BigTV English

Tirumala News: తిరుమల భక్తులకు తీపికబురు.. కొద్ది గంటలు మాత్రమే

Tirumala News: తిరుమల భక్తులకు తీపికబురు.. కొద్ది గంటలు మాత్రమే

Tirumala News: శ్రీవారి దర్శనం కోసం అక్టోబర్ కోటాను విడుదల చేసింది టీటీడీ. అంగ ప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్ట్, వయోవృద్ధులు, దివ్యాంగుల ఉచిత దర్శనం టికెట్లను అందుబాటులో ఉంచింది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 రూపాయల టికెట్లు, వసతికి సంబంధించిన కోటాను విడుదల చేయనుంది.


దసరా మాసం కావడంతో శ్రీవారి టికెట్ల కోసం ఆన్‌లైన్‌లో భక్తులు ఎగబడుతున్నారు. ఆన్‌లైన్‌లో బుకింగ్ ఓపెన్ చేసిన నిమిషాల వ్యవధిలో టికెట్లు అయిపోతున్నాయి. ప్రతి నెలా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టోకెన్లు, వసతి గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. అక్టోబ‌ర్‌ నెలకు సంబంధించి ఆయా టికెట్లను రెడీ చేసింది.

300 రూపాయల దర్శనం టికెట్లు, వసతి గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అక్టోబర్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్లు విడుదల చేస్తోంది. బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్ల కోటా రెడీ చేసింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు వ‌యో వృద్ధులు, దివ్యాంగులు శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు ఉచిత‌ ద‌ర్శనం టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది తిరుమల తిరుపతి దేవస్థానం.


స్లాటెడ్‌ సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు సిఫార్సు లేఖలపై గదుల కేటాయింపును టీటీడీ రద్దు చేసినట్టు తెలుస్తోంది. తిరుపతిలో విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇచ్చిన సమయంలో భక్తులు శ్రీవారిని దర్శించుకోవాలి. కొందరు ముందుగా తిరుమలకు చేరుకుని గదులు పొందేందుకు సిఫార్సు లేఖలు తీసుకొస్తున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది.

ALSO READ: వర్షాకాలంలో పుట్టగొడుగుల సందడి, ఎక్కడ దొరుకుతాయి, ఎలా గుర్తించాలి?

వీరి సంఖ్య ఇటీవలకాలంలో పెరిగింది. అదే సమయంలో రూ.300 టికెట్లు పొందిన భక్తులు దూర ప్రాంతాల భక్తులకు సిఫార్సులపై గదుల ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులు రెండుమూడు గదులు పొందుతున్నట్లు టీటీడీ గుర్తించింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా గదులు కేటాయించనుంది. మొత్తానికి భక్తులకు సౌకర్యాలు అందించేందుకు గతంలో ఉన్న లోపాలను సరిదిద్దుతూ వస్తోంది టీటీడీ.

మరోవైపు భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేసేందుకు తిరుమల అన్నమయ్య భవనం ఎదురుగా టికెట్ల కేంద్రాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. దర్శనం కోసం భక్తులు ఉదయం 5 గంటల నుంచి క్యూలైన్లలో ఉంటున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది.

భక్తులకు సులభతరంగా టికెట్లు జారీ చేసేందుకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో నూతన కౌంటర్లను నిర్మించింది. బుధవారం నుంచి ఈ కౌంటర్ల ద్వారా టికెట్ల పంపిణీ ప్రారంభం కానుంది. తిరుమల వచ్చే భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని టీటీడీ ఛైర్మన్ కోరారు.

తిరుమలలో కొత్తగా ల్యాబ్ ఏర్పాటు చేసింది టీటీడీ. దీన్ని టీటీడీ ఛైర్మన్ మంగళవారం ప్రారంభించారు. శ్రీవారి ప్రసాదంలోని నెయ్యి నాణ్యతను పరీక్షించాలంటే వేరే రాష్ట్రాలకు శాంపిల్స్ పంపించేవారు. ఇప్పుడు తిరుమలలో అత్యాధునిక పరికరాలతో ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు వివరించారు ఛైర్మన్. తొలిసారిగా నెయ్యిలో కల్తీ శాతం, నాణ్యత శాతం విశ్లేషించే అవకాశం వచ్చిందన్నారు.

Related News

Pulivendula ZP: పులివెందుల జెడ్పీ.. ఆ ముగ్గురు వ్యూహం, బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్

Jagan: కూలిపోతున్న పులివెందుల కోట.. తప్పు ఎక్కడ జరిగింది? టెన్షన్‌లో జగన్‌

Viveka Murder Case: వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

Big Stories

×