Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షాల కారనంగా రోడ్లపై నీరు నిలిచిపోయాయి. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై విపరీతంగా ట్రాఫిక్ ఎర్పడింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేస్తున్నారు. పోలీసు అధికారుల కీలక సూచనలు చేస్తున్నారు. వరద నీటితో నిండిన రోడ్లపై వాహనాలు నడపడం ప్రమాదకరం అని అందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని తెలిపారు భారీ వర్షాల సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచనలు చేశారు.
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనలు చేశారు. వర్షం పరిస్థితులపై జీహెచ్‌ఎంసీ కమిషనర్, కలెక్టర్, సీపీతో ఫోన్‌లో మంత్రి సమీక్షించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. హైదరాబాద్ ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలకు రాజ్‌భవన్ రోడ్, సోమాజిగూడ, ప్రజాభవన్ పరిసరాల్లో రెస్కూటీమ్స్ వాటర్ లాగింగ్ తొలగింపు చర్యలు చేపట్టారు. రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాల్లో మరో రెండు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also Read: మహబూబాబాద్ జిల్లాలో హటెన్షన్.. పెట్రోల్ పోసుకుని రైతు ఆత్మహత్యాయత్నం!
జీహెచ్‌ఎంసీ, పోలీస్, ట్రాఫిక్, హైడ్రా బృందాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో మ్యాన్‌హోల్‌ల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు బయటకు రావొద్దని. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
Also Read: సీదిరి అప్పలరాజు కుమారుడికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు!