Top 5 Best Crime Thrillers : 2025లో ఇండియన్ ఓటీటీలో వెబ్ సిరీస్‌లు గట్టి పోటీతో నడుస్తున్నాయి. ఈ సిరీస్‌లు క్రైమ్, థ్రిల్లర్, డ్రామా, యాక్షన్ జోనర్‌లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సంవత్సరం ఓటీటీలో టాప్ లేపుతున్న 5 క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Criminal Justice: A Family Matter
జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హిందీ లీగల్ డ్రామా 2025లో టాప్ స్థానంలో నిలిచింది. పంకజ్ త్రిపాఠీ, మాధవ్ మిశ్రాగా తన తెలివైన, సానుభూతితో కూడిన లాయర్ పాత్రతో మళ్లీ ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో రాజ్ నాగ్‌పాల్ అనే డాక్టర్‌పై హత్య కేసు నడుస్తుంది. అతని ఇంట్లో రోష్ని అనే నర్సు హత్యకు గురవుతుంది. దీనిలో రాజ్, అతని భార్య అంజు ఇరుక్కుంటారు. కుటుంబ రహస్యాలు, నమ్మకద్రోహం, కోర్టు డ్రామాతో ఈ కథ ఆసక్తికరంగా సాగుతుంది. ఒర్మాక్స్ మీడియా ప్రకారం, ఈ సిరీస్‌ని 27.7 మిలియన్ మంది చూశారు. ఇది ఎమోషనల్ డ్రామా, గట్టి కథనంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
2. Special Ops Season 2
జియోహాట్‌స్టార్‌లో 2025 జులై 18న విడుదలైన ఈ హిందీ యాక్షన్ ఎస్పియనేజ్ థ్రిల్లర్‌ని నీరజ్ పాండే సృష్టించారు. ఇందులో కే కే మీనన్ హిమ్మత్ సింగ్‌గా RAW ఏజెంట్ పాత్రలో నటించాడు. ఈ సీజన్ టెర్రరిజం నుంచి సైబర్ వార్‌ఫేర్, AI థ్రెట్స్ చుట్టూ తిరుగుతుంది. ఒక టాప్ సైంటిస్ట్ డాక్టర్ పియూష్ కిడ్నాప్, ఒక సీనియర్ ఆఫీసర్ హత్యతో కథ మొదలవుతుంది. సుధీర్ అనే సైబర్ ఎక్స్‌పర్ట్ భారత్ UPI సిస్టమ్‌పై దాడి చేయాలని ప్లాన్ చేస్తాడు. హిమ్మత్ సింగ్ తన టీమ్‌తో ఈ దాడిని అడ్డుకోవడానికి పోరాడుతాడు. యాక్షన్, సస్పెన్స్, ట్విస్ట్‌లతో నిండిన ఈ సిరీస్ థ్రిల్లర్ ఫ్యాన్స్‌కి బాగా నచ్చింది.
3. Khakee: The Bengal Chapter
నెట్‌ఫ్లిక్స్‌లో 2025 మార్చి 20న విడుదలైన ఈ బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్‌ని నీరజ్ పాండే సృష్టించారు. ప్రసేన్‌జిత్ చటర్జీ, జీత్, పరంబ్రత చటోపాధ్యాయ్ ఇందులో నటించారు. IPS ఆఫీసర్ అర్జున్ మైత్రా (జీత్) కొల్‌కతాలో క్రైమ్, అవినీతితో నిండిన గ్యాంగ్‌స్టర్ బాఘా (సస్వత చటర్జీ)ని పట్టుకోవడానికి పోరాడతాడు. రాజకీయ ఒత్తిళ్లు, అవినీతి, గ్యాంగ్‌స్టర్ హింస మధ్య అర్జున్ న్యాయం కోసం పోరాడే విధానం ఈ కథకు హైలైట్ గా నిలుస్తుంది.
4. Sattamum Needhiyum
ZEE5లో 2025 జులై 18 న విడుదలైన ఈ తమిళ కోర్ట్‌రూమ్ డ్రామా సిరీస్‌ని బాలాజీ సెల్వరాజ్ డైరెక్ట్ చేశాడు. సరవణన్ (సుందరమూర్తిగా), నమ్రితా ఎమ్‌వీ (అరుణగా) నటించారు. సుందరమూర్తి ఒక నోటరీ పబ్లిక్. కోర్టు కేసులకు దూరంగా ఉంటాడు. కానీ కుప్పుస్వామి అనే వ్యక్తి తన కూతురు వెన్నిలా మిస్సింగ్ కేసులో కోర్టు ముందు ఆత్మహత్య చేసుకుంటాడు. ఇది సుందరమూర్తిని కదిలిస్తుంది. అతను అరుణ సహాయంతో ఈ కేసును తీసుకుని, అవినీతి, రాజకీయ ఒత్తిళ్లతో పోరాడతాడు. వెన్నిలా అదృశ్యం వెనుక రహస్యాలు ఈ సిరీస్‌ని ఎమోషనల్‌గా ఆకట్టుకునేలా చేసింది.
5. Untamed
నెట్‌ఫ్లిక్స్‌లో 2025లో విడుదలైన ఈ ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఒక అమెరికన్ పార్క్ స్పెషల్ ఏజెంట్ చుట్టూ తిరుగుతుంది. యోస్మైట్ నేషనల్ పార్క్‌లో ఒక మహిళ మృతదేహం ఎల్ కాపిటన్ నుంచి పడినట్టు కనిపిస్తుంది. మొదట ఇది యాక్సిడెంట్‌లా అనిపిస్తుంది. కానీ ఆమె షూట్ చేయబడి హత్యకు గురైనట్టు తెలుస్తుంది. ఏజెంట్ ఈ కేసును విచారిస్తూ, పార్క్‌లోని క్రైమ్, రహస్యాలను బయటపెడతాడు. యాక్షన్, సస్పెన్స్ నేపథ్యంతో ఈ సిరీస్ థ్రిల్లర్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది.
Read Also : ఈ లేడీ సైకో ఎంతకు తెగిచింది భయ్యా ? బతికుండగానే చర్మాన్ని వలిచి టార్చర్… ఒక్కో ట్విస్ట్ కు గుండె గుభేల్