BigTV English

Heat Temparature In AP: మండేకాలం.. బయటకు వస్తే మటాష్.. ఏపీలో దంచికొడుతున్న ఎండలు..

Heat Temparature In AP: మండేకాలం.. బయటకు వస్తే మటాష్.. ఏపీలో దంచికొడుతున్న ఎండలు..

Heat Temparature In AP : సుర్రుమనే సమ్మర్ మొదలైపోయింది. బండలు సైతం పగిలే ఎండలు.. పగటి పూటే మనుషుల మాడు పగలగొట్టేస్తున్నాయి. ఈ వేసవి.. గత రికార్డుల్ని బద్దలు కొట్టేస్తుందా? అనే చర్చ కూడా మొదలైంది. అయితే.. గతేడాదే ఎండలు దంచికొట్టాయంటే.. ఈసారి కాస్త తక్కువ ఎండలు ఉంటాయనుకోవద్దు. ఇకముందు సీజన్లు గడిచేకొద్దీ.. ఎండలు మండుతూనే ఉంటాయ్. ఏటికేడు.. అంతకుమించి అనేలా ఉండబోతున్నాయి. అంటే.. మాడు పగలగొట్టే ఎండలు.. ఇక మామూలు కాబోతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రిపేర్ అయిపోండి.


సమ్మర్‌ టెంపర్ చూపిస్తున్న సూర్యుడు

ఇప్పుడే మాడు పగలగొట్టేస్తున్న ఎండలు


ఈ వేసవి గత రికార్డుల్ని బద్దలుకొడుతుందా?

ఏపీలో భానుడి భగభగలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టేందుకు వణికిపోతున్నారు ప్రజలు. ముందు ముందు పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణశాఖ అధికారులు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 38 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, పార్వతీపురం, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాలో అధికంగా వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. భానుడి దెబ్బకి నిన్న ఏపీలో 4 మండలాల్లో తీవ్ర వడగాలులు ప్రభావం చూపగా.. 23 మండలాల్లో వడగాలులు వీచాయి.

మండుతున్న ఎండలు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి

కొన్నేళ్ల కిందటి వరకు అబ్‌నార్మల్‌గా ఉన్న పీక్ సమ్మర్ సీజన్.. ఇకముందు న్యూ నార్మల్‌గా మారబోతోంది. అందుకే.. ఈసారి ఎండలు ఏ రేంజులో మండుతాయో ఎవరి ఊహకు అందట్లేదు. పగటిపూట పగబట్టినట్లుగా వడదెబ్బ కొట్టేందుకు భానుడు భగభగ మండింపోతున్నాడు. ఈ సీజన్‌లోనే తమ టెంపరేంటో చూపిస్తామంటూ టెంపరేచర్లు కూడా సెగలు కక్కుతూ పొగలు తీస్తున్నాయి. ఏప్రిల్ నుంచి అసలైన ఎండాకాలమంటే ఎలా ఉంటుందో చూపించేందుకు సిద్ధంగా ఉంది ఈ సమ్మర్ సీజన్. ఇప్పటికే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మండుతున్న ఎండలు జనాన్ని ఇబ్బంది పెట్టేస్తున్నాయి. దాంతో.. రాబోయే రోజుల్లో ప్రజలంతా అలర్ట్‌గా ఉండాలని.. వాతావరణశాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తోంది. మామూలుగానే ఎండాకాలంలో 40 డిగ్రీలు దాటితే మనం అస్సలు తట్టుకోలేం. అలాంటిది.. 45 డిగ్రీలపైన టెంపరేచర్ గనక నమోదైతే.. ఇక అస్సలు ఊహించలేం.

సాధారణం కన్నా 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు

ప్రతి సమ్మర్ సీజన్‌లో ఎండలు ముదిరిపోతున్నాయి. ఈసారి కూడా భానుడి బీట్, ఎండల హీట్ మామూలుగా ఉండదంటున్నారు. నిజానికి.. గతేడాది నుంచే ఎండల తీవ్రత పెరగడం మొదలైంది. అది ఈసారి కూడా కంటిన్యూ అవుతోంది. ఇక ముందు కూడా కొనసాగుతుంది. ఇప్పట్నుంచే ఈ తరహా వాతావరణ పరిస్థితులకు ప్రజలు అలవాటుపడాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఒక ప్రాంతంలో సాధారణం కన్నా 4.5 డిగ్రీల నుంచి 6.4 డిగ్రీల వరకు టెంపరేచర్ పెరిగినప్పుడు గానీ, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటినప్పుడు గానీ హీట్ వేవ్‌గా పరిగణిస్తారు. అలా.. ప్రతి సమ్మర్ సీజన్‌లో వడగాలుల తీవ్రత పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. ఇప్పటికే.. సాధారణం కన్నా 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అందుకే.. మండే ఎండల గురించి ఇప్పుడే ఇంతలా చెప్పాల్సి వస్తోంది. రాను రాను నిప్పులు చెరిగే ఎండలు, తీవ్రమైన వడగాలులతో.. సూర్యుడి భగభగల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి.. ఈసారి ఫిబ్రవరి మూడో వారం నుంచే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. మార్చి తొలివారంలోనే.. టెంపరేచర్ 40 డిగ్రీల మార్క్ దాటేసింది.

ఉష్ణోగ్రతలు ఇంతలా పెరిగిపోవడానికి అనేక కారణాలు

ఏళ్లు గడుస్తున్నకొద్దీ.. వాతావరణంలో వస్తున్న మార్పులు ఎంత దారుణంగా ఉంటున్నాయో.. పోయిన ఏడాదే అందరికీ అర్థమైంది. 2024 సంవత్సరం.. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల కంటే ఎక్కువ నమోదైన తొలి క్యాలెండర్ ఇయర్‌గా నమోదైంది. ఇది.. ప్రపంచం ఎదుర్కోవాల్సిన న్యూ నార్మల్ అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఫలితంగా భూమిపై ఏదో ఒకచోట తీవ్రమైన ప్రకృతి విపత్తులు చోటు చేసుకుంటున్నాయ్. ఈ గ్లోబల్ క్రైసిస్‌లో అత్యంత ప్రభావితమైన దేశాల్లో.. మన భారత్ కూడా ఒకటి. ఆ లెక్కన.. గతేడాది కంటే ఈసారి ఎక్కువ ఉష్ణోగ్రతలు, తరచుగా హీట్ వేవ్స్ సంభవిస్తాయి. ఇప్పటికే.. ఈ ఏడాది ఫిబ్రవరి.. గత 120 ఏళ్లలో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా ప్రకటించారు.

Also Read: దమ్ముంటే పట్టుకోండి.. రూ.1 లక్ష వైపు బంగారం ధర

అయితే.. ఉష్ణోగ్రతలు ఇంతలా పెరిగిపోవడానికి అనేక కారణాలున్నాయి. భౌగోళికంగా మన దేశం ఉన్న ప్రాంతం.. ఎక్కువ రేడియేషన్‌కి గురవుతోంది. గ్రీన్ హౌజ్ గ్యాసెస్ కూడా భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి. పెరుగుతున్న పట్టణీకరణతో.. నగరాలు ఎక్కువ వేడిని గ్రహిస్తున్నాయి. దాంతో.. దేశంలోని మెట్రో నగరాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య.. రాత్రిపూట ఉష్ణోగ్రతల వ్యత్యాసం 15 డిగ్రీల సెల్సియస్ దాకా ఉంటోంది.

వాతావరణంలో క్రమంగా వస్తున్న మార్పులు..

మరోవైపు.. ఈ శతాబ్దం చివరి నాటికి హీట్ వేవ్స్ 3 నుంచి 6 రెట్లు పెరుగుతాయనే అంచనాలున్నాయి. వర్షపాతం లోటు, కరువు, వైల్డ్ ఫైర్స్ లాంటివన్నీ ఆందోళన పెంచుతున్నాయి. సముద్రగర్భంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కూడా విపత్తులకు దారితీస్తున్నాయ్. ముఖ్యంగా.. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలో.. ప్రతి డిగ్రీ సెల్సియస్ పెరుగుదలకు.. వాతావరణ తేమ స్థాయిలు 7 శాతం పెరుగుతాయి. 2040 నాటికి పట్టణ ప్రాంతాల్లో దాదాపు 200 కోట్ల మంది ప్రజలు 0.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలకు ప్రభావితమవుతారని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి పట్టణంలోని ప్రజలు హీట్ వేవ్స్‌కి గాని, వరదలకు గానీ గురవుతారని నివేదికలు చెబుతున్నాయి. వాతావరణంలో క్రమంగా వస్తున్న మార్పులు.. ఆహారం, నీరు, ఇంధన భద్రత సహా అనేక రంగాలను ప్రభావితం చేస్తాయి. రుతుపవనాలు, ఉష్ణోగ్రతలు, గాల్లో తేమలోనూ మార్పులు సంభవిస్తాయి. అవి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో కచ్చితంగా చెప్పలేం. రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా మారిపోతాయో అస్సలు ఊహించలేం.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×