E-Paper
Advertisement

యూట్యూబర్‌ ప్రశ్న రావణ్ అప్రూవర్? విచారణలో అసలు నిజాలు బయటకు, ఇబ్బందులు ఎవరికి?

యూట్యూబర్‌ ప్రశ్న రావణ్ అప్రూవర్? విచారణలో అసలు నిజాలు బయటకు, ఇబ్బందులు ఎవరికి?
Advertisement

Vijayawada: యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ విచారణ ఎంత‌వరకు వచ్చింది? జరుగుతున్న పరిణామాలతో అప్రూవర్‌‌గా మారేందుకు రెడీ అవుతున్నారా? అదే జరిగితే ఈ ఉచ్చులోకి చిక్కుకునేది ఎవరు? మూడు రోజుల పోలీసుల కస్టడీలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

యూట్యూబర్‌ ప్రశ్న రావణ్ అప్రూవర్?

ఏపీలోని ఈ మధ్యకాలం వార్తల్లో నలుగుతున్నారు యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌. అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలకు ఆయన తీవ్రంగా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన ‌అప్రూవర్‌గా మారేందుకు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఆయన వెనుకున్న వ్యక్తుల మెడకు ఈ కేసు చుట్టుకోవడం ఖాయమనే వాదనల ఏపీలో బలంగా వినిపిస్తోంది.

పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడి

Advertisement

తనను రెచ్చగొట్టి జైలు పాలైన తర్వాత బయటకు వస్తానో రానో తెలియని విధంగా ఇరుక్కున్నారు యూట్యూబర్ ప్రశ్న రావణ్. దీనికి కారణమైన వారి గురించి కస్టడీలో వివరాలు పోలీసులకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్‌ను టార్గెట్ చేయడానికి వెనుక జరిగిన కుట్ర, ఫండింగ్ వివరాలను బయట పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. కొందరు నేతల ఫండింగ్, మేధావుల ప్రోత్సాహంతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. కస్టడీలో రావణ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కొందరిపై చర్యలు తీసుకునే అవకాశం పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

రావణ్ సమాచారంపై కొందరిపై చర్యలు

దేశద్రోహ సెక్షన్‌ కింద అరెస్టయిన ప్రశ్న రావణ్‌ను మూడురోజులుగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆదివారం విచారణలో రావణ్ పశ్చాత్తాపం పడినట్టు తెలుస్తోంది. సున్నితమైన అంశాలపై అనవసరంగా స్పందించి కోరి వివాదాలు తెచ్చుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారట. హిందూ దేవతలను కించపరుస్తూ వీడియోలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పదే పదే అధికారులు ప్రశ్నించినా నోరు మెదపలేదని తెలుస్తోంది. మత సామరస్యాన్ని దెబ్బతీయడం కాదా? పలు వివాదాస్పద వీడియోలను చూపించి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. తాను వాటి జోలికి వెళ్లకుండా ఉండాల్సిందని రావణ్‌ రిప్లై ఇచ్చినట్టు తెలిసింది. వీడియోలు రూపొందించేందుకు ఎవరి సూచనల మేరకు చేశారని ప్రశ్నించగా, సొంతంగా తాను చేశానని చెప్పారట. ఇతరుల సూచనలు తీసుకుంటానని వివరించినట్లు సమాచారం.

Advertisement

ALSO READ: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

అదే సమయంలో ఆర్థిక అంశాలపై ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. ఛానల్‌ నిర్వహణలో ఇద్దరు నేతల పాత్రపై ప్రశ్నించినట్టు తెలుస్తోంది. రాజకీయ పార్టీ నేతలతో సంబంధాలు, కథనాల ఎంపికలో వారి ప్రమేయంపై గుచ్చి గుచ్చి అడిగినా నోరు విప్పలేదని తెలుస్తోంది. ఎంత ఆదాయం వస్తుంది? ఛానల్‌ నిర్వహించేందుకు వనరులు మాటేంటి? ప్రతినెలా వచ్చిన ఆదాయాన్ని ఎలా పంచుకున్నారు? ఛానల్‌ అడ్మిన్‌ రైట్స్‌ ఎవరెవరివి? ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధమేంటి? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు గుచ్చి గుచ్చి ప్రశ్నించినట్లు తెలిసింది. కొన్నింటికి వివరాలు తెలియదని చెప్పడంతో వాటి వివరాలు దగ్గర పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తానికి రావణ్ ఇచ్చిన సమాధానాలతో మరికొందర్ని అరెస్టు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Related News

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

ఎల్ నినో పై ఏపీ ప్రభుత్వం మెగా యాక్షన్ ప్లాన్.. సీఎం వ్యూహం ఫలిస్తుందా..?

వైసీపీ ఆరోపణలపై మంత్రి నారాయణ హాట్ కామెంట్స్.. చెత్త ఆరోపణలు అంటూ ఫైర్!

నెల్లూరు జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ చోరీ యత్నం.. విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి!

తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన.. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే ఛాన్స్

ఊరేగింపు రూట్ మార్చాలన్న పోలీసులు.. భగ్గుమన్న హిందూ సంఘాలు!

చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!

Big Stories

Advertisement
×