Twist in Vamsi case: గన్నవరం వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారం ఆసక్తికర మలుపు తిరుగుతోంది. వంశీ విజయవాడకు వచ్చిన నేపథ్యంలో సినిమాని తలపించేలా కొత్త ట్విస్టులు బయటకు వస్తున్నాయి. వంశీపై ఫిర్యాదు చేసిన ముదునూరు కిరణ్, ముద్దునూరు సత్య వర్ధన్ జాడ కనిపించలేదు. దీంతో వంశీ కేసు ముందుకు వెళ్తుందా? లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గురువారం ఉదయం హైదరాబాద్‌లో వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆయన్ని పోలీసులు తరలించారు. వంశీపై కేసులు నమోదు చేసే క్రమంలో పోలీసులు ఆధారాలు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వంశీపై ఫిర్యాదు చేసిన కిరణ్, సత్య వర్ధన్ కుల ధ్రువీకరణ పత్రాల కావాలంటూ విజయవాడ రూరల్ ఎమ్మార్వోకు విజయవాడ ఏసిపి దామోదర్ లేఖ రాశారు. వల్లభనేని వంశీతో పాటు మరికొందరిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినందుకు ఫిర్యాదుదారుల కుల దృవీకరణ పత్రం అవసరం ఏర్పడింది.
కేసు విచారణ ముందుకు వెళ్లాలంటే ఫిర్యాదు దారుల కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి అంటున్నారు విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్. ఏసీపీ లేఖతో రెవిన్యూ అధికారులను రామవరప్పాడులోని సత్యవర్ధన్ ఇంటికి వెళ్లారు. అక్కడ తాళాలు వేసి ఉన్నాయి. ఆయన ఫ్యామిలీ సభ్యులంతా అజ్ఞాతంలోకి వెళ్లారు. రామవరపాడులో ఇంట్లో ఎవరు అందుబాటులో లేనందున రెవెన్యూ అధికారులు వెనుదిరిగారు.
వంశీతోపాటు మరికొందరిపై ఎస్టీ, ఎస్సీ కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఫిర్యాదుదారుల కమ్యూనిటీ నిర్ధారించాల్సి వుంది. ఇదిలావుండగా వారం రోజులుగా సత్య వర్థన్‌ను విశాఖపట్నంలో బంధించారు వంశీ అనుచరులు. సత్యవర్థన్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫ్యామిలీ సభ్యులు. వర్థన్ మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వైజాగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. వంశీ అనుచరుల నుంచి సత్యవర్థన్ ను కాపాడారు పోలీసులు.
ALSO READ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలింపు
ఇదిలావుండగా పోలీసుల తీరుపై వంశీ లాయర్లు మండిపడ్డారు. గంటకు పైగా కృష్ణలంక పీఎస్ లో వల్లభనేని వంశీ ఉంచి విచారించారు పోలీసులు. ఆయన నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు. మరి న్యాయమూర్తి ముందు ఇవాళ వంశీని హాజరుపరుస్తారా లేదా అనేది చూడాలి.
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మరో ట్విస్ట్..
విశాఖలో వల్లభనేని వంశీ అనుచురులు అరెస్ట్
ఎలినేని దుర్గా ప్రసాద్ ను అరెస్టు చేసి తీసుకెళ్లడంతో ఆందోళనలో అతడి తల్లి శ్రీదేవి
మరోవైపు.. పోలీసుల అదుపులో సత్యవర్థన్, లక్ష్మీపతి, డ్రైవర్ ఉన్నట్లు సమాచారం pic.twitter.com/kTpZEZhgZH
— BIG TV Breaking News (@bigtvtelugu) February 13, 2025