Sharmila on YS Jagan: నేరస్థులను కలుస్తారు.. దౌర్జన్యాలకు పాల్పడిన వారిని పరామర్శిస్తారు. కానీ అక్కడికి మాత్రం వెళ్లరు. అక్కడ చెప్పే మాటలు ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతారు. మరీ అంత మారాం చేయకండి అంటూ షర్మిళ ట్వీట్ చేశారు. ఇప్పటికే మీకు అర్థమైందిగా.. ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి షర్మిళ అన్నారో.. ఔను మీరనుకున్న పేరు నిజమే. సాక్షాత్తు తన అన్న, మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి షర్మిళ సంచలన ట్వీట్ చేశారు.
ఇటీవల గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ చేసిన కామెంట్స్ దుమారం లేపాయి. ఇటీవల జగన్ ఎక్కువగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ.. కూటమి లక్ష్యంగా విమర్శలకు పదును పెట్టారు. అయితే జగన్ అసెంబ్లీ వైపుకు వెళ్లేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదన్నది బహిరంగ రహస్యమే. అంతేకాదు.. వైసీపీ లో గెలిచిన మిగిలిన 10 ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ వైపు వెళ్లని పరిస్థితి.
ఇదే విషయాన్ని షర్మిళ తన ట్వీట్ ద్వారా జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు లక్ష్యంగా ప్రశ్నలు సంధించారు. షర్మిళ చేసిన ట్వీట్ ఆధారంగా.. సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలంటూ అధికారాన్ని చేజిక్కించుకొని, అమలు మరచిపోయారన్నారు. 9 నెలల కాలంలో 90 కారణాలు చెబుతూ.. సూపర్ సిక్స్ గురించి కూటమి ప్రభుత్వం మరచిపోయిందని షర్మిళ విమర్శించారు. ఈనెల 28న ప్రవేశపెట్టే బడ్జెట్ లో సూపర్ సిక్స్ పథకాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, అన్ని పథకాలను తప్పక ఈ ఏడాదిలో అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు.
ఇక జగన్ పై మాత్రం షర్మిళ ఓ రేంజ్ లో విమర్శలు గుపించారు. నేరస్థులను, దౌర్జన్యం చేసిన వాళ్ళను జైలుకెళ్లి పరామర్శించే సమయం ఉంటుంది కానీ.. ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం మొహం చెల్లదని షర్మిళ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. షర్మిళ చేసిన ఈ కామెంట్స్ వంశీని పరామర్శించినందుకే చేశారని చెప్పవచ్చు. ప్రెస్ మీట్ లు పెట్టీ పురాణం అంతా చెప్పే తీరిక దొరుకుతుంది కానీ అసెంబ్లీలో పాలకపక్షాన్ని నిలదీసే ధైర్యం జగన్ కు లేదన్నారు.
Also Read: ఈ జాబితాలో మీ పేరు లేదా.. మీకు పీఎం కిసాన్ అందనట్లే.. ఓ సారి చెక్ చేసుకోండి
ప్రజలు 11 మందిని గెలిపిస్తే శాసనసభకు రాకుండా మారం చేసే వైసీపీ అధ్యక్షుడికి, పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజల మధ్య తిరిగే అర్హత లేదని ట్వీట్ చేశారు. ప్రజల సమస్యల మీద మాట్లాడే నైతికత అసలే లేదని, వైసీపీ ఎమ్మెల్యేలు ఈ సారైనా అసెంబ్లీకి వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. సభా వేదికగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, ఈ సారి కూడా అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామాలు చేయాలని షర్మిళ తన ట్వీట్ లో డిమాండ్ చేశారు. జగన్ పై విమర్శలు గుప్పించడంలో ఇటీవల సైలెంట్ గా ఉన్న షర్మిళ, తన ట్వీట్ తో జగన్ కు భారీ షాకిచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇది ఇలా ఉంటే షర్మిళ చేసిన ట్వీట్స్ కి వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి షర్మిళ చేసిన ట్వీట్ కి వైసీపీ అధికారిక రియాక్షన్ ఎలా ఉంటుందో వేచిచూడాలి.
సీఎం చంద్రబాబు @ncbn గారి సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాప్. పథకాల అమలు ఎప్పుడు అని అడిగితే 9 నెలల్లో 90 కారణాలు చెప్పారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలపై , సూపర్ సిక్స్ పథకాలపై మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వాన్ని @JaiTDP @JanaSenaParty @BJP4Andhra…
— YS Sharmila (@realyssharmila) February 19, 2025