Mohanlal – Suchitra:మాలీవుడ్ మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ లాల్ (Mohan Lal) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ మధ్యకాలంలో తెలుగులో కూడా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ముఖ్యంగా మాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే సినిమాలు చేయకుండా.. అవకాశం వస్తే , ముఖ్యమైన పాత్ర అనిపిస్తే , తప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. దీంతో మోహన్ లాల్ పాన్ ఇండియా హీరోగా భారీ గుర్తింపు దక్కించుకున్నారు. ఇటీవల డైరెక్టర్ గా కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
ఇదిలా ఉండగా మోహన్ లాల్ సతీమణి సుచిత్ర (Suchitra) కూడా అందరికీ పరిచయమే. ఇకపోతే పెళ్లికి ముందు జరిగిన లవ్ స్టోరీని తాజాగా మోహన్ లాల్ రివీల్ చేశారు. మోహన్ లాల్ మాట్లాడుతూ.. “నా పెళ్ళికి ముందు నేను ఎక్కువగా విలన్ పాత్రలు పోషించేవాడిని. ఆ సినిమాలు చూసి నన్ను సుచిత్ర ద్వేషించడం మొదలుపెట్టిందట. అయితే ఒక కామన్ ఫ్రెండ్ పెళ్లికి వెళ్లినప్పుడు, తొలిసారి నేను ఆమెను చూసి, ఆమెతో మాట్లాడడం జరిగింది. అదే సమయంలోనే ఆమె నాకు ఎంతో నచ్చింది. అలా మొదలైన మా పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక ఆ తర్వాత కాలంలో నా రియల్ క్యారెక్టర్ ని చూసి సుచిత్రకి నాపై మంచి అభిప్రాయం ఏర్పడింది. అలా నాపై ఇష్టాన్ని నేరుగా చెప్పకుండా , పేరు రాయకుండా ఒక ఐదు ఆరు ప్రేమలేఖలు నాకు పంపింది. నేను వాటిని జాగ్రత్తగా ఇప్పటికీ దాచుకున్నాను. కొన్నాళ్లకు నన్ను ప్రేమిస్తున్న విషయాన్ని వాళ్ళ ఇంట్లో అమ్మానాన్నలకు చెప్పింది. ఇక తర్వాత పెద్దవాళ్లు మా పెళ్లి ఖాయం చేశారు. ఆ తర్వాతే మేమిద్దరం ఒకరి తర్వాత ఒకరు ప్రేమించుకుంటున్నాం అన్న విషయాన్ని పంచుకున్నాము. అంతవరకు మా మనసులో ఎంత ప్రేమ ఉన్నా.. మేము మాత్రం ఓపెన్ కాలేదు. అలా 30 ఏళ్ల క్రితం నా జీవితంలోకి సుచిత్ర వచ్చింది. పెళ్లికాక ముందు నన్ను సుచిత్ర “సుందర కట్టప్పన్” అని పిలిచేది. అంటే “అందమైన అబ్బాయి” అని అర్థం. ఇక అప్పటినుంచి మేమిద్దరం సంతోషంగా జీవితాన్ని పంచుకున్నాము అలా మా బంధంలో ఏ రోజు కూడా అవకతవకలు జరగలేదు” అంటూ తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చారు మోహన్ లాల్. ఇది చూసిన నెటిజెన్స్ మీ లవ్ స్టోరీ తో సినిమా చేయొచ్చు గురూ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
మోహన్ లాల్ సినిమాలు..
మోహన్ లాల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఏడు సినిమాలలో నటిస్తున్నారు. అవన్నీ కూడా ఈ ఏడాదే రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. గత ఏడాది కేవలం రెండు చిత్రాలతో మాత్రమే ప్రేక్షకులను అలరించిన ఈయన.. ఇప్పుడు ఈ ఏడాదిని తనకి అనుకూలంగా మార్చుకొని, అన్ని సినిమాలను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే భారతదేశంలో ఏడాదిలో అత్యధిక సినిమాలు రిలీజ్ చేసే ఏకైక స్టార్ కూడా మోహన్లాల్ అన్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా మాలివుడ్లో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ లాల్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని అలరిస్తున్నారు అని చెప్పవచ్చు.