BigTV English

GVMC Mayor: జీవీఎంసీపై కూటమి ఫోకస్.. విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం!

GVMC Mayor: జీవీఎంసీపై కూటమి ఫోకస్.. విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం!

GVMC Mayor: ఏపీలో కార్పొరేషన్లు టీడీపీ వంశం కానున్నాయా? తెర వెనుక కూటమి సర్కార్ పావులు కదుపుతోందా? ఇప్పటికే గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. రేపో మాపో విశాఖ మేయర్ వంతు కానుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అసలేం జరుగుతోంది? ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్తే..


రంజుగా విశాఖ రాజకీయం

విశాఖ కార్పొరేషన్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.  మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకునేందుకు తెర వెనుక పావులు కదుతుపోతోంది. తాజాగా వైసీపీకి 9 మంది కార్పొరేటర్లు రాజధాని అమరావతికి చేరుకున్నారు. వీరంతా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.


బుధవారం అవిశ్వాస తీర్మానం

జరుగుతున్న పరిణామాలతో ఈనెల 19న అంటే బుధవారం అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వేగంగా పావులు కదుపుతోంది కూటమి ప్రభుత్వం. ఈ బాధ్యతలు సిటీలో పార్టీ ఎమ్మెల్యేలకు అధిష్టానం అప్పగించినట్టు తెలుస్తోంది.  ఎన్నికైన నాలుగేళ్ల వరకు మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టకూడదంటూ గత ప్రభుత్వం బిల్లు తెచ్చింది.

దీని ప్రకారం మంగళవారంతో విశాఖ మేయర్ వెంకట కుమారి మేయర్ పదవికి నాలుగేళ్లు పూర్తి అయ్యింది. బుధవారం మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  విశాఖ మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 2/3 మెజారిటీ కింద కావల్సివుంది.

ALSO READ: వదలని కేసులు, మళ్లీ కస్టడీకి పోసాని

పార్టీల బలబలాలు

మేజిక్ ఫిగర్ సంఖ్య 64. ప్రస్తుతం 75 వరకు ఉన్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ కార్పొరేషన్‌లో 98 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అందులో ఒకరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  వైసీపీ కార్పొరేటర్లలో 58 మందిలో  ఇప్పటికే ఐదుగురు జన‌సేన‌, టీడీపీలో నలుగురు చేరారు.

తాజాగా 12 మంది వైసీపీ కార్పొరేటర్లు కూటమి చెంతకు చేరారు. ఈ జాబితాలో మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాజధాని అమరావతికి కార్పొరేటర్లు చల్లా రజని, గేదెల లావణ్య, కెల్ల సునీత, భూపతిరాజు సుజాత, ముర్రు వాణితో పాటు మరో నలుగురు కార్పొరేటర్లు వెళ్లారు. జనసేనలో చేరడానికి మరో ముగ్గురు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మేయర్, డిప్యూటీ మేయర్ పదవి దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది కూటమి సర్కార్. ప్రస్తుతం 34 నుంచి ఇప్పటికే 58 కి కూటమి బలం చేరింది. మరో ఆరుగురు రెడీ ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా జాయిన్ అయినవారు, ఇండిపెండెంట్లతో కలిపి ఆ సంఖ్య 47కి చేరింది. కొత్తగా జాయిన్ అయిన కార్పొరేటర్‌తో కలిపి జనసేన సంఖ్య 8కి చేరింది.

అందులో బీజేపీ, సీపీఎం, సీపీఐ పార్టీలకు చెందిన ముగ్గురు కార్పొరేటర్లు ఉన్నారు. ఇక విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి అదనంగా 12 ఓట్లు ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే కూటమి బలం ఎక్స్ అఫీషియల్ ఓట్లతో కలిపి 70కి చేరింది. వైసీపీకి వైపు ప్రస్తుతానికి 39 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అవిశ్వాస పరీక్ష రోజున ఆ బలం మరింత తగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు.

అవిశ్వాసం తీర్మానం నేపథ్యంలో ఇప్పటికే గుంటూరు మేయర్ మనోహర్‌నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. మిగతావారిపై అవిశ్వాసం పెట్టాలన్నది టీడీపీ నేతల ఆలోచన.  మరో ఏడాదిపాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్నది కూటమి సర్కార్ ఆలోచన.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×