Dharmana Big Shock to YS Jagan: ఒక ప్రశ్నకు సమాధానం చెప్పి కార్యక్తల మదిలో వంద ప్రశ్నల పుట్టేలా చేశారాయన. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రసంగం పార్టీ క్యాడర్ ను, అధిష్టాన పెద్దలను ఆలోచనలో పడేలా చేసింది. అసలు ఈయన భవిష్యత్ ప్రణాళిక ఏంటి? ఆయన చూపులు ఎటువైపు అని చెవులు కొరుక్కుంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. అసలు ధర్మాన ప్రసాదరావు మనసు ఏముంది? ఆయన చేసిన కామెంట్స్ ఏంటి? వాటిపై వైసీపీలో జరుగుతున్న చర్చేంటి?
వైసీపీ ప్రభుత్వంలో ఉక్కపోతకు గురైన కాంగ్రెస్ సీనియర్లు
ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన మెజారిటీ నేతలు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లు జగన్ నీడలో వారంతా ఉక్కపోతకు గురైయ్యారు. సరైన ప్రాధాన్యం లేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు లాంటి వారు ఈ జాబితాలోకే వస్తారు. అందుకే తరచూ ఇలాంటి నేతలు పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఓటమి తర్వాత శాసనమండలిలో ప్రతిపక్షనేత హోదా ఇవ్వడంతో బొత్స అడపా దడపా పార్టీ కార్యక్రమాల్లో కనిపించినా.. ధర్మాన మాత్రం ఎక్కడా కనిపించ లేదు.
తాడేపల్లి ప్యాలెస్ వైపు చూడటం మానేసిన ధర్మాన
శ్రీకాకుళం జిల్లా దిగ్గజం ధర్మాన ప్రసాదరావు అయితే ఓటమి తర్వాత తాడేపల్లి ప్యాలెస్ ముఖం చూడటమే మానేశారు. జగన్ జిల్లా సమీక్షలు నిర్వహించినా ధర్మాన హాజరవ్వడం లేదు. దీంతో ఆయన పార్టీ మార్పు ఖాయమని పొలిటికల్స్ సర్కిల్స్ లో చర్చ జరిగింది. ముహూర్తం కూడా కుదిరిందని.. జనసేన లేదా బీజేపీ కండువా కప్పుకోవడమే ఆలస్యమని కూడా పుకార్లు షికారు చేశాయి. కానీ తాజాగా నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరై అందరిని ఆశ్చర్య పరిచారు ధర్మాన. అయితే ఇక్కడే తనదైన ప్రసంగంతో వైసీపీ అధిష్టానాన్ని మరింత కన్ఫ్యూజన్ లో పడేశారని చర్చ జరుగుతోంది. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ మారాల్సి వస్తే తానొక్కడినే మారనని.. జిల్లా మొత్తాన్ని తీసుకుపోతానని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ధర్మాన. కానీ.. జిల్లా ప్రజల ప్రయోజనాలు బేరీజు వేసుకొని తాను నిర్ణయం తీసుకుంటానన్నారు. అంటే.. తప్పదు అనుకున్నపుడు.. జిల్లాలో వైసీపీని ఖాళీ చేసి ఏదో ఒక పార్టీలోకి తరలిస్తానని జగన్‌కు క్లియర్ కట్ సిగ్నల్స్ ను ధర్మాన పంపారన్న టాక్ నడుస్తోంది.
కూటమి ప్రభుత్వంలో టీడీపీని మాత్రమే టార్గెట్ చేస్తున్న ధర్మాన
ప్రస్తుతం ప్రభుత్వ వైఫల్యంలో పాపమంతా టీడీపీదేనని ఆయన చేసిన కామెంట్స్ వెనుక కూడా చాలా పెద్ద వ్యూహం కనిపిస్తోందంటున్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన, బీజేపీ పాత్ర ఏమీ లేదని.. అసలు పవన్ అమాయకుడని ఆయన అభిప్రాయపడుతున్నట్లు చెప్తున్నారు. ఇలాంటి కామెంట్స్‌తో బీజేపీ లేదా జనసేనలోకి వెళ్లేందుకు ధర్మాన ఆప్షన్స్ తెరచి పెట్టుకుంటున్నారని పొలిటికల్ పండితులు చెబుతున్నారు. విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబుపై ధర్మాన చేసిన కామెంట్స్ కూడా ఆయన రూట్‌ను క్లియర్ చేసేలా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. వైసీపీ హాయంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రచారం చేస్తే ప్రయోజనం లేదని.. చందబాబు వైఫల్యాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించడం ధర్మాన రాజకీయ చతురతకు నిదర్శమని చాలా మంది చెబుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత క్రియేట్ చేయాలని.. ఆ వ్యతిరేక పవనాలు వైసీపీకి అనుకూలంగా మారకుండా ఉండాలంటే జగన్ చేసిన కార్యక్రమాలు ప్రచారంలో ఉండకూడదన్నది ధర్మాన వ్యూహంగా కనిపిస్తోంది. రేపటి రోజున పార్టీ మారితే ప్రభుత్వ వ్యతిరేకత తనకు ఉపయోగపడుతుందని ఆయన స్కెచ్ గీసుకున్నారని సిక్కోలు రాజకీయ ఉద్దండులు విశ్లేషిస్తున్నారు.
Also Read: ఐదేళ్లు.. ఐదు రాష్ట్రాలు.. 785 మంది భర్తల హతం.. కారణాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!
అధికారాన్ని కోల్పోయిన తర్వాత ధర్మాన సైలెన్స్.. జిల్లాతో పాటు రాష్ట్ర పార్టీలో పెద్ద దూమారమే రేపుతోంది. ధర్మాన మౌనాన్ని వీడి ఆయన వెర్షన్ ఏంటో చెప్పాలని కార్యకర్తలు చాలా సార్లు విజ్ఞప్తులు, డిమాండ్స్ చేశారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక విస్తృత స్థాయి సమావేశంలో ధర్మాన తన వెర్షన్ వినిపించారని వైసీపీలో ఓ వర్గం చెబుతోంది. పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గితే తన దారి తాను చూసుకుంటానని సూటిగా, స్పష్టంగా చెప్పేశారని అంటున్నారు ఆయన సన్నిహితులు.
Story By Rami Reddy, Bigtv