Visakha Sarada Peetham: కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పత్తా లేకుండా పోయారు విశాఖ శారదా పీఠం స్వరూపానంద స్వామి. దాదాపు పది నెలలు గడుస్తున్నా మచ్చుకైనా కనిపించలేదు. బహుశా ఆయన కబ్జాలు బయటకు వస్తాయని భావించి బాధ్యతలు శిష్యులకు అప్పగించి హిమాలయాలకు వెళ్లినట్టు తెలుస్తోంది. తాజాగా విశాఖ శారదా పీఠానికి టీటీడీ ఝలక్ ఇచ్చింది. కేవలం 15 రోజులు మాత్రమే డెడ్‌లైన్ విధించింది. ఇంతకీ స్వామి లీలలు ఏంటి? అసలేం జరిగింది?
వైసీపీ హయాంలో రాజభోగాలు అనుభవించిన వారిలో విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానంద స్వామి. స్వామి ఎక్కడకు వెళ్లినా సెక్యూరిటీ ఉండేది. ఆయన్ని కలవాలంటే ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకునేవారు. ఇదంతా ఒకప్పటి రోజులు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వరూపనంద స్వామి సీను రివర్స్ అయ్యింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు మాత్రమే మీడియా ముందుకొచ్చి వచ్చిన చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పేసి పూజల పేరిట వెళ్లిపోయారు. ఆయన ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలీదు. అంతా టాప్ సీక్రెట్. స్వామి వ్యవహారాన్ని కాసేపు పక్కనబెడదాం.
తిరుమలలో విశాఖ శారదా పీఠానికి టీటీడీ నోటీసులు ఇచ్చింది. గత ప్రభుత్వంలో టీటీడీకి చెందిన భూమిని కబ్జా చేసిన కట్టిన భవనాన్ని తమకు అప్పగించాలని అందులో ప్రస్తావించింది. 15 రోజుల్లోపు మఠాన్ని ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని పేర్కొంది. తిరుమలలో స్వరూపనంద స్వామి కబ్జా ఏంటని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం. కొండపై గోగర్భం డ్యామ్ సమీపంలో విశాఖ శారదా పీఠం భవనం ముందు వెనుక నిబంధనలు ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేపట్టారు స్వామి.
వాటిపై అప్పటి వైసీపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ వ్యవహారంపై ప్రజాసంఘాలు, హిందూ ధర్మ పరిరక్షణ సంఘాలు ఆందోళన చేపట్టాయి.చివరకు ఈ వ్యహారంపై టీటీడీ దృష్టి పెట్టింది. శారదా పీఠం మఠం భవన నిర్మాణంలో ఆక్రమణలు జరిగినట్లు టీటీడీ అధికారుల కమిటీ నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా తిరుమలలో శారదా పీఠం ఆక్రమణలను తొలగిస్తామని ఛైర్మన్ బోర్డు సమావేశంలో వెల్లడించారు.
ALSO READ: సూపర్ మార్కెట్లో అడ్డంగా దొరికిన కిలాడీ దంపతులు
ఈ వ్యవహారంపై టీటీడీ నోటీసులు జారీ చేయడం, ఆపై మఠం నిర్వాహకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిపోయింది. నిబంధనలను మఠం ఉల్లంఘించిందని న్యాయస్థానం గుర్తించింది. మఠంపై చర్యలు తీసుకునే అధికారం టీటీడీకి ఉందని తీర్పులో వెల్లడించింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన టీటీడీ అధికారులు శారదా పీఠానికి నోటీసులు ఇచ్చారు. కేవలం రెండువారాల్లో ఖాళీగా చేయాలని వెల్లడించారు. దీనిపై శారదా పీఠం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
అంతకుముందు విశాఖలో ప్రభుత్వ స్థలాన్ని శారదా పీఠం చేసింది. దీనిపై సర్వే చేసిన అధికారులు, పీఠానికి నోటీసులు ఇచ్చారు. ఆ విషయం ఇంకా ఎంతవరకు వచ్చిందనేది తెలీదు. ఈలోగా గోగర్భం డ్యామ్ దగ్గర ఆక్రమ కట్టడం వెలుగులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో స్వరూపానంద స్వామి లీలలు ఇంకెన్ని బయటకు వస్తాయో చూడాలి.