E-Paper
Advertisement

తిరుపతి సోనోవిజన్‌ షాప్‌లో భారీ చోరీ.. 50 ఐఫోన్లు, 100 స్మార్ట్‌ఫోన్లు గాయబ్!

తిరుపతి సోనోవిజన్‌ షాప్‌లో భారీ చోరీ.. 50 ఐఫోన్లు, 100 స్మార్ట్‌ఫోన్లు గాయబ్!
Advertisement

Sonovision Showroom: తిరుపతి నగరంలో అర్ధరాత్రి వేళ ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూమ్‌లో భారీ చోరీ కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు పక్కా ప్లాన్‌తో వచ్చి.. రూ. కోట్ల విలువ చేసే ఖరీదైన మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఎత్తుకెళ్లారు.

అసలేం జరిగింది?

Advertisement

నగరంలోని కీలక ప్రాంతమైన అన్నమయ్య సర్కిల్‌లో ఉన్న సోనోవిజన్ మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌ను దొంగలు టార్గెట్ చేశారు. ఎవరూ లేని సమయాన్ని చూసి షాప్‌లోకి చొరబడిన దుండగులు.. షోరూమ్‌లోని ఖరీదైన విభాగాన్ని ఊడ్చేశారు. ఇందులో ప్రధానంగా సుమారు 50 దాకా యాపిల్ ఫోన్లతో పాటు, ఇతర ప్రముఖ కంపెనీలకు చెందిన మరో 100 ఎలక్ట్రానిక్ మొబైళ్లను అపహరించారు. వీటితో పాటు మరికొన్ని విలువైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను కూడా పట్టుకెళ్లారు.

రూ. 2 కోట్ల మేర నష్టం!

Advertisement

చోరీకి గురైన ఫోన్లు, పరికరాల మొత్తం విలువ ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు రూ. 2 కోట్ల వరకు ఉంటుందని సదరు సంస్థ ప్రతినిధులు, పోలీసులు భావిస్తున్నారు. అంత పెద్ద మొత్తంలో ఖరీదైన ఐఫోన్లు మాయమవడంతో షాపు యజమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Also Read: జగన్ అడుగేస్తే విధ్వంసం.. నోరు విప్పితే అబద్ధాలు: మంత్రి సవిత

రంగంలోకి పోలీసులు ..

విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. షోరూమ్‌లోని, అలాగే చుట్టుపక్కల వీధుల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని నిశితంగా పరిశీలిస్తున్నారు. దుండగులు ముందుగానే ప్లాన్ చేసి ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి, నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు వేగవంతం చేశారు.

Tags

Related News

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు శుభవార్త, ప్రత్యర్థి శిబిరంలో వణుకు

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!

ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

ఏపీలో పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్.. కేంద్రం వాటా బ్యాంక్ ఖాతాలోకి, ఒకసారి చెక్ చేసుకోండి?

Big Stories

Advertisement
×