E-Paper
Advertisement

ఏఐ యుగంలో మిషన్ కర్మయోగి… విజయవాడ వేదికగా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

ఏఐ యుగంలో మిషన్ కర్మయోగి… విజయవాడ వేదికగా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Mission Karmayogi: విజయవాడలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ నిర్వహించిన ‘మిషన్ కర్మయోగి’ వర్క్‌షాప్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని దిశానిర్దేశం చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థలు, ఉద్యోగుల సామర్థ్యాలు మారాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు.

సామర్థ్య పెంపే ప్రగతికి మూలం

Advertisement

దేశం ప్రస్తుతం విప్లవాత్మక మార్పుల ముంగిట నిలిచిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రైల్వే స్టేషన్‌లో చాయ్ విక్రేత స్థాయి నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోదీ ప్రస్థానమే ‘కెపాసిటీ బిల్డింగ్’ కు నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. ఏపీకి చెందిన ఓ సాధారణ ఉపాధ్యాయురాలు ఈ శిక్షణ ద్వారా వేదిక పైకి వచ్చి మాట్లాడగలగడమే ఈ కార్యక్రమ సాధికారతకు నిదర్శనమని కొనియాడారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ‘ఐగాట్-మిషన్ కర్మయోగి’ ఆన్‌లైన్ వేదిక ద్వారా రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి ఉద్యోగుల వరకు నిరంతరం నైపుణ్యాలు పెంచుకోవచ్చని తెలిపారు.

మారుతున్న ప్రపంచం.. భారత్ ముందున్న లక్ష్యం

Advertisement

చైనా 1978లో సామర్థ్య పెంపుపై దృష్టి పెట్టి కొన్ని దశాబ్దాల్లోనే ఆర్థిక శక్తిగా ఎదిగిందని చంద్రబాబు గుర్తుచేశారు. అపారమైన మానవ వనరులు, అవకాశాలు ఉన్న భారత్ ఎక్కడ వెనుకబడిందో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు భారతీయులే నాయకత్వం వహిస్తున్నారని, గతంలో ఐటీ విప్లవాన్ని పుణికిపుచ్చుకున్నట్లే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగానికి అనుగుణంగా మారాలని పిలుపునిచ్చారు.

వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు అవసరం

రాజకీయాల్లో మార్పులు సహజమని, అయితే దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలిపేందుకు ఉద్యోగులందరూ బాధ్యతగా పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనా వ్యవస్థలు నడవాలన్నారు. అభివృద్ధిని నిరోధించే అనవసర నియమావళిని తొలగించి, ‘జన్ విశ్వాస్’ సంస్కరణల ద్వారా నిబంధనలను సులభతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే 20 ఏళ్లు భారత భవిష్యత్తుకు అత్యంత కీలకమని, ప్రభుత్వ శాఖల్లో నాణ్యమైన సేవలు అందించడమే మన అందరి ప్రాథమిక లక్ష్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రభుత్వ యంత్రాంగంపై కీలక వాఖ్యలు..

ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ , ఇ- ఫైళ్ల విధానం, డేల లేక వ్యవస్థల ద్వారా పాలనా వ్యవహారాలను, పౌర సేవల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఐ గాట్- మిషన్ కర్మయోగి పోర్టల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యంత్రాంగం ఏకంగా 2 కోట్ల కోర్సులను పూర్తి చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం పట్ల అధికారులను, ఉద్యోగులను అభినందించారు.

రీల్స్ చూసి సమయం వృథా చేయకండి..

విపత్తుల సమయాల్లోనూ, పండుగల వేళల్లోనూ తమ కుటుంబాలను సైతం పక్కన పెట్టి రాత్రింబవళ్లు ప్రజల కోసం శ్రమించే ఉద్యోగుల సేవలను ప్రభుత్వం ఎప్పటికే విస్మరించదని సీఎం స్పష్టం చేశారు. అందుకే వారి నాయకత్వ లక్షణాలు, సామర్థ్యాలు పెంచేలా శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. రీల్స్ చూడటంలో సమయం వృథా చేయకుండా, కెపాసిటీ బిల్డింగ్ కోసం ఆ సమయాన్ని వెచ్చిస్తే వ్యక్తిగత నైపుణ్యాలు అద్భుతంగా మెరుగుపడతాయని సూచించారు. శాఖల మధ్య సమాచార పంపిణీ నిరంతరాయంగా జరగాలని, సమస్య సంక్షోభంగా మారకముందే గుర్తించి పరిష్కరించేలా నైపుణ్యాలు పెరగాలని పిలుపునిచ్చారు.

మనందరి లక్ష్యం ఒకటే..

సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి దిశగా యంత్రాంగం సమాయత్తం కావాలని, ‘పీ4’ లాంటి భాగస్వామ్య కార్యక్రమాల ద్వారా ప్రతి పౌరుడి జీవన ప్రమాణాలు పెంచడమే మన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రాంతాలు, భాషలు వేరైనా దేశంగా మనందరి లక్ష్యం ఒకటేనని..  భారత్‌ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేందుకు విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ప్రతి ఒక్కరూ కలసికట్టుగా కృషి చేయాలని చంద్రబాబు కోరారు.

Also Read: ఎన్టీఆర్ జిల్లాలో ఘోరం.. పొలంలో కరెంట్ షాక్‌తో ఇద్దరు దుర్మరణం!

Tags

Related News

కమల్ హాసన్ కూడా వేస్ట్.. కొల్లు రవీంద్ర నటనపై పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు!

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాహనం ధ్వంసం, తాడిపత్రిలో టెన్షన్

ఎన్టీఆర్ జిల్లాలో ఘోరం.. పొలంలో కరెంట్ షాక్‌తో ఇద్దరు దుర్మరణం!

వైసీపీలో తీవ్ర ఉక్కపోత .. జగన్‌కు షాక్ ఇవ్వనున్న పవన్ కల్యాణ్, ఉత్తరాంధ్ర నుంచి ఓ మాజీ మంత్రితోపాటు..

విశాఖలో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య.. విచారణకు మంత్రి ఆదేశం, మృతురాలి సొంతూరు హైదరాబాద్

తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయం, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

అనకాపల్లిలో అక్రమ వసూళ్ల చెక్‌పోస్ట్ కలకలం!

Big Stories

Advertisement
×