BigTV English

Red Book: రెడ్ బుక్ ఓపెన్? వంశీ తర్వాత ఎవరు?

Red Book: రెడ్ బుక్ ఓపెన్? వంశీ తర్వాత ఎవరు?

Red Book: ఏపీలో మరోమారు రెడ్ బుక్ ఓపెన్ అయిందన్న టాక్ వినిపిస్తోంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ తో రెడ్ బుక్ అంశం మరోమారు తెరమీదికి వచ్చింది. వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ ఎవరన్నదే ఇప్పుడు పొలిటికల్ టాక్. ఇటీవల నారా లోకేష్ రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ.. చట్టప్రకారం తప్పక చర్యలు ఉంటాయన్నారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ అరెస్ట్ కావడంతో, నెక్స్ట్ గురి ఆ నేతపైనే అంటూ ప్రచారం సాగుతోంది.


గన్నవరం మాజీ వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని వంశీ నివాసానికి వచ్చిన పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించి ఇంటికి నోటీసులు కూడ అంటించారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలుపుతున్నారు. కాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నుండి పోటీ చేసి విజయాన్ని అందుకున్న వంశీ అనూహ్యంగా వైసీపీకి మద్దతిచ్చారు. ఆ క్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అంతేకాకుండ గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ ను కూడ ఇబ్బందులకు గురి చేసినట్లు ప్రచారం సాగింది. ఆ సమయంలో నారా లోకేష్ రెడ్ బుక్ లో వంశీ పేరు తప్పక ఉంటుందని ప్రచారం సాగింది.

మళ్లీ ఎన్నికలు వచ్చాయి. కూటమి గెలిచింది. ఇప్పటికే 8 నెలల పాలన కూడ పూర్తి చేసుకుంది. టీడీపీ క్యాడర్ మాత్రం రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటూ.. లోకేష్ ను పలుమార్లు ప్రశ్నించారు. లోకేష్ కూడ చట్టం తనపని తాను చేసుకుపోతుందని జవాబిస్తూ వచ్చారు. అనూహ్యంగా వంశీని అరెస్ట్ చేయడంతో రెడ్ బుక్ ఓపెన్ అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. వంశీ కాస్త లైన్ దాటి మరీ విమర్శలు చేశారని, అందుకు తగ్గ శాస్తి జరిగిందని టీడీపీ క్యాడర్ అంటున్నారు. ఇది కక్షసాధింపు చర్యేనంటూ వైసీపీ తిప్పికొడుతోంది.


వంశీ అరెస్ట్ కాగానే నెక్స్ట్ ఎవరన్నది ఇప్పుడు పొలిటికల్ టాక్ నడుస్తోంది. వంశీ, కొడాలి నాని ఇద్దరూ మంచి స్నేహితులు. వంశీని వైసీపీ అక్కున చేరేలా చేసింది కూడ నానినే అంటారు. వంశీతో పాటు నాని కూడ అదే రేంజ్ లో విమర్శలు చేశారు. వంశీ అరెస్ట్ పర్వం పూర్తి కాగానే, నెక్స్ట్ నాని టార్గెట్ అంటూ సోషల్ మీడియాలో పేరు వినిపిస్తోంది. రెడ్ బుక్ లో వంశీ పేజీ తర్వాత ఖచ్చితంగా నాని పేరే ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇటీవల జగన్ 2.ఓ అంటూ జగన్ కామెంట్స్ తర్వాత రెడ్ బుక్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడ టాక్ నడుస్తోంది.

Also Read: ఏలూరులో వ్యక్తికి బర్డ్ ఫ్లూ.. కలెక్టర్ ఏం చెప్పారంటే?

జగన్ జనంలోకి రావాలని భావిస్తున్న క్రమంలో, ఓ వైపు పార్టీ నుండి నాయకుల వలసలు, మరోవైపు కీలక నేతల అరెస్టులు సాగితే ఇబ్బందులు తప్పవంటూ పొలిటికల్ టాక్. మొత్తం మీద మరోమారు రెడ్ బుక్ ఓపెన్ అయినట్లు ప్రచారం సాగుతుండగా.. నెక్స్ట్ ఎవరన్నది పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి.

Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×