Tirumala news: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. దసరా నెలకు దర్శనం, వివిధ సేవలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి దర్శనం, సేవలు, గదులు కోటాకు సంబంధించి ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది.
దసరా మాసం అక్టోబరుకు సంబంధించి శ్రీవారి అర్జిత సేవా టికెట్లను జులై 19న విడుదల చేయనుంది టీటీడీ. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ పద్దతి కోసం భక్తులు జులై 21 ఉదయం 10 గంటల వరకు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలి.
టికెట్లు పొందినవారు జులై 21 నుంచి 23 వరకు మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బులు చెల్లించి టికెట్లు మంజూరు చేసుకోవాలి ఉంటుంది. డబ్బులు చెల్లించినవారికి మాత్రమే లక్కీడిప్ లో టికెట్లను కేటాయించనుంది టీటీడీ.
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు- ఎలక్ట్రానిక్ డిఐపి రిజిస్ట్రేషన్లు 19న ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉండనున్నాయి. మరల 21న ఉదయం 10 గంటల వరకు తెరిచి ఉంటాయి.
ఈ టికెట్స్ పొందినవారు 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు చెల్లించిన లక్కిడిప్ ద్వారా టికెట్స్ పొందగలరు.
ALSO READ: ఏపీలో విశాఖ తర్వాత విజయవాడ, ఈ క్రెడి్ ఆ నగరానికే ఎందుకు?
అర్జీత సేవలకు ముఖ్యంగా కళ్యాణం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్ల కోసం 22న ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. అంగ ప్రదక్షిణం టికెట్ల కోసం 23న ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉండనున్నాయి.
ఆన్లైన్ సేవ ( వర్చువల్ పాటిస్పెషన్) సేవలు- కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలకు కోటా బుకింగ్ కోసం జులై 22న మధ్యాహ్నం 3 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.
శ్రీవాణి ట్రస్ట్ దర్శనం-వసతి కోటా (రూ. 10,000/)కు సంబంధించి దాతలకు 23న ఉదయం 11 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. అలాగే సీనియర్ సిటిజన్లు -శారీరకంగా వికలాంగుల కోటా టికెట్లు బుకింగ్ కోసం 23న మధ్యాహ్నం 3 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.
ఇక స్పెషల్ ఎంట్రీ దర్శనం (రూ.300) టిక్కెట్లు కోసం జులై 24న ఉదయం 10 గంటల నుండి టికెట్లు అందుబాటులో ఉంటాయి. అలాగే తిరుమల, తలకోన, తిరుపతి వంటి ప్రాంతాల్లో వసతి కోసం అదే రోజు 24న మధ్యాహ్నం 3 గంటల నుండి టికెట్లు అందుబాటులో ఉంటాయి. టీటీడీ వెబ్ సైట్ ద్వారా టికెట్లు, వసతి టికెట్లను బుక్ చేసుకోవాలని తెలిపింది తిరుమల తిరుపతి దేవస్థానం.