BigTV English

TDP JanaSena Seat Sharing | సీట్ల సర్దుబాటులో జనసేన పేచీ.. టిడిపి బలంగా ఉన్నచోటే కావాలని డిమాండ్

TDP JanaSena Seat Sharing | జనసేన, టిడిపిల పొత్తు కుదరడంతో సీట్ల సర్దుబాటు, అభ్యర్థులు ఎంపిక ఆ పార్టీలకు కీలకంగా మారింది. టిడిపి అభ్యర్థులు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేన సీట్లు అడుగుతుండటం.. టీడీపీ తటపటాయిస్తుండటం.. రెండు పార్టీలకు తలనొప్పిగా మారిందంట.

TDP JanaSena Seat Sharing | సీట్ల సర్దుబాటులో జనసేన పేచీ.. టిడిపి బలంగా ఉన్నచోటే కావాలని డిమాండ్

TDP JanaSena Seat Sharing | జనసేన, టిడిపిల పొత్తు కుదరడంతో సీట్ల సర్దుబాటు, అభ్యర్థులు ఎంపిక ఆ పార్టీలకు కీలకంగా మారింది. టిడిపి అభ్యర్థులు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేన సీట్లు అడుగుతుండటం.. టీడీపీ తటపటాయిస్తుండటం.. రెండు పార్టీలకు తలనొప్పిగా మారిందంట. దాంతో ఆయా నియోజకవర్గాల్లో రీ సర్వేలు చేయించుకునే పనిలో పడ్డారంట పార్టీల పెద్దలు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జనసేన ఆశిస్తున్న అయిదు సెగ్మెంట్లలో టిడిపి, జనసేన రెండు పార్టీల అభ్యర్థులు బలంగా ఉన్నారు. అదే ఇప్పుడు తలనొప్పిగా మారిందంటున్నారు.


రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాది ప్రత్యేక స్థానం .. 19 అసెంబ్లీ స్థానాలున్న ఈ జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉంది .. దాంతో అక్కడ పైచేయి కోసం అన్ని పార్టీలు కసరత్తు చేస్తుంటతాయి .. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వైసీపీ సీట్లు ఖరారు చేస్తుండటంతో.. టిడిపి, జనసేనలు కూడా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. అయితే జిల్లాలో ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఇంకా క్లారిటీ రావడం లేదంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 6 నుండి 8 స్థానాల్లో జనసేన పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.. అందులో 5 చోట్ల ఇటు టిడిపి అటు జనసేన ఇద్దరు అభ్యర్థులు బలంగా ఉన్నారు. రాజమండ్రి రూరల్, కాకినాడ రూరల్, పిఠాపురం, మండపేట, కొత్తపేట నియోజకవర్గాల్లో క్యాడర్‌ బలంతో పాటు కేండెట్లు కూడా బలంగా కనిపిస్తున్నారు .

రాజమండ్రి రూరల్ నుండి టిడిపి అభ్యర్థిగా ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఈ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారాయన. రాష్ట్రవ్యాప్తంగా జగన్ వేవ్ లో ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో నుంచి టిడిపి జెండా ఎగరవేశారు. అదే నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా కందులు దుర్గేష్ పోటీ చేశారు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.ఈ నియోజకవర్గంలో సమస్యలపై పోరాటం చేయడంలో గాని.. క్యాడర్ని కలుపుకుని పోతూ..పార్టీని బలోపేతం చేయడంలో కందులు దుర్గేష్ కీలకపాత్ర పోషించారు. ఈ సారి తాను రూరల్ బరిలో ఉంటానని ఆ బాధ్యత అధినేత పవన్ కళ్యాణ్ చూసుకుంటారని చెబుతున్నారు .


కాకినాడ రూరల్ ఈ నియోజక వర్గం కాపులతో పాటు బీసీ సామాజిక వర్గం ఎక్కువ. బీసీ సామాజికవర్గానికి చెందిన టిడిపి అభ్యర్థి పిల్లి సత్తిబాబు సతీమణి పిల్లి అనంతలక్ష్మి అక్కడి మాజీ ఎమ్మెల్యే..మొదటినుండి కాకినాడ రూరల్ లో టిడిపికి సంస్థాగత బలం ఉంది. ప్రస్తుతం జనసేన పిఏసి సభ్యుడు, కాపు నేత పంతం నానాజీ ఇప్పుడు అదే సీటు ఆశిస్తూ.. గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు .

ఇక మరో నియోజకవర్గం పిఠాపురం.. కాపు ప్రభావిత నియోజకవర్గం కావడంతో ఈ సెగ్మెంట్‌పై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ నియోజకవర్గ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఎస్‌విఎస్ ఎన్వర్మ ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ టీడీపీని బలోపేతం చేస్తు వస్తున్నారు. పార్టీకి సంబంధించి ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేస్తూ నిత్యం ప్రజల మధ్య ఉంటున్నారు. మరోవైపు పిఠాపురం జనసేన ఇన్‌చార్జ్‌గా తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ఉన్నప్పటికీ.. జనసైనికులను సమర్ధంగా ముందుకి నడిపించలేకపోతున్నారన్నన టాక్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే.. గెలిపించి పంపుతానంటున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ.. అదే పవన్‌కళ్యాణ్ కాకుండా వేరేవరైనా పోటీ చేస్తే మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా అయినా బరిలోకి దిగుతానంటున్నారంట .

అలాగే మండపేట నియోజకవర్గంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన జనసేన, టిడిపి అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ నుంచి టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న వేగుళ్ల జోగేశ్వరరావు .. వరుసగా మూడు ఎన్నికల నుంచి గెలుస్తూ వచ్చారు .. అలా మండపేట నియోజకవర్గం టీడీపీ కంచికోటగా మారింది. మరోసారి పోటీకి ఆ హ్యాట్రిక్ ఎమ్మెల్యే రెడీ అవుతున్నారు .. ఇదే నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా ఉన్న వేగుళ్ల లీలాకృష్ణ పార్టీని క్యాడర్ని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తూ వస్తున్నారు .. ఆ క్రమంలో కొందరు పెద్దలు రంగంలోకి దిగి ఆ ఇద్దరి మధ్య సఖ్యత కుదిరిచి జనసేన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ నుండి వైసీపీ అభ్యర్థిగా తోట త్రిమూర్తులు ఉండడంతో.. పవన్ కళ్యాణ్ మండపేటలో జనసేన జెండా ఎగరవేయాలని పట్టుదలతో ఉన్నారంట .

కొత్తపేట సెగ్మెంట్లో అన్నదమ్ములే టీడీపీ, జనసేన ఇన్‌చార్జులుగా ఉన్నారు.. టిడిపి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందం పోటీకి రెడీగా ఉంటే .. అక్కడ నుంచి ఆయన సోదరుడు బండారు శ్రీనివాస్ జనసేన నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అయిదు సెగ్మెంట్లపై టీడీపీ, జనసేన అధినేతలు ఏ నిర్ణయం తీసుకుంటారో?… వారి పట్టువిడుపులు ఎలా ఉంటాయో చూడాలి మరి.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×