BigTV English

Valentines Day Special : ప్రేమ… రెండు అక్షరాల మహా కావ్యం

Valentines Day Special : ప్రేమ… రెండు అక్షరాల మహా కావ్యం

Valentines Day Special : కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లోనే కాకుండా వరల్డ్ సినిమాలో ఎప్పటికీ ప్రత్యేకంగా ఉండే కాన్సెప్ట్ ప్రేమ. ప్రేమ… ఆర్య సినిమాలో సుకుమార్ చెప్పినట్లు ఇది రెండు అక్షరాల మహాకావ్యం. దూరం తెలియని, పరిచయం లేని ఇద్దరి మనుషుల మధ్య ఏర్పడే ఈ బంధం వర్ణానాతీతం. “ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవు రా” అని ఒక పాటలో చెప్పినట్లు, ప్రేమ అనే అనుభూతిని పొందడం అనేది అందరికీ సాధ్యం కాని పని. కొన్ని ప్రేమలు సఫలం అవ్వచ్చు, మరికొన్ని ప్రేమలు విఫలం అవ్వచ్చు. కానీ ప్రేమ అనే పదంలోనే ఏదో మ్యాజిక్ ఉంది. ఎక్కువ శాతం ప్రేమ కథ చిత్రాలే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనూ మంచి సక్సెస్ సాధించాయి. అన్ని ప్రేమ కథల్లో కథ ఒకేలా ఉన్నా కూడా, ఆ ప్రేమలో ఉన్న అనుభూతులు మాత్రం ఆడియన్స్ కి ఎప్పటికీ ఒక ఫ్రెష్ ఫీల్ ఇస్తూనే ఉంటాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో ప్రేమకథ సినిమాలు ఉన్నాయి. అలాంటి కొన్ని ప్రేమకథా చిత్రాల గురించి ఈ ఆర్టికల్. పాత తరం ప్రేక్షకులకు మల్లీశ్వరి,మూగమనసులు,దేవదాసు, గీతాంజలి వంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి. కానీ ఈ తరం ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోయే కొన్ని సినిమాలు గురించి మాట్లాడుదాం.


తొలి ప్రేమ

జీవితంలో ప్రేమ ఒకసారి పుడుతుంది అనేది వాస్తవం. అది ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఏదైనా కావచ్చు. కానీ ఏ ప్రేమలో అయితే మనం తారాస్థాయికి చేరిపోతామో అదే నిజమైన ప్రేమ. ఏది ఏమైనా కూడా తొలిప్రేమలో ఉన్న స్వచ్ఛత వేరు. కరుణాకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా గురించి మాటల్లో చెప్పలేము. అది ఒక సినిమా అనేదానికంటే కూడా అది ఒక అనుభూతి. హీరో హీరోయిన్ తో క్లైమాక్స్ కరుణాకర్ డిజైన్ చేసిన విధానం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక వండర్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఆ సినిమాకి ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. తొలిప్రేమలో ఉన్న స్వచ్ఛత ఏంటో ఆ సినిమా చూసిన తర్వాత కూడా చాలామందికి అర్థమైంది. ఈ మూవీని ప్రస్తుతం యూట్యూబ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో చూడొచ్చు.


గీతాంజలి

మణిరత్నం గీతాంజలి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రెండు రకాల వ్యాధులకు గురి అయిన ఇద్దరి మధ్య పరిచయం అనేది ఒక చక్కని అనుభూతుల ప్రేక్షకులకు అనిపిస్తుంది. ప్రకాష్ గీతాంజలి అని క్యారెక్టర్స్ మధ్య మణిరత్నం చేసిన మ్యాజిక్ మన మనసును మాయ చేస్తుంది. ఆ రెండు పాత్రలకు విపరీతంగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఆ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నాగార్జున కెరీర్‌లో ఇప్పటికీ ఆ సినిమాకి ఒక కల్ట్ స్టేటస్ ఉంటుంది. ఈ సినిమా యూట్యూబ్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ ఓటిటిలలో అవైలబుల్ గా ఉంది.

ఆర్య

గబ్బర్ సింగ్ సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి హరీష్ శంకర్ చెప్పినట్లు ఈ సినిమాకి ఉండే స్థాయి వేరు స్థానం వేరు. ఒక ప్రేమ కథను ఇలా కూడా చెప్పొచ్చు అని ఒక కొత్త శైలిని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి క్రియేట్ చేసిన దర్శకుడు సుకుమార్. ఆర్య – గీత – అజయ్ ఈ పాత్రలు ఎప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో మిగిలిపోతాయని చెప్పాలి. ఒక పెయిన్ ఫుల్ లవ్ స్టోరీని ఎంటర్టైన్మెంట్ వేలో చెబుతూ ఆడియన్స్ కి ఒక కొత్త సర్ప్రైజ్ అందించాడు ఈ లెక్కలు మాస్టర్. అంతే కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లెక్కలను కూడా మార్చేశాడు. అల్లు అర్జున్ కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆర్య సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. కేవలం అల్లు అర్జున్ కి మాత్రమే కాకుండా దిల్ రాజు ని కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాతగా నిలబెట్టిన సినిమా కూడా ఆర్యనే. సినిమాలో ప్రతి సీను కొత్తగా ఉంటుంది ఫ్రెష్ గా ఉంటుంది. ఇప్పుడు చూసినా కూడా ఆ రోజుల్లో ఈ సినిమాను ఎలా తీశారు అని ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. ఈ సినిమా సన్ నెక్స్ట్ ఓటిటిలో అవైలబుల్ గా ఉంది.

7G బృందావన్ కాలనీ

ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సెల్వరాఘవన్ ఈ సినిమాను డిజైన్ చేసిన విధానం… ఆ పాత్రలను రాసిన తీరు… ఏదో కావాలని కాకుండా వాస్తవిక జీవితానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. ముఖ్యంగా రవి క్యారెక్టర్ చాలామంది కుర్రాళ్లకు అప్పట్లో విపరీతంగా కనెక్ట్ అయింది. ఇప్పటికీ కూడా ఆ సినిమా రీ రిలీజ్ అయితే చాలామంది యూత్ బ్రహ్మరథం పడుతున్నారు అంటే దానికి కారణం ఆ సినిమా కాన్సెప్టే. ఆ రోజుల్లోనే దర్శకుడు సెల్వరాఘవన్ ఆ సినిమాను తెరకెక్కించిన విధానం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.ఈ సినిమా సన్ నెక్స్ట్ ఓటిటిలో అవైలబుల్ గా ఉంది.

అర్జున్ రెడ్డి

ఇది ఒక మామూలు కథ. కథగా మాట్లాడితే పెద్దగా ఏమీ లేని కథ. కానీ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమా అంత స్టేటస్‌ను మళ్ళీ అందుకున్న సినిమా ఇది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో శివ సినిమా తర్వాత అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి. అర్జున్ అండ్ ప్రీతీ పాత్రలను సందీప్ రెడ్డి వంగ డిజైన్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్. ప్రేమలో ఉండే గాఢత అత్యద్భుతంగా వెండి తెరపై పరిచేశాడు సందీప్ రెడ్డి. సినిమాను చూస్తున్నంత సేపు కూడా ఇంత అద్భుతంగా ఎలా తీయగలిగాడు, ఇంత బాగా ఎలా రాయగలిగాడు. తెలుగు సినిమా మీటర్ దాటి ప్రేక్షకుడిని మనసుని అందుకున్న సినిమా ఇది. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సందీప్ రెడ్డి వంగ ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది.

సీతారామం

వాస్తవానికి ఇది యుద్ధంతో రాసిన ప్రేమ కథ. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రేమ కథ చిత్రాలను తెరకెక్కించే దర్శకులు తక్కువ అయిపోయారు, అనుకునే తరుణంలో మాకు ఉన్నాడు మణిరత్నం అని అనిపించుకున్నాడు హను రాఘవపూడి. సీత అండ్ రామ్ క్యారెక్టర్స్ రీసెంట్ టైమ్స్ లో ది బెస్ట్ అని చెప్పాలి. వెండి తెరపై ఒక అందమైన కావ్యాన్ని గీశాడు హను. ప్రేమలో ఉండే స్వచ్ఛతను అందంగా అద్భుతంగా ప్రేక్షకుడికి అందించాడు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది.

కేవలం ఈ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రేమ కథ చిత్రాలు కో కొల్లలుగా ఉన్నాయి. ఎంత మాట్లాడినా కూడా తనివి తీరని అంశాలు కొన్ని ఉన్నట్లు, ఎంత చెప్పినా కూడా మరోసారి చెప్పొచ్చు అనే అంశం ప్రేమ కథ. అందుకే చాలా మంది కొత్త దర్శకులు తమ మొదటి కాన్సెప్ట్ గా ప్రేమ కథ సినిమాలను ఎంచుకుంటారు. ప్రేమ సఫలమైన విఫలమైన ప్రేమ ఒక సరికొత్త వర్ణనాతీత అనుభూతి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×