Big Stories

Srisailam Brahmotsavalu: శ్రీగిరి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు రాత్రిళ్లూ మార్గం సుగమం

Srisailam Brahmotsavalu From Today
 

Srisailam Brahmotsavalu From Today: ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనన శ్రీశైలం మహాశివ రాత్రి వేడుకలకు సిద్ధమైంది. శుక్రవారం ఉదయం నుంచి వేడుకలు ప్రారంభించనున్నారు. శ్రీశైలంలో ఈ నెల 1 నుంచి 11 వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల ఆలయం విద్యుత్‌ కాంతులతో మెరిసిపోతోంది.

- Advertisement -

భక్తులకు అన్ని సౌకర్యాలు ఆలయ అధికారులు ఇప్పటికే సద్ధం చేశారు. చంటిపిల్లల తల్లులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్‌ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలను చూసేందుకు భక్తులకు నల్లమలలో రాత్రి వేళ వాహనాల రాకపోకలను అనుమతించారు.

- Advertisement -

Read More: ప్రజాగళం..! టీడీపీ మరో కొత్త కార్యక్రమం..

భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకునట్లు దోర్నాల అటవీ క్షేత్రాధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. శ్రీశైలం నల్లమల రోడ్డు మార్గం అభయారణ్యంలో ఉంటుంది. సాధారణంగా శ్రీశైలం వెళ్లే భక్తులను పెద్దదోర్నాల అటవీ శాఖ చెక్‌పోస్టు దగ్గరే నిలిపివేస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అధికారులు వాహనాల రాకపోకలకు అనుమతులు జారీ చేశారు.

వాహనదారులు తగిన వేగంతో వాహనాలు నడపాలని విశ్వేశ్వరరావు తెలిపారు. వన్యప్రాణులకు ఎలాంటి హాని జరగకుండ రాకపోకలు నిర్వహించాలని ఆయన సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News