపీ.. కేంద్రం అలర్ట్‌గా ఉందని తెలిసినా.. తిప్పికొట్టే వ్యూహంలో ఫెయిల్‌..!

కొత్త పార్టీతో తొలి ఎన్నికను ఎదుర్కొనేందుకు రెడీ అయిన కవిత! తొలి ప్రయత్నంలోనే హేమాహేమీలతో ఢీ అంటే ఢీ..! ఏమిటా వ్యూహం..?

ఎండాకాలంలో కనిపించే ఆలయం.. ఈసారి అక్టోబర్‌లోనే దర్శనం.. దేనికి సంకేతం?

ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. ఆరు వారాల్లో నోటిఫికేషన్‌!

వరి రైతు నోటికాడి ధరను కొల్లగొట్టిన మిల్లర్‌ గద్దలు! ఎంఎస్‌పీ కన్నా వెయ్యి అదనంగా చెల్లిస్తున్న వ్యాపారులకు ధమ్కీ! ఎలా కొంటారని బెదిరించిన మిల్లర్ల అసోసియేషన్‌..!

రాబోయే ఎన్నికలపై.. సీఎం రేవంత్ వేసిన బిగ్ పొలిటికల్ ప్లాన్ ఇదే!

కేసీఆర్‌ ఉన్నప్పుడే గౌరమ్మా..! బతుకంతా పచ్చగ ఉండే గౌరమ్మా..! రెండు పాటలను విడుదల చేసిన బీఆరెస్‌ పార్టీ..!

చంద్రుడిపై ఐదు మెరుపులు.. ఆర్టెమిస్-2 వ్యోమగాములు గుర్తించిన వింత ఏంటి?

Big Stories

Advertisement
×