BigTV English

Mirai: తేజ సజ్జా ‘మిరాయ్’కు అదిరిపోయే ఓటీటీ డీల్.. ఎంతో తెలుసా.?

Mirai: తేజ సజ్జా ‘మిరాయ్’కు అదిరిపోయే ఓటీటీ డీల్.. ఎంతో తెలుసా.?

Mirai: ఈరోజుల్లో సినిమాకు థియేట్రికల్ రైట్స్ ఎంత ముఖ్యమో.. ఓటీటీ డీల్ కూడా అంతే ముఖ్యం అయిపోయింది. చాలావరకు సినిమాలకు థియేటర్లలో యావరేజ్ టాక్ వచ్చినా.. వాటిని ఓటీటీలో చూసి ఆదరిస్తున్న ప్రేక్షకుల సంఖ్య పెరిగిపోయింది. అందుకే కొన్ని చిత్రాలు థియేటర్లలో విడుదల అవ్వక ముందే ఆ మేకర్స్‌ను, హీరోలను నమ్మి కొంటున్న ఓటీటీ సంస్థలు ఎన్నో ఉన్నాయి. తాజాగా తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ‘మిరాయ్’ సినిమాకు కూడా అదే జరిగింది. ప్రముఖ ఓటీటీ సంస్థతో ‘మిరాయ్’ మేకర్స్ చర్చలు జరుపుతున్నారని, ఇప్పటివరకు తేజ సజ్జా కెరీర్‌లోనే లేనంత రేంజ్‌లో దీని ఓటీటీ బిజినెస్ జరుగుతుందని సమాచారం.


పెరిగిన గ్రాఫ్

ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన తేజ సజ్జా (Teja Sajja).. కొన్నాళ్ల పాటు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నాడు. మళ్లీ ‘ఓ బేబి’ సినిమాలో హీరోగా ఒక కాకుండా ఒక కీలక పాత్రలో కనిపిస్తూ ప్రేక్షకులను మరోసారి పలకరించాడు. అక్కడి నుండి తను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘ఓ బేబి’లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా కూడా ఆ తర్వాత సినిమాల్లో తనకు హీరోగా నటించే ఛాన్స్ లభించింది. అలా తేజ హీరోగా నటించిన సినిమాలు హిట్ అవ్వడం మొదలయ్యింది. ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా నటించిన ‘హనుమాన్’ తర్వాత తన గ్రాఫ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దాని తర్వాత తను హీరోగా నటిస్తున్న చిత్రమే ‘మిరాయ్’. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.


భారీ హైప్

‘హనుమాన్’ సినిమా అంతగా అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. అందులో తేజ సజ్జా యాక్టింగ్‌కు కూడా మంచి మార్కులు పడడంతో తనపై కూడా ఆడియన్స్‌లో నమ్మకం వచ్చింది. తన స్టోరీ సెలక్షన్ బాగుంటుందని పాజిటివ్ అభిప్రాయం క్రియేట్ అయ్యింది. ‘హనుమాన్’ తర్వాత ‘మిరాయ్’ అంటూ మరో కొత్త కాన్సెప్ట్‌తో మూవీని ప్రకటించాడు తేజ. ప్రకటించడంతో పాటు వెంటనే దానికి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశాడు. ఆ గ్లింప్స్‌తోనే మూవీ ఎలా ఉంటుంది అనే ఐడియా ప్రేక్షకులకు వచ్చేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ డీల్ చూస్తుంటే ‘మిరాయ్’ ఏ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేసిందో అర్థమవుతోంది.

Also Read: ఏమీ చేయకపోవడమే ఇష్టం.. ఇదేమి అలవాటు బన్నీ? షాకవుతున్న ఫ్యాన్స్

ఓటీటీ హక్కుల గొడవ

‘మిరాయ్’ (Mirai) ఓటీటీ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్.. మేకర్స్‌ను సంప్రదించిందట. అసలైతే ముందుగా ‘మిరాయ్’ హక్కుల కోసం రూ.23 కోట్లు కోట్ చేద్దామని ప్రైమ్ యాజమాన్యం అనుకుందట. కానీ మేకర్స్ ఈ విషయంలో ఏ మాత్రం తగ్గకపోవడంతో ఫైనల్‌గా రూ.28 కోట్లు కోట్ చేసిందని తెలుస్తోంది. ‘మిరాయ్’ టీమ్ మాత్రం పూర్తిగా రూ.30 కోట్లకే ఓటీటీ డీల్ లాక్ చేయాలని ప్రయత్నం చేస్తుందని తెలుస్తోంది. అందుకే అమెజాన్ ప్రైమ్ ఈ విషయంలో కన్ఫ్యూజన్‌లో పడిందట. ‘హనుమాన్’ లాంటి ఒక సినిమా హిట్ అవ్వడంతో తేజ సజ్జా రేంజ్ ఏ రేంజ్‌లో పెరిగిందని ‘మిరాయ్’ ఓటీటీ డీల్ చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటున్నారు ఇండస్ట్రీ నిపుణులు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×