E-Paper
Advertisement

అలా అయితే ప్రీమియర్ షోలకు దూరంగా ఉంటా.. సీఎం స్పందన పై నాని రిప్లై!

అలా అయితే ప్రీమియర్ షోలకు దూరంగా ఉంటా.. సీఎం స్పందన పై నాని రిప్లై!
Advertisement

Actor Nani: నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం ది ప్యారడైజ్ (The Paradise). ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే నేడు సాయంత్రమే ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి. ఈ ప్రీమియర్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. అయితే తన అభిమానులతో కలిసి ఈ సినిమా చూడాలనే కోరికను నాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)ముందు పెట్టారు. అభిమానులతో కలిసి సినిమా చూడటానికి తనకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు అయితే ఈ రిక్వెస్ట్ పట్ల రేవంత్ రెడ్డి స్పందించారు.

పోలీస్ స్టేషన్ నుంచి అనుమతి..

ప్రస్తుతం హైదరాబాదులో గణేష్ నిమజ్జనం జరుగుతున్న నేపథ్యంలో తాము ప్రజల భద్రతకే ప్రాధాన్యత ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే థియేటర్ ప్రాంగణంలో ఏ విధమైనటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండడం కోసం ముందుగా లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి అనుమతి తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని సీఎం ఆదేశించారు. ఇలా రేవంత్ రెడ్డి స్పందించిన తీరుపై నాని స్పందిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ప్రీమియర్లకు వెళ్లకుండా దూరంగా ఉంటాం..

Advertisement

తన రిక్వెస్ట్ పట్ల స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రస్తుతం గణేష్ నిమజ్జనం ఉన్న నేపథ్యంలో తాము కూడా ప్రజల భద్రతకే ప్రాధాన్యత ఇస్తామని, ఇలాంటి సమయంలో పోలీసులపై అధిక భారం మోపాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. భద్రత, జన సమూహ నియంత్రణ విషయంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే తాను తప్పకుండా ప్రీమియర్ షోలకు వెళ్లకుండా దూరంగా ఉంటానని నాని తెలిపారు.పోలీసు శాఖ తీసుకునే తుది నిర్ణయాన్ని గౌరవించి, దానికి అనుగుణంగా నడుచుకుంటామని నాని పేర్కొన్నారు.

గణేష్ నిమజ్జనం సందర్భంగా…

ఇలా నాని పోలీస్ శాఖకు ప్రీమియర్లకు పర్మిషన్ ఇవ్వడం కోసం ఒక  లెటర్ పెట్టారు అయితే ఈ విషయంపై C.V ఆనంద్ ఐపీఎస్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాలను తెలిపారు. హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలను ట్యాగ్ చేస్తూ హైదరాబాద్ లో ప్రస్తుతం గణేష్ విగ్రహాల నిమజ్జనాలు జోరుగా సాగుతున్నాయి. ఈరోజు 10వ రోజు కావడంతో ముఖ్యంగా హుస్సేన్ సాగర్ చెరువులో వేలాది విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. RTC క్రాస్ రోడ్స్ దగ్గరలోనే ఉండటం వల్ల, ఆ ప్రాంతం మొత్తం వాహనాలు నిమజ్జనంలో పాల్గొనే భక్తులతో కిక్కిరిసిపోతుంది. సుమారు రెండు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన, ఆ తర్వాత జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించి, ఒక చిన్నారి శాశ్వతంగా అంగవైకల్యానికి గురైన నేపథ్యంలో, ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ సిటీ పోలీసులు నిర్వహించగలరా, అందుకు అవసరమైన బలగాలను మోహరించగలరా అనే విషయంపై హైదరాబాద్ సిటీ పోలీసులను సంప్రదిస్తామంటూ సివి ఆనంద్ తెలిపారు. మరి నానికి అభిమానులతో కలిసి ప్రీమియర్స్ చూడటానికి అనుమతి లభిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read:  చిరు 48 ఇండస్ట్రీ జర్నీ ..పవన్ కళ్యాణ్ స్పెషల్ పోస్ట్ వైరల్!

 

Related News

ప్యారడైజ్ కోసం మైత్రి క్రేజీ ప్లాన్.. ఇంటర్వెల్ స్నాక్స్ గా తెలంగాణ స్పెషల్ ఫుడ్!

మోద రాత్రి మూవీలో ఆ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా? అసలు విషయం చెప్పిన డైరెక్టర్!

తల్లి కావాలంటే పెళ్లే అవసరమా? వివాహ వ్యవస్థపై శృతిహాసన్ కామెంట్స్!

కొంచెం విషమిచ్చి చంపేయండి- పవిత్ర గౌడ!

థియేటర్లో సినిమా చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

చిరు 48 ఇండస్ట్రీ జర్నీ ..పవన్ కళ్యాణ్ స్పెషల్ పోస్ట్ వైరల్!

‘ కాకా’ సెట్ లో ‘చిరు 48ఇయర్స్ ఇండస్ట్రీ’ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్!

Big Stories

Advertisement
×