BigTV English

Jagga Reddy Humanity: కళ్లు కనిపించని ఆ బాలుడి పాట విని చలించిపోయిన జగ్గారెడ్డి.. స్పాట్‌లోనే ఎన్ని లక్షలు ఇచ్చారంటే?

Jagga Reddy Humanity: కళ్లు కనిపించని ఆ బాలుడి పాట విని చలించిపోయిన జగ్గారెడ్డి.. స్పాట్‌లోనే ఎన్ని లక్షలు ఇచ్చారంటే?

వికాస్ స్వస్థలం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం.. గాంధారి మండలం లోంకా తాండా. మూడు సంవత్సరాల వయస్సులో అనారోగ్యం కారణంగా చూపు కోల్పోయాడు. దాంతో అతని జీవితంలో చీకట్లు నిండిపోయినా, సింగర్ అవ్వాలనే తపనతో తనలోని ప్రతిభను వెలికితీశాడు. పాటలు పాడటం, పౌరాణిక గాథలను పద్యాల రూపంలో చెప్పడం, కార్టూన్ పాత్రల డైలాగ్స్‌‌ను అచ్చం అనుకరించడం వంటి అసాధారణ నైపుణ్యాలు వికాస్‌లో మెుదలయ్యాయి. కోమరెళ్ళి మల్లన్న, బీరప్ప, రాముడు, సీత, హనుమంతుడు వంటి దేవతల గాథలను ఏకధాటిగా చెప్పగలిగే ప్రతిభ అతనికి ప్రత్యేకతను తెచ్చింది.

ఇక కుటుంబ పరిస్థితులు మాత్రం చాలా క్లిష్టంగా ఉన్నాయి. వికాస్ తండ్రి గత రెండు సంవత్సరాలుగా రెండు కిడ్నీలు పాడై తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన చికిత్స కోసం సుమారు 7లక్షల రూపాయలు అప్పు చేశారు. వడ్డీతో కలిపి అది 7లక్షల 50వేల వరకు పెరిగింది. ఈ ఆర్థిక భారాన్ని తట్టుకోలేక వికాస్ తల్లి, తాతయ్య, అమ్మమ్మ, పెద్దమ్మతో కలిసి సంగారెడ్డి వచ్చి స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి ని కలిశాడు.


వికాస్ తన తండ్రి ఆరోగ్యం కోసం, తన చదువుకోసం సహాయం కావాలని, యూట్యూబ్ ఛానల్‌ పెట్టుకుని వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించాలనుకుంటున్నానని జగ్గారెడ్డికి వినయంగా వివరించాడు. కలెక్టర్ అవ్వాలన్న తన కలను సాకారం చేసుకోవడానికి ప్రోత్సాహం ఇవ్వమని కూడా కోరాడు. చిన్నారి మాటలు విన్న జగ్గారెడ్డి వెంటనే స్పందించి.. 7లక్షల 50వేల రూపాయల నగదు సాయం అందించారు.

అక్కడే వికాస్ తన ప్రతిభను ప్రదర్శించి, మల్లన్న – బీరప్ప వీరగాథలను రాగయుక్తంగా చెప్పాడు. కార్టూన్ క్యారెక్టర్‌ల డైలాగ్‌లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ కుర్రవాడి ప్రతిభ చూసి జగ్గారెడ్డి ప్రశంసలు కురిపించారు. అంతేకాదు, వికాస్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించేందుకు కావలసిన కొత్త స్మార్ట్‌ఫోన్ ఇచ్చి, అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చారు.

వికాస్ తనను తాను బాగా చదువుకుని కలెక్టర్ కావాలనుకుంటున్నానని చెప్పగా, జగ్గారెడ్డి ఆ కలను తప్పకుండా నిజం చేసుకోవాలని ప్రోత్సహించారు. నీ కుటుంబాన్ని బాగా చూసుకో, నేను ఎప్పుడూ నీకు తోడుంటాను అని ధైర్యం చెప్పారు. ఇకపై తమ ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమంలో.. పాటలు పాడేందుకు పిలుస్తామని హామీ ఇచ్చారు. చివరగా వికాస్ కుటుంబాన్ని స్వయంగా కారు ఏర్పాటు చేసి వారి స్వస్థలానికి పంపించారు.

Also Read: కేటీఆర్ పై OU పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

ఈ సంఘటన చిన్నారి వికాస్ నాయక్‌కు కొత్త ఆశలను నింపింది. తన ప్రతిభను యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి చూపించి, తన తల్లిదండ్రులు, తాతమ్మలతో పాటు కుటుంబాన్ని ఆదుకోవాలని పట్టుదలగా ముందుకు సాగుతున్నాడు. అతని కల అయిన కలెక్టర్ అవ్వడం సాధ్యమవుతుందని జగ్గారెడ్డి ఇచ్చిన ధైర్యం, ఆర్థిక సహాయం అతని భవిష్యత్తుకు బలమైన అండగా నిలుస్తాయి.

చిన్న వయస్సులోనే ఇంతటి ధైర్యం, ప్రతిభ చూపించిన వికాస్ నాయక్ కథ సమాజానికి ఒక స్ఫూర్తి. కష్టాలు వచ్చినా మనోధైర్యం కోల్పోకుండా, పట్టుదలతో ముందుకు సాగితే విజయాలు మన కాళ్ల దగ్గరే ఉంటాయని నిరూపిస్తున్నాడు.

Related News

Drug Racket: స్కూల్ ముసుగులో.. మత్తు పదార్థాల దందా..

Karimnagar: బట్టలు ఆరేసుకోడానికి రూ.200 కోట్లతో ఈ బ్రిడ్జి కట్టారా? ఇదెక్కడి మాస్ మామ!

Sujathakka Surrender: లొంగిపోయిన మోస్ట్ వాంటెడ్.. మావోయిస్టు సుజాతక్క

KTR: కేటీఆర్ పై OU పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Telangana: తెలంగాణలో అవినీతి మేత! ఫస్ట్ ప్లేస్‌లో ఏ శాఖంటే?

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు.. మరో 3 రోజులు కుండపోత వర్షాలు..

BRS Vs T Congress: జూబ్లీహిల్స్‌తో పాటు.. ఆ పది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు?

Big Stories

×