E-Paper
Advertisement

కొండా సురేఖ వివాదంపై.. పరోక్ష సంకేతాలిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్!

కొండా సురేఖ వివాదంపై.. పరోక్ష సంకేతాలిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్!
Advertisement

Konda Surekha: ఊహాజ‌నిత క‌థ‌నాలు వ‌ద్దు అని సీఎం వారించిన‌ట్టుగా మాట్లాడిన మాట‌ల వెనుక ప‌ర‌మార్థం… మంత్రి బ‌ర్త‌ర‌ఫ్ లాంటి చ‌ర్యలు ఉండ‌బోవ‌నే ప‌రోక్ష సంకేతాలిచ్చిన‌ట్టేన‌నే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఇది వ‌రకు ఓ సారి అధిష్టానం కొండా సురేఖ‌ను క్ష‌మించి వ‌దిలేసింది. మంత్రి హోదాలో ఉండి .. న‌టి సుమంతపై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో పార్టీలో తీవ్ర చ‌ర్చ‌కు తెర‌తీసింది. హీరో నాగార్జున ఆమెపై ప‌రువు న‌ష్టం దావా వేసి కోర్టుకీడ్చిన అంశం కూడా ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేసింది.

సారీ చెప్ప‌డంతో..

స‌మంత వివాదం వ్యవ‌హారంలో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ కొండా సురేఖ‌కు తోడుగా నిలిచారు. ఆమెపై అప్పుడే వేటు ప‌డుతుంద‌ని అంతా భావించారు. కానీ స‌ర్కార్ ఏర్ప‌డిన తొలినాళ్ల‌లోనే ఇలాంటి ఒడిదుడుకులు పాల‌న‌ప‌రంగా ఆటంకాలుగా మారుతాయ‌నే కోణంలో ఈ వివాదాన్ని స‌ద్దుమ‌ణిగేలా చేసింది అధిష్టానం. దీంతో ఆమె సారీ చెప్ప‌డంతో స‌రిపెట్టుకున్నారు. మ‌ధ్య‌లో ఆమె ఓఎస్డీ వివాదంలో త‌లదూర్చిన కూతురు సుష్మిత‌.. సీఎంపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. బీసీ మంత్రికి గౌర‌వ‌మే లేదా? అంటూ కులం కార్డును కూడా ప్ర‌యోగించారు. సీఎంను వ్యక్తిగ‌తంగా టార్గెట్ చేశారు.

Advertisement

Also read: జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్.. కాంగ్రెస్‌పై హరీశ్ రావు సెటైర్లు

వేటు త‌ప్ప‌ద‌నే సంకేతాలు..

తాజా వివాదంలో సీఎంపై సురేఖ కూతురు చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించ‌డంతో మ‌రో వివాదం తెచ్చిపెట్టుకున్నారు. ఇక వేటు త‌ప్ప‌ద‌నే సంకేతాలు ఆమెకు అంద‌డం.. ప‌రిస్థితి తీవ్రంగా మారుతుంద‌ని తెలుసుకున్న కొండా సురేఖ అధిష్టానాన్ని సంప్రదించారు. మ‌ల్లిఖార్జున‌ ఖ‌ర్గేను క‌లిసి ఓ గంట పాటు చ‌ర్చించిన ఆమె ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు తెలిసింది. దాసుడి త‌ప్పులు దండంతో స‌రి .. అన్న‌ట్టుగా ఆసారి కూడా క్ష‌మాభిక్ష పెట్టి.. క్లాస్ తీసుకుని వ‌దిలేసి ఉంటార‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. తాజాగా సీఎం వ్యాఖ్య‌ల‌తో ఈ వివాదానికి బ్రేక్ వేయాల‌ని, దీన్ని ఇక‌పై సాగ‌దీయొద్దనే యోచ‌న‌లో ఉన్నట్టుగా కూడా క‌నిపిస్తోంది.

Advertisement

Also Read: ముదురుతున్న కొండా సురేఖ వ్యవహారం.. ఖర్గేను కలిసినా దక్కని ఉపశమనం!

Tags

Related News

గింత పుర్సత్‌గున్నరేందీరా బై.. మనోళ్లు! పరస్పర ఆరోపణలతో గోక్కోవడంతోనే సరి! డైవర్షన్ పాలిటిక్స్ లో పోటాపోటీ!

ప్లానింగ్‌ లోపం.. జంతర్‌మంతర్‌ 2.0 విఫలం! ప్రచారార్బాటాలకే పరిమితమైన సీజేపీ.. కేంద్రం అలర్ట్‌గా ఉందని తెలిసినా.. తిప్పికొట్టే వ్యూహంలో ఫెయిల్‌..!

కొత్త పార్టీతో తొలి ఎన్నికను ఎదుర్కొనేందుకు రెడీ అయిన కవిత! తొలి ప్రయత్నంలోనే హేమాహేమీలతో ఢీ అంటే ఢీ..! ఏమిటా వ్యూహం..?

ఎండాకాలంలో కనిపించే ఆలయం.. ఈసారి అక్టోబర్‌లోనే దర్శనం.. దేనికి సంకేతం?

ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. ఆరు వారాల్లో నోటిఫికేషన్‌!

వరి రైతు నోటికాడి ధరను కొల్లగొట్టిన మిల్లర్‌ గద్దలు! ఎంఎస్‌పీ కన్నా వెయ్యి అదనంగా చెల్లిస్తున్న వ్యాపారులకు ధమ్కీ! ఎలా కొంటారని బెదిరించిన మిల్లర్ల అసోసియేషన్‌..!

రాబోయే ఎన్నికలపై.. సీఎం రేవంత్ వేసిన బిగ్ పొలిటికల్ ప్లాన్ ఇదే!

కేసీఆర్‌ ఉన్నప్పుడే గౌరమ్మా..! బతుకంతా పచ్చగ ఉండే గౌరమ్మా..! రెండు పాటలను విడుదల చేసిన బీఆరెస్‌ పార్టీ..!

Big Stories

Advertisement
×