Case Filed Against Sri Reddy : అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులపై ఇష్టానుసారం మాట్లాడిన వారుకి ఇప్పుడు సెగ తగులుతోంది. ఇప్పటికే.. కొంత మంది సోషల్ మీడియా(Social Media)లో అసభ్యకర పోస్టులు చేశారనే కారణంగా.. జైలు ఊచలు లెక్కిస్తుండగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి నటి శ్రీరెడ్డి(Actress Sri Reddy) చేరింది. గతంలో సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టిన శ్రీ రెడ్డి, రాష్ట్ర స్థాయి కీలక నేతలపైనే అసభ్యకర మాటలతో దాడులకు దిగింది. దాంతో.. ఆమెపై చర్యలు తీసుకోవాలని, చట్ట ప్రకారం శిక్షించాలంటూ.. తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలో కేసు నమోదైంది.
ఒకటా, రెండా.. ఆమె అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు లెక్కకు మంచిన పోస్టులు. అన్నింటిలోనూ బూతులు, అసభ్యకర మాటలే వినిపిస్తాయి. వాటిలో ఆమె తిట్టేది.. ఏదో అల్లాటప్ప వీధి రౌడీలను కాదు.. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రుల స్థాయి నాయకుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని. మహిళగా తనకు గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేసే.. ఆ నటీమణి, రాజకీయ నాయకుల(Politicians) ఇళ్లల్లోని మహిళలపై హద్దులు దాటి విమర్శలు చేసింది. పైగా.. బూతులు, వినలేని మాటలు వాడింది. వాటిపై ఎన్నిసార్లు అభ్యంతరాలు వచ్చినా సరే.. వెనక్కి తగ్గింది లేదు. అందేటని ప్రశ్నిస్తే.. తిరిగి బూతులే సమాధానం. పోనీ ఆమె రాజకీయాలు చెందిన వ్యక్తా అంటే అదీ లేదు. ఆమె నటనకు సంబంధించిన వ్యక్తి.. చేసేది మాత్రం పూర్తిగా రాజకీయ కామెంట్లు. ఇంత చెప్పిన తర్వాత.. ఆమె ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనే.. శ్రీరెడ్డి.
వైసీపీ(YCP) కి అనుకూలంగా, ఇతర పార్టీ నేతలే టార్గెట్ గా అనేక విమర్శలు చేసింది.. శ్రీరెడ్డి. వాటి ద్వారా రాజకీయ లబ్ధి చేకూరుతుందని ఆశించింది. కానీ.. ఎలాంటి ఉపయోగం లేకపోగా, గత ఎన్నికల్ల తాను ఆశించిన వైసీపీ బొక్కబోర్ల పడడంతో, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఏమైందో ఏమో.. రెండు రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చి.. నన్ను క్షమించండి మహాప్రభో, బుద్ధి గడ్డి తిని అలాంటి మాటలు మాట్లాడా అంటూ.. చెంపలు వేసుకుంది. కానీ.. చేసిన పాపం ఊరికే పోతుందా.? తను ఊహించినట్లే.. వెనకే వచ్చింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), విద్యా శాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh), మంత్రి అనితల(Vangalapudi Anitha) పై సోషల్ మీడియాలో అసభ్యకర, అనుచిత వ్యాఖ్యలు చేసిందంటూ.. నటి శ్రీరెడ్డి పై టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మ(TDP women Wing) , తూర్పూగోదావరి జిల్లాలోని బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గత ఐదేళ్ళు వైసీపీ ప్రభుత్వ అండదండలతో సోషల్ మీడియాలో చెప్పరాని మాటలతో తమ నాయకులను కించపరిచారంటూ.. ఆగ్రహించారు.
14 ఏళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబును.. శ్రీరెడ్డి అనేక రకాలుగా దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళా జాతికే అవమానకరంగా మారిన శ్రీరెడ్డిని.. తక్షణమే అరెస్టు చేయాలని టీడీపీ రాష్ట్ర మహిళా నాయకులు డిమాండ్ చేశారు. మహిళా నేతల ఫిర్యాదు స్వీకరించిన బొమ్మూరు సీఐ.. శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 196, 353, 79, 67 కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.
Also Read : RRR కేసును తలపించేలా మాజీ మంత్రి విడదల రజినీపై కేసు నమోదు? ఎస్పీకి ఫిర్యాదు చేసిన భాదితులు
సోషల్ మీడియా వేదికగా రాజకీయ నాయకులనే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా సోషల్ మీడియాతో లాగడం నీచమైన చర్య అన్న టీడీపీ రాష్ట్ర మహిళా నాయకులు.. రాష్ట్రంలో ఇకపై ఎవరూ సోషల్ మీడియాలో ఇష్టానుసారం కామెంట్లు చేయకుండా కఠినంగా వ్యవహరించాలని కోరారు. వీరిపై చర్యలు చూసి.. మిగతా వారు నోరు అదుపులో పెట్టుకోవాలని, రాజకీయాల ముసుగులో, నాయకుల ఇళ్లల్లోని ఆడవారిపై కామెంట్లు చేసిన వారిని శిక్షించాలని కోరారు.