BigTV English

Tablet Strip In Biryani: హైదరాబాద్ బావర్చి బిర్యానీలో టాబ్లెట్లు.. వైరల్ వీడియో

Tablet Strip In Biryani: హైదరాబాద్ బావర్చి బిర్యానీలో టాబ్లెట్లు.. వైరల్ వీడియో

Tablet Strip In Biryani: వరల్డ్ వైడ్ గా హైదరాబాద్ బిర్యానీ అంటే పిచ్చ ఫేమస్. ఎక్కడెక్కడి నుంచే వచ్చి హైదరాబాద్ బిర్యానీని కుమ్మేస్తారు. ఆ రేంజ్‌లో టెస్ట్ ఉంటది కాబట్టే హైదరాబాద్ బిర్యానీకి ఫీదా అవుతుంటారు కస్టమర్లు. అలాంటిది ఇటీవల వరుసగా పలు బిర్యానీ హోటల్స్ లో నిర్లక్ష్యం కంటిన్యూ అవుతూనే ఉంది. వరుసగా జెర్రిలు, బొద్దింకలు, పురుగులు, సిగరెట్ పీక లాంటివి బిర్యానీలో దర్శనమిచ్చాయి.


అయితే తాజాగా బిర్యానీ తిందామని ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బావర్చీ రెస్టారెంట్‌కు వచ్చిన ఓ కస్టమర్‌కు బిర్యానీలో ఏకంగా టాబ్లెట్ కవర్ ప్రత్యక్షమైంది. అది కూడా బిర్యానీ తింటుండగా టాబ్లెట్ స్ట్రాప్ కనిపించే సరికి కస్టమర్ షాక్ అయ్యారు. బిర్యానితో పాటు తాను మెడిసిన్‌ని కూడా తింటున్నాను అంటూ కస్టమర్ వీడియో తీశాడు. ఇది ఏ మెడిసినో చెప్పాలంటూ హోటల్ యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో యాజమాన్యం ఎలాంటి సమాధానం చెప్పకుండా కస్టమర్ పైనే రివర్స్ అటాక్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు ఈ ఘటనపై నెటిజన్లు ఫైరవుతున్నారు. ఇక మీరు మారరా? నిర్లక్ష్యంగానే ఉంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులకు కస్టమర్లు ఫిర్యాదు చేశారు. అయితే ఇటీవల ఇదే హోటల్‌లో చోటు చేసుకున్న ఇది రెండో ఘటన. పది రోజుల క్రితం.. ఇదే బావర్చి హోటల్లో బిర్యానీలో సిగరెట్ పీకలు ప్రత్యక్షమైనాయి. ఈ విషయాన్ని హోటల్ యాజమాన్యం దృష్టికి కస్టమర్లు తీసుకెవెళ్లినా పట్టించుకోలేది తెలుస్తోంది. ఇదే విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు సైతం ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.


మరోవైపు బంజారాహిల్స్‌లోని బిర్యానీ వాలా హోటల్‌లో రిసెంట్ గా బొద్దింక ప్రత్యక్షమైంది. దీనిపై హోటల్ యాజమాన్యాన్ని కస్టమర్లు ప్రశ్నించారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రముఖ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కుళ్లిన మాంసం, గడువు తీరిన కారం, మషాళా ప్యాకెట్ల వినియోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించి.. ఆయా హోటళ్ల యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.. చేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా హోటల్ యజమానులు అయితే తమ నిర్లక్ష్య ధోరణిని మాత్రం వీడడం లేదు.

Also Read: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కబ్జా చిట్టా ఇదిగో.. మోసం చేసిందెవరు?

అయితే హైదరాబాద్ లోని హోటళ్లపై GHMC, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఎన్ని రెయిడ్స్ నిర్వహించినా.. కొన్ని హోటల్స్ బుద్ధి మాత్రం మారడం లేదు. దీంతో వరుస ఘటనలపై నెటిజన్లు, నగరవాసులు ఫైరవుతున్నారు. ఇక మీరు మారరా? నిర్లక్ష్యంగానే ఉంటారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. హోటల్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఘటనలు జరగడం, రీపిట్ అవ్వడం కామాన్ అవుతున్నాయి తప్పా…సరైనా యాక్షన్ తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైన అధికారులు మత్తు వదిలి…హోటల్స్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేద్దాం.

 

 

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×