Big Stories

Revanth Vs Jagan : రేవంత్ సర్కార్‌పై వైసీపీ కుట్ర.. సాక్ష్యం ఇదే..!

MP Vijayasai Sensational Comments : నిన్నటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మీద రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలోని కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. కానీ.. ముందస్తు పథకం ప్రకారమే ఈ కామెంట్ చేశారనే టాక్ ప్రస్తుతం తెలుగు రాజకీయవర్గాల్లో నడుస్తోంది. దీనిపై తాజాగా సోషల్ మీడియాలోనూ పెద్ద వార్ నడుస్తోంది.

- Advertisement -

ఇక.. అసలు కథలోకి పోతే.. నిన్న రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ పక్షనేతగా విజయ సాయిరెడ్డి మాట్లాడారు. ‘ గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ అబద్దాలు చెప్పి గెలిచింది. ఆ ప్రభుత్వం కూలిపోతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -

ఆయన అంతటితో ఆగలేదు. కాంగ్రెస్ కుటుంబాలను చీల్చి డర్టీ పాలిటిక్స్ చేయటం ఆ పార్టీకి అలవాటనీ, కాంగ్రెస్ కారణంగా ఏపీ ఎంతో నష్టపోయిందనీ, ఆ పార్టీని ఏపీ ప్రజలు ఏనాటికీ క్షమించరని తేల్చేశారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన అలా మాట్లాడారని భావించారు. కానీ లోతుగా ఆలోచిస్తే అంతకు మించిన కథే ఉందనే మాట వినిపిస్తోంది.

2019లో కేసీఆర్ పరోక్ష సాయాన్ని అందిపుచ్చుకుని జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం కాగలిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్.. కేసీఆర్‌కు అందుకు తనవంతు సాయం అందించే ప్రయత్నాలు చేశారు. చివరికి.. పోలింగ్ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీదికి ఏపీ పోలీసులను పంపి.. గందరగోళం కూడా సృష్టించారు. కానీ.. వారి ఆశలను అడియాశలు చేస్తూ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కే జై కొట్టారు. కానీ.. రేవంత్ రెడ్డి సీఎం కావటంతో వైసీపీ అధినాయకత్వం షాక్‌కు గురైంది.

తన మిత్రుడైన కేసీఆర్ ఓటమితో అసంతృప్తికి లోనైన ఏపీ సీఎం.. నేటికీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఒక బొకే ఇచ్చిన పాపాన పోలేదు. ఆ ఎన్నికల తర్వాత వైసీపీ అధినేత, మంత్రులు, పార్టీ నేతలు ఎవరూ తెలంగాణ గురించి మాట్లాడటం మానేసి మౌనంగా ఉంటున్నారు.

అయితే.. తాజాగా క్యాబినెట్ భేటీ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో కృష్ణాజలాల పంపిణీ, ప్రాజెక్టుల నిర్వహణ తదితర అంశాల మీద తెలంగాణ సీఎం మాట్లాడుతూ.. ‘దమ్ముంటే ఇప్పుడు వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును టచ్ చేయండి.. చూద్దాం’అని ఏపీ ప్రభుత్వ పెద్దలను నేరుగానే సవాలు చేశారు. అప్పటికీ వైసీపీ నేతలు నోరువిప్పకుండా మౌనంగానే ఉండిపోయారు.

అయితే.. వైసీపీ నేతలంతా ఒకరివెంట ఒకరు పార్టీకి రాజీనామా చేయటం, టిక్కెట్టు దక్కని వారంతా ధిక్కారస్వరం వినిపించటం, విపక్ష టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవటం, మరోవైపు షర్మిల రోజుకో ప్రశ్నను లేవనెత్తి వైసీపీని ఇబ్బంది పెట్టటంతో ‘ఇంకా మౌనంగా ఉంటే.. మునిగిపోతాం’ అనే ఉద్దేశంతోనే వైసీపీ అధినేత సూచన మేరకే నిన్న విజయసాయి రాజ్యసభలో మాట్లారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ గులాబీ నేతలు కొందరు జోస్యాలు చెబుతున్న వేళ.. ఆ మాటే విజయసాయి నోట రావటం వెనక.. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కుట్ర కూడా ఉండొచ్చని కాంగ్రెస్ అభిమానులు అనుమానిస్తున్నా.. దీనికి తమ నేత రేవంత్ సరైన సమయంలో సరైన రీతిలో బదులిస్తాడని వారు భావిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News